యువత అడిగే ప్రశ్నలు
మా అమ్మానాన్నలు నన్ను ఎందుకు ఎంజాయ్ చేయనివ్వరు?
మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఒక పార్టీకి రమ్మని పిలిచారు. దానికోసం వెళ్తానని మీ అమ్మానాన్నలను అడిగారు, వాళ్లు వెంటనే “వద్దు” అనేసారు. అలా అంటారని మీకు తెలుసు, ఎందుకంటే పోయినసారి కూడా వాళ్లు అదే అన్నారు.
ఈ ఆర్టికల్‌లో
అమ్మానాన్నలు ఎందుకు అన్నిటికీ వద్దు అంటారు?
మీ అమ్మానాన్నలు అన్నిటికీ వద్దు అంటున్నారు అంటే, మిమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వకుండా కట్టిపడేస్తున్నారని మీకు అనిపించవచ్చు.
మేరీ అనే టీనేజ్ అమ్మాయి వాళ్ల అమ్మానాన్నలు మొదటిసారి తనకో ఫోన్ ఇచ్చినప్పుడు అలాగే ఫీల్ అయ్యింది. తను ఏమందంటే: “నేను ఏ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎంతసేపు మాట్లాడాలో ... అన్నిటికీ మా డాడీ రూల్స్ పెట్టారు. కానీ, నా ఫ్రెండ్స్ మాత్రం వాళ్లకు నచ్చినట్టు ఉంటారు.”
ఇలా ఆలోచించండి: మేరీ వాళ్ల నాన్న తనని ఎంజాయ్ చేయనివ్వకుండా నిజంగా కట్టి పడేస్తున్నాడా? లేదా వేరే ఏదైనా కారణం ఉందా?
ఇలా చేసి చూడండి: అమ్మానాన్నల స్థానంలో మిమ్మల్ని ఊహించుకోండి. మీకే ఒక టీనేజ్ అబ్బాయి లేదా అమ్మాయి ఉంటే వాళ్లు ఫోన్ వాడుతున్నప్పుడు మీరు ఏమేం ఆలోచిస్తారు? మీ పిల్లలను కాపాడుకోవడానికి మీరు ఎలాంటి రూల్స్ పెడతారు? ఒకవేళ పిల్లలు మీతో, మమ్మల్ని ఎంజాయ్ చేయనివ్వకుండా కట్టిపడేస్తున్నారు అని అంటే మీరు ఏం చెప్తారు?
“మా నాన్న ఎప్పుడూ నాతో ‘నా స్థానంలో ఉండి ఆలోచించు’ అని అంటుండేవారు. నిజంగా అలా ఆలోచించడం వల్ల ఆయన పెట్టే రూల్స్‌కి ఉన్న విలువ, అలాగే వాటి వెనుక ఉన్న కారణాల్ని అర్థం చేసుకోగలిగాను. ఒకవేళ నాకు పిల్లలు ఉంటే వాళ్లకు మా నాన్న పెట్టేలాంటి రూల్స్‌నే నేనూ పెట్టేదాన్ని.”—టాన్యా.
అమ్మానాన్నలను ఎలా ఒప్పించవచ్చు?
“అరవడం వల్ల మీకు, మీ అమ్మానాన్నలకు బాధే మిగులుతుంది. ఒకవేళ మీరు వాదిస్తే మీ అమ్మానాన్నలు మీరు ఇంకా ఎదగలేదని అనుకుంటారు, ఎక్కువ ఫ్రీడం కూడా ఇవ్వరు.”—రిచర్డ్.
“మా మమ్మీడాడీ పెట్టే ప్రతీ రూల్ వెనుక ఏదో ఒక మంచి కారణం ఉంటుంది. వాళ్లు నన్ను ఎంజాయ్ చేయకుండా కట్టిపడేయడం లేదుగానీ, నేను ఏ సమస్యల్లోనూ చిక్కుకోకుండా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నారు.”—ఐవి.
బైబిలు సూత్రం: “మూర్ఖుడు తనకు అనిపించిందంతా బయటికి కక్కేస్తాడు, అయితే తెలివిగలవాడు ప్రశాంతంగా ఉంటాడు.”—సామెతలు 29:11.
“ఫోన్ విషయంలో మా డాడీ పెట్టిన రూల్స్ నుండి నేను తెలివిగా తప్పించుకోవాలని అనుకున్నాను. రాత్రి బాగా లేట్ అయ్యాక మా ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసేదాన్ని, మా డాడీ వద్దు అన్న యాప్స్‌ని డౌన్లోడ్ చేసేదాన్ని. చివరికి, డాడీకి తెలిసిపోయాక రూల్స్ ఇంకా ఎక్కువైపోయాయి. ఎందుకంటే, నా మీద ఆయనకు నమ్మకం పోయింది. మమ్మీడాడీలకు తెలీకుండా వాళ్లు పెట్టిన రూల్స్ మీరడం అస్సలు తెలివైన పని కాదు.”—మేరీ.
“కాస్త ఓపిక పట్టండి. అమ్మానాన్నలు పెట్టే రూల్స్‌ని తగ్గించడానికి వాళ్లకు కొంచెం టైం పట్టవచ్చు. కానీ వాళ్లు పెడుతున్న రూల్స్‌ని మీరు పాటిస్తుంటే, మీకు ఇంకాస్త ఫ్రీడం ఇవ్వవచ్చు.”—మెలిండా.
బైబిలు సూత్రం: “ప్రతీ విషయంలో మీ అమ్మానాన్నల మాట వినండి.”—కొలొస్సయులు 3:20.
“పేచీ పెట్టినంత మాత్రాన మనకు కావల్సినవన్నీ దొరకవు.”—నటాలీ.
“మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని మమ్మీడాడీ కోరుకుంటారు. అందుకే నేను వాళ్లతో మాట్లాడేటప్పుడు అరిచి-పేచీ పెట్టడం లాంటివి చేయను కానీ, సరైన కారణాలు చెప్పడానికి ట్రై చేస్తాను. అలా చేయడం వల్ల, నేను అడిగేవి చాలావరకు వాళ్లు ఒప్పుకుంటారు.”—జోసెఫ్.
బైబిలు సూత్రం: “నువ్వు మీ అమ్మానాన్నల్ని గౌరవించు.”—ఎఫెసీయులు 6:2.