కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీ

బైబిల్లో లేదా ప్రచురణల్లో ఏదైనా అంశాన్ని వెదకండి—విండోస్‌

బైబిల్లో లేదా ప్రచురణల్లో ఏదైనా అంశాన్ని వెదకండి—విండోస్‌

JW లైబ్రరీలో ఉన్న వెతుకు అనే ఫీచర్‌ వల్ల, మీరు బైబిల్లోగానీ ప్రచురణల్లోగానీ ఏదైనా ఒక పదాన్ని లేక పదబంధాన్ని వెదకవచ్చు.

బైబిల్లో లేదా ప్రచురణల్లో దేన్నైనా వెదకడానికి, ఈ సూచనలు పాటించండి:

 బైబిల్లో వెదకండి

మీరు చదువుతున్న బైబిల్లో ఏదైనా పదాన్నిగానీ పదబంధాన్నిగానీ మీరు వెదకవచ్చు.

బైబిలు చదువుతున్నప్పుడు, వెతుకు అనే బటన్‌ క్లిక్‌ చేసి మీకు ఏ పదం కావాలో దాన్ని టైప్‌ చేయండి. టైప్‌ చేస్తుండగానే, ఆ పదానికి దగ్గరగా ఉన్న మరికొన్ని పదాలు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది కావాలో దాన్ని క్లిక్‌ చేయండి. లేదా మీకు కావాల్సిన పదం మొత్తం టైప్‌ చేసి, కీబోర్డు మీద ఎంటర్‌ (Enter) బటన్‌ క్లిక్‌ చేయండి.

మీరు వెదుకుతున్న పదానికి వచ్చిన ఫలితాల లిస్టులో (search results), ముఖ్యమైన వచనాలు, అన్ని వచనాలు, ఆర్టికల్స్‌ అనే మూడు సెక్షన్లు కనిపిస్తాయి. ముఖ్యమైన వచనాలు అనే సెక్షన్‌, మీరు ఎక్కువసార్లు ఉపయోగించిన వచనాల్లో, మీరు వెదుకుతున్న పదం ఎక్కడుందో చూపిస్తుంది. అన్ని వచనాలు అనే సెక్షన్‌, మీరు వెదుకుతున్న పదానికి సరిపోయే అన్ని వచనాల్ని చూపిస్తుంది. ఆర్టికల్స్‌ అనే సెక్షన్‌, మీరు వెదుకుతున్న పదం బైబిల్లోని ఉపోద్ఘాతంలో లేదా అనుబంధంలో ఎక్కడుందో చూపిస్తుంది.

ఒకవేళ మీరు ఓ పదబంధాన్ని వెదుకుతుంటే, రిగ్గా సరిపోయేవాటిని చూపించు (Match Exact Phrase) అనే బాక్సులో టిక్కు పెట్టండి. అప్పడు మీరు వెదుకుతున్న పదబంధానికి, సరిగ్గా సరిపోయేవి మాత్రమే కనిపిస్తాయి.

 ప్రచురణల్లో వెదకండి

మీరు చదువుతున్న ప్రచురణలో ఏదైనా పదాన్నిగానీ పదబంధాన్నిగానీ మీరు వెదకవచ్చు.

ఏదైనా ప్రచురణ చదువుతున్నప్పుడు, వెతుకు అనే బటన్‌ క్లిక్‌ చేసి మీకు ఏ పదం కావాలో దాన్ని టైప్‌ చేయండి. టైప్‌ చేస్తుండగానే, ఆ పదానికి దగ్గరగా ఉన్న మరికొన్ని పదాలు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు ఏది కావాలో దాన్ని క్లిక్‌ చేయండి. లేదా మీకు కావాల్సిన పదం మొత్తం టైప్‌ చేసి, కీబోర్డు మీద ఎంటర్‌ (Enter) బటన్‌ క్లిక్‌ చేయండి.

ఒకవేళ మీరు ఓ పదబంధాన్ని వెదుకుతుంటే, రిగ్గా సరిపోయేవాటిని చూపించు (Match Exact Phrase) అనే బాక్సులో టిక్కు పెట్టండి. అప్పడు మీరు వెదుకుతున్న పదబంధానికి, సరిగ్గా సరిపోయేవి మాత్రమే కనిపిస్తాయి.

 ఓ అంశాన్ని వెదకండి

మీరు ఇన్‌సైట్‌ ఆన్‌ ద స్క్రిప్చర్స్‌ అనే ప్రచురణను డౌన్‌లోడ్‌ చేసుకుని ఉంటే, మీకు కావాల్సిన అంశాన్ని దాంట్లో వెదకవచ్చు. యాప్‌లో బైబిల్ని లేదా ప్రచురణని చదువుతున్నప్పుడు కూడా ఇన్‌సైట్‌లోని అంశాన్ని వెదకవచ్చు.

వెతుకు అనే బటన్‌ క్లిక్‌ చేసి, మీకు కావాల్సిన అంశాన్ని టైప్‌ చేయండి. టైప్‌ చేస్తుండగానే, ఆ అంశానికి దగ్గరగా ఉన్న ఇన్‌సైట్‌ అంశాలు మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు కావాల్సినదాని మీద క్లిక్‌ చేసి, ఆ ఆర్టికల్‌ చదువుకోండి.

ఈ ఫీచర్స్‌ అన్ని 2014, అక్టోబర్‌లో విడుదలైన JW లైబ్రరీ 1.3.4 వర్షన్‌లో ఉన్నాయి. విండోస్‌ 8.0 వర్షన్‌గానీ, తర్వాతి వర్షన్‌గానీ ఉన్న మొబైల్‌ లేదా ట్యాబ్‌లో ఈ యాప్‌ పనిచేస్తుంది. ఒకవేళ ఈ ఫీచర్స్‌ మీకు కనిపించకపోతే, దయచేసి “JW లైబ్రరీ—విండోస్‌ వర్షన్‌ని ఉపయోగించడం మొదలుపెట్టండి” అనే ఆర్టికల్‌లో కొత్త ఫీచర్స్‌ అనే అంశం కింద చూడండి.