JW లైబ్రరీ
ప్రచురణలను ఎలా డౌన్‌లోడ్ చేసుకుని వాడుకోవాలి?—Android
ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు చదువుకోవడానికి లేదా చూడడానికి వీలుగా, వందల పుస్తకాలు, బ్రోషుర్లు, కరపత్రాలు, వీడియోలు JW లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి.
ప్రచురణల్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఉపయోగించడానికి ఈ సూచనలు పాటించండి:
ఏదైనా ఓ ప్రచురణను డౌన్‌లోడ్ చేసుకోండి
ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు చదువుకోవడానికి లేదా చూడడానికి వీలుగా, మీకు కావాల్సినన్ని ప్రచురణల్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నావిగేషన్ సెక్షన్ తెరిచి, ప్రచురణలు అనే ట్యాబ్‌మీద క్లిక్ చేస్తే, ఏయే ప్రచురణలు అందుబాటులో ఉన్నాయో కనిపిస్తాయి.
భాషలు అనే ట్యాబ్‌మీద క్లిక్ చేస్తే, ఏయే భాషల్లో ప్రచురణలు అందుబాటులో ఉన్నాయో, ఆ భాషలన్నీ కనిపిస్తాయి. మీకు ఏ భాష కావాలో ఎంచుకోండి. ఏ భాషలోని ప్రచురణల్ని మీరు ఎక్కువగా చదువుతున్నారో ఆ భాష ఆ లిస్టులో మొదట కనిపిస్తుంది. అంతేకాదు, మీకు ఏ భాష కావాలో, ఆ భాష టైప్ చేసి కూడా మీరు వెదకవచ్చు.
JW లైబ్రరీలో ప్రచురణల్ని వెదకడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.
ఎలాంటి ప్రచురణలు అనే సెక్షన్‌లో పుస్తకాలు, కరపత్రాలు, వీడియోలు అనే విభాగాలు కనిపిస్తాయి. వాటిలో దేన్నైనా క్లిక్ చేస్తే, ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఉదాహరణకు, కావలికోట అనే దాన్ని క్లిక్ చేస్తే, ఏ సంవత్సరం కావలికోట కావాలో ఎంచుకోవచ్చు. లేదా వీడియోలు క్లిక్ చేస్తే ఎలాంటి వీడియోలు కావాలో ఎంచుకోవచ్చు. అన్ని రకాల ప్రచురణలు అనే దాన్ని క్లిక్ చేస్తే మళ్లీ మొత్తం ప్రచురణల లిస్టు వస్తుంది.
తాజాగా వచ్చినవి అనే సెక్షన్‌లో, మీరు ఎంచుకున్న భాషలో తాజాగా విడుదలైన ప్రచురణలు కనిపిస్తాయి.
మీకు కావాల్సిన ప్రచురణను డౌన్‌లోడ్ చేసుకోండి.
మీరు ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని ప్రచురణల దగ్గర మబ్బు గుర్తు (cloud icon) ఉంటుంది. దానిమీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్నాక మబ్బు గుర్తు పోతుంది. డౌన్‌లోడ్ అయిన ప్రచురణ మీద క్లిక్ చేసి, చదువుకోండి.
డౌన్‌లోడ్ చేసుకున్నవి అనే సెక్షన్‌లో, ఏ బాషలోనివైనా మీరు ఇప్పటివరకు డౌన్‌లోడ్ చేసుకున్న ప్రచురణలు ఉంటాయి.
ఆ లిస్టులో ఉన్నవాటిని మీరు తరచూ చూసినవి, అప్పుడప్పుడు చూసినవి, ఎక్కువ మెమరీ ఉన్నవి అని విభజించుకోవచ్చు.
ఏదైనా ఓ ప్రచురణను డిలీట్ చేయండి
ఒకవేళ, మీకు ఏదైనా ఓ ప్రచురణ అవసరం లేదనిపిస్తే, లేదా మీ మొబైల్‌లో లేదా ట్యాబ్‌లో సరిపడా మెమరీ లేదనిపిస్తే, దాన్ని డిలీట్ చేసుకోవచ్చు.
