కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

JW లైబ్రరీ

JW లైబ్రరీ—విండోస్‌ వర్షన్‌ని ఉపయోగించడం మొదలుపెట్టండి

JW లైబ్రరీ—విండోస్‌ వర్షన్‌ని ఉపయోగించడం మొదలుపెట్టండి

JW లైబ్రరీకి స్వాగతం. బైబిల్ని చదవడానికి, లోతుగా పరిశీలించడానికి ఈ యాప్‌ని తయారుచేశారు. మీ మొబైల్‌లో లేదా ట్యాబ్‌లో ఆ యాప్‌ మీద క్లిక్‌ చేస్తే, దాంట్లో ఏమేమి ఉన్నాయో స్క్రీన్‌మీద కనిపిస్తాయి. యాప్‌ కమాండ్స్‌ (App Commands) అనే సెక్షన్‌లోకి వెళ్లడానికి రైట్‌ క్లిక్‌ (right click) ఇవ్వండి, లేదా స్క్రీన్‌మీద పైనుండి కిందకి స్వైప్‌ చేయండి.

 హోమ్‌

హోమ్‌లోకి వెళ్తే, మీరు ఎక్కువగా ఉపయోగించే బైబిలు, ప్రచురణలు కనిపిస్తాయి. అంతేకాదు, తాజా ప్రచురణలు ఏమి వచ్చాయో చూడవచ్చు. దినవచనాన్ని కూడా చదవవచ్చు.

 బైబిలు

బైబిలు అనే ట్యాబ్‌లో ఎన్నో బాషల్లో ఉన్న బైబిలు అనువాదాలు ఉంటాయి. బైబిల్లోని ఓ పుస్తకం మీద క్లిక్‌ చేయండి. తర్వాత ఏ అధ్యాయం కావాలో ఆ నంబర్‌మీద క్లిక్‌ చేయండి. మీరు లేఖనాలు చదువుతున్నప్పుడు వాటి అధస్సూచిలు, రెఫరెన్సులు చూడవచ్చు. అంతేకాదు, లేఖనం మీద క్లిక్‌ చేస్తే, స్టడీ సెక్షన్‌ ఓపెన్‌ అవుతుంది. దాంట్లో వేర్వేరు బైబిలు అనువాదాలు ఆ వచనాన్ని ఎలా అనువదించాయో ఉంటుంది.

ప్రచురణలు

 

 ప్రచురణలు అనే ట్యాబ్‌లో రకరకాలు ప్రచురణలు, ఆడియో రికార్డింగ్‌లు, వీడియోలు ఉంటాయి. ఏదైనా ఓ ప్రచురణ మీద క్లిక్‌ చేసి, దాంట్లో ఓ ఆర్టికల్‌ చదవడం మొదలుపెట్టండి. ఆ ఆర్టికల్‌లో ఉన్న లేఖనాల్ని కూడా మీరు చదవవచ్చు. ఆ లేఖనం మీద క్లిక్‌ చేస్తే, స్టడీ సెక్షన్‌ ఓపెన్‌ అవుతుంది. స్టడీ సెక్షన్‌లో ఓపెన్‌ అయిన ఆ లేఖనం మీద క్లిక్‌ చేస్తే, నేరుగా అది బైబిల్లో ఓపెన్‌ అవుతుంది. ఒకవేళ వేరే ప్రచురణ ఏదైనా తెరవాలనుకుంటే, ప్రచురణలు అనే ట్యాబ్‌మీద క్లిక్‌ చేయండి.

 

దినవచనం

దినవచనం అనే ట్యాబ్‌మీద క్లిక్‌ చేస్తే, ఆ రోజుకి సంబంధించిన దినవచనాన్ని చదవవచ్చు.

 ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ అనే ట్యాబ్‌మీద క్లిక్‌ చేస్తే, మా అధికారిక వెబ్‌సైట్లకు కనెక్ట్‌ చేసే లింక్స్‌ ఓపెన్‌ అవుతాయి.

 కొత్త ఫీచర్స్‌

మీ మొబైల్‌ లేదా ట్యాబ్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ, JW లైబ్రరీ లేటెస్ట్‌ వర్షన్‌ని పొందండి.

 మీ మొబైల్‌ లేదా ట్యాబ్‌కు సరిపోయే లేటెస్ట్‌ విండోస్‌ వర్షన్‌ని రన్‌ చేయండి. మరింత సమాచారం కోసం ఈ లింక్స్‌ చూడండి:

కావాలనుకుంటే, మీ మొబైల్‌ లేదా ట్యాబ్‌లో, యాప్స్‌ వాటంతటికవే అప్‌డేట్‌ అయ్యేలా సెట్‌ చేసుకోండి. మరింత సమాచారం కోసం ఈ లింక్‌ చూడండి: http://windows.microsoft.com/en-gb/windows-8/automatic-app-updates-help.