కావలికోట లైబ్రరీ
తరచూ అడిగే ప్రశ్నలు—కావలికోట లైబ్రరీ
కావలికోట లైబ్రరీ పని చేయాలంటే, మీ కంప్యూటర్‌లో లేదా లాప్‌టాప్‌లో పెంటియం-కంపాటబుల్ ప్రాసెసర్ గానీ అంతకన్నా పెద్ద ప్రాసెసర్ గానీ ఉండాలి, మైక్రోసాఫ్ట్ విండోస్ 7 గానీ దాని తర్వాతి వర్షన్స్ గానీ ఉండాలి, లైబ్రరీ కోసం కనీసం 48 MB RAM ఉండాలి, C: డ్రైవ్‌లో 3 GB ఫ్రీ స్పేస్ ఉండాలి.
గమనిక: మీ కంప్యూటర్‌లో మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ఉన్నట్లయితే, ISO ఫైల్‌ని మౌంట్ చేసుకునేలా ముందుగా ఒక థర్డ్-పార్టీ యుటిలిటీని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి యుటిలిటీని మీరు మైక్రోసాఫ్ట్ వెబ్‌సైట్‌లో కనుగొనవచ్చు.
కావలికోట లైబ్రరీ అప్‌డేట్ అవ్వట్లేదని మీకు పదేపదే మెసేజ్ వస్తుంటే, దాన్ని మీరే సొంతగా అప్‌డేట్ చేసుకోవడానికి ఇలా చేసి చూడండి:
ఉన్న కావలికోట లైబ్రరీని అప్‌డేట్ చేసుకోండి అనే పేజీకి వెళ్లండి.
మీ భాషలో కావలికోట లైబ్రరీ అప్‌డేట్ ప్యాకేజీని డౌన్‌లోడ్ చేయండి.
“అప్‌డేట్ ప్యాకేజీని ఇన్‌స్టాల్ చేయండి” కింద ఇచ్చిన సూచనల్ని పాటించండి.
అయినా అప్‌డేట్ అవ్వకపోతే, ఇలా చేసి చూడండి:
ఫైలు ఎక్స్‌ప్లోరర్‌లో “C:\ProgramData\Watchtower\WTLibrary” ఫోల్డర్ తెరవండి.
ఈ రెండు ఫైల్స్‌ని డిలీట్ చేయండి:
a. ca-bundle.zip
b. cert.pem
పైన చెప్పినవాటిని చేయడం మీకు కష్టంగా అనిపిస్తే, కావలికోట లైబ్రరీ గురించి బాగా తెలిసినవాళ్లను సహాయం చేయమని అడగండి. లేదంటే, దగ్గర్లో ఉన్న బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.
కావలికోట లైబ్రరీ గురించి బాగా తెలిసినవాళ్లు ఎవరైనా ఉంటే, వాళ్లను సహాయం చేయమని అడగండి. లేదంటే, దగ్గర్లో ఉన్న బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.