నావిగేషన్ సెక్షన్ తెరిచి, ప్రచురణలు అనే ట్యాబ్‌మీద క్లిక్ చేసి, మీరు ఎలాంటి ప్రచురణ డిలీట్ చేయాలనుకుంటున్నారో (ఉదాహరణకు, స్తకాలు, కరపత్రాలు) దానిమీద క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ అనే బటన్ క్లిక్ చేసి, మీరు ఏయే ప్రచురణల్ని డిలీట్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. ఆ ప్రచురణ మీద క్లిక్ చేసి నొక్కిపట్టుకోండి. తర్వాత డిలీట్ బటన్ క్లిక్ చేయండి. వాటిని డిలీట్ చేయాలా వద్దా అనే మెసేజ్ రాగానే అవును అని క్లిక్ చేయండి.
ఒకవేళ మీ మొబైల్‌లో లేదా ట్యాబ్‌లో ఎక్కువ మెమరీ లేకపోతే, అప్పుడప్పుడు మాత్రమే వాడే ప్రచురణల్నిగానీ, ఎక్కువ మెమరీ ఉన్న ప్రచురణల్నిగానీ మీరు డిలీట్ చేయవచ్చు. ప్రచురణలు అనే ట్యాబ్‌మీద క్లిక్ చేసి, డౌన్‌లోడ్ చేసుకున్నవి అనేదాంట్లో ఉన్న ప్రచురణలు, ఏవి అప్పుడప్పుడు చూసినవి, ఏవి ఎక్కువ మెమరీ ఉన్నవి అని విభాగించుకోండి. మీకు అవసరంలేని ప్రచురణల్ని డిలీట్ చేసుకోండి.
ఏదైనా ఓ ప్రచురణకు సంబంధించి అప్‌డేట్స్ పొందండి
మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ప్రచురణ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుండవచ్చు.
అప్‌డేట్ అయిన ప్రచురణ దగ్గర రిఫ్రెష్ గుర్తు (refresh icon) ఉంటుంది. ఆ ప్రచురణ మీద క్లిక్ చేస్తే, దానికి ఓ అప్‌డేట్ అందుబాటులో ఉందని మెసేజ్ వస్తుంది. అప్‌డేట్ అయిన ప్రచురణ కావాలంటే, డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయండి, వద్దనుకుంటే ఇప్పుడు కాదు (later) అనేదాని మీద క్లిక్ చేయండి.
మీరు డౌన్‌లోడ్ చేసుకున్న ప్రచురణకు అప్‌డేట్స్ ఏమైనా వచ్చాయేమో తెలుసుకోవడానికి, నావిగేషన్ సెక్షన్ తెరిచి ప్రచురణలు అనే ట్యాబ్‌మీద క్లిక్ చేసి, డౌన్‌లోడ్ చేసుకున్నవి అనే సెక్షన్ చూడండి. ఒకవేళ అప్‌డేట్స్ ఏమైనా అందుబాటులో ఉంటే, అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి అనే బటన్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేస్తే, ఏమేమి అప్‌డేట్స్ వచ్చాయో చూడవచ్చు. అప్‌డేట్ అయిన అన్ని ప్రచురణలు కావాలనుకుంటే, అన్నిటిని అప్‌డేట్ చేయి అనే బటన్ క్లిక్ చేయవచ్చు. లేదా, మీకు ఏ ప్రచురణ కావాలో దాన్ని మాత్రమే అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఈ ఫీచర్స్ అన్ని 2015, ఫిబ్రవరిలో విడుదలైన JW లైబ్రరీ 1.4 వర్షన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 2.3 వర్షన్‌గానీ, తర్వాతి వర్షన్‌గానీ ఉన్న మొబైల్ లేదా ట్యాబ్‌లో ఈ యాప్ పనిచేస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్స్ మీకు కనిపించకపోతే, దయచేసి “JW లైబ్రరీ—ఆండ్రాయిడ్ వర్షన్‌ని ఉపయోగించడం మొదలుపెట్టండి” అనే ఆర్టికల్‌లో కొత్త ఫీచర్స్ అనే అంశం కింద చూడండి.