JW లైబ్రరీ
హిస్టరీ అనే ఫీచర్ని ఉపయోగించండి—iOS
JW లైబ్రరీలో, మీరు అంతకుముందు చదివిన ఆర్టికల్స్గానీ బైబిలు అధ్యాయాలుగానీ చూసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు, అంతకుముందు మీరు చదివిన లేఖనాన్ని మీరు మళ్లీ చూడవచ్చు.
హిస్టరీ (ఇంతకుముందు చూసినవి) అనే ఫీచర్ని ఉపయోగించడానికి ఈ సూచనలు పాటించండి:
హిస్టరీలోకి వెళ్లండి
బైబిలు అనే ట్యాబ్మీద క్లిక్ చేసి నొక్కిపట్టుకోండి. అప్పుడు మీరు ఏయే లేఖనాల్ని అంతకుముందు చదివారో లిస్టు వస్తుంది. దాంట్లో మీకు కావాల్సిన లేఖనం మీద క్లిక్ చేసి దాన్ని చదువుకోండి.
ప్రచురణలు అనే ట్యాబ్మీద క్లిక్ చేసి నొక్కిపట్టుకోండి. మీరు ఏయే ఆర్టికల్స్ చదివారో లిస్టు వస్తుంది. దాంట్లో మీకు కావాల్సిన ఆర్టికల్మీద క్లిక్ చేసి, దాన్ని చదువుకోండి.
హిస్టరీని క్లియర్ (ఖాళీ) చేయండి
బైబిలు లేదా ప్రచురణలు మీద క్లిక్ చేసి నొక్కిపట్టుకోండి. అప్పుడు హిస్టరీ లిస్టు ఓపెన్ అవుతుంది. క్లియర్ అనే బటన్ క్లిక్ చేస్తే, ఆ లిస్టు మొత్తం క్లియర్ అయిపోతుంది.
ఈ ఫీచర్స్ అన్ని 2014, మేలో విడుదలైన JW లైబ్రరీ 1.2 వర్షన్లో ఉన్నాయి. iOS 6.0 వర్షన్గానీ, తర్వాతి వర్షన్గానీ ఉన్న మొబైల్ లేదా ట్యాబ్లో ఈ యాప్ పనిచేస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్స్ మీకు కనిపించకపోతే, దయచేసి “JW లైబ్రరీ—iOSని ఉపయోగించడం మొదలుపెట్టండి” అనే ఆర్టికల్లో కొత్త ఫీచర్స్ అనే అంశం కింద చూడండి.