JW లైబ్రరీ
హైలైట్ చేసుకోండి—Android
JW లైబ్రరీలో ప్రచురణల్ని చదువుతున్నప్పుడు ఏదైనా ఒక పదాన్ని లేక పదబంధాన్ని హైలైట్ చేసుకోవచ్చు.
హైలైట్ చేసుకోవడానికి ఈ సూచనలు పాటించండి:
ఒక పదాన్ని హైలైట్ చేసుకోండి
హైలైట్ చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి.
ఏ పదాన్నయితే మీరు హైలైట్ చేయాలనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేసి నొక్కి పట్టుకోండి. హ్యాండిల్స్‌ని ఉపయోగించి ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు వచ్చే మెన్యూలో హైలైట్ బటన్‌ని నొక్కి మీకు కావాల్సిన రంగును ఎంచుకోండి.
రెండో పద్ధతి ఏంటంటే, మీరు హైలైట్ చేయాలనుకుంటున్న పదాన్ని లేక పదబంధాన్ని క్లిక్ చేసి, అలాగే నొక్కిపట్టుకుని ఎంతవరకు కావాలో అంతవరకు లాగండి. అప్పుడు అది హైలైట్ అవుతుంది. హైలైట్ అవ్వగానే ఓ మెన్యూ సెక్షన్ వస్తుంది. దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఉపయోగించి, కావాలనుకుంటే మీరు రంగును మార్చుకోవచ్చు లేదా పెట్టిన హైలైట్‌ని మార్చుకోవచ్చు.
హైలైట్‌ని మార్చుకోండి
మీరు హైలైట్ చేసుకున్నదాని రంగును మార్చుకోవాలంటే, హైలైట్ చేసినదాన్ని క్లిక్ చేసి, వేరే రంగును ఎంచుకోండి. ఒకవేళ, హైలైట్‌ని తీసేయాలనుకుంటే, హైలైట్ చేసినదాన్ని క్లిక్ చేసి, డిలీట్ బటన్ క్లిక్ చేయండి.
ఈ ఫీచర్స్ అన్ని 2015, నవంబర్‌లో విడుదలైన JW లైబ్రరీ 1.6 వర్షన్‌లో ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.0 వర్షన్‌గానీ, తర్వాతి వర్షన్‌గానీ ఉన్న మొబైల్ లేదా ట్యాబ్‌లో ఈ యాప్ పనిచేస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్స్ మీకు కనిపించకపోతే, దయచేసి “JW లైబ్రరీ—ఆండ్రాయిడ్ వర్షన్‌ని ఉపయోగించడం మొదలుపెట్టండి” అనే ఆర్టికల్‌లో కొత్త ఫీచర్స్ అనే అంశం కింద చూడండి.