JW బ్రాడ్‌కాస్టింగ్
తరచూ అడిగే ప్రశ్నలు—JW బ్రాడ్‌కాస్టింగ్(Roku)
ఒక కారణం ఏంటంటే, మీరు సరైన పదాల సహాయంతో వెతుకుతుండకపోవచ్చు. JW బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌స్టాల్ చేయడం అనే ట్యుటోరియల్ చూడండి. మరో కారణం ఏమిటంటే, మీ కంప్యూటర్ లేదా టాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం సపోర్ట్ చేస్తుండకపోవచ్చు. రోకు 1, రోకు 2, రోకు 3, అలాగే రోకు స్ట్రీమింగ్ స్టిక్‌లో JW బ్రాడ్‌కాస్టింగ్ వస్తుంది.
రోకు యాప్ ఉపయోగించి ఈ కిందున్న ఏ భాషలోనైన మీరు వీడియోలు చూడవచ్చు: అల్బేనియన్, అమెరికన్ సంజ్ఞా భాష, అర్జెంటీనియన్ సంజ్ఞా భాష, బ్రెజీలియన్ సంజ్ఞా భాష, కొలంబియన్ సంజ్ఞా భాష, క్రోయేషియన్, ఛెక్, డేనిష్, డచ్, ఈక్వెడోరియన్ సంజ్ఞా భాష, ఇంగ్లీష్, ఇస్టోనియన్, ఫిన్నిష్, ఫ్రెంచ్, జర్మన్, హంగేరియన్, ఐబాన్, ఐస్‌లాండిక్, ఇండోనేషియన్, ఇటాలియన్, ఇటాలియన్ సంజ్ఞా భాష, కిన్యర్వాండ, మలయ్, మలగాసి, మాయా, మెక్సికన్ సంజ్ఞా భాష, నైజీరియన్ పిడ్జిన్, నార్వేజియన్, పోర్చుగీస్, సెర్బియన్ (రోమన్), షోనా, స్లోవాక్, స్లోవేనియన్, స్పానిష్, స్వీడిష్, తగాలోగ్, టాహీటియన్, ట్సొంగా, ట్జాడ్జిల్, వెనిజ్యుయాన్ సంజ్ఞా భాష, ఖోసా, జులు.
JW బ్రాడ్‌కాస్టింగ్ హోమ్ పేజీలో ఉన్న సెలెక్ట్ ఎ లాంగ్వేజ్ అనే ఆప్షన్‌ను ఉపయోగించండి.
JW బ్రాడ్‌కాస్టింగ్ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు.
రోకు ఛానల్ స్టోర్‌లో ఉన్నవన్నీ ఉచితం కావు కాబట్టి రోకు అకౌంట్ తెరవడానికి ఒక క్రెడిట్ కార్డ్ అవసరం. అయితే ఆ స్టోర్‌లో మీరు వేటినైనా కొన్నప్పుడు మాత్రమే మీ ఖాతాలో నుండి డబ్బు కట్ అవుతుంది. మరింత సమాచారం కోసం రోకు సపోర్ట్ సెక్షన్‌ను సంప్రదించండి.
రోకు గురించి లేదా JW బ్రాడ్‌కాస్టింగ్ గురించి తెలిసిన మీ స్నేహితుని సహాయం మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీకున్న ప్రశ్న రోకు ప్లేయర్ లేదా ఆకౌంట్ గురించైతే, రోకు ఆన్‌లైన్ సపోర్ట్‌ను సంప్రదించండి. JW బ్రాడ్‌కాస్టింగ్ యాప్‌కు సంబంధించి మీకు ఏవైనా సమస్యలు ఉంటే, దయచేసి మీకు దగ్గర్లో ఉన్న మా బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.