కంటెంట్‌కు వెళ్లు

మా అమ్మానాన్నలు విడాకులు తీసుకుంటుంటే అప్పుడేంటి?

మా అమ్మానాన్నలు విడాకులు తీసుకుంటుంటే అప్పుడేంటి?

మీరేమి చేయవచ్చు

 మీ భయాలు వాళ్లతో చెప్పండి. మీరు ఎంత బాధలో, అయోమయంలో ఉన్నారో వాళ్లకు చెప్పండి. బహుశా వాళ్లు అప్పుడు అసలు ఏం జరుగుతుందో మీకు వివరించి మీ బాధను తగ్గించవచ్చు.

 మీకు కావాల్సిన సహాయాన్ని మీ తల్లిదండ్రులు ఇవ్వలేకపోతే, చక్కగా ఆలోచించగల ఒక మంచి స్నేహితునితో దాని గురించి మాట్లాడవచ్చు.–సామెతలు 17:17.

 వీటన్నిటికంటే ఎక్కువగా, “ప్రార్థన ఆలకించువాడు” అయిన మీ పరలోకపు తండ్రి మీరు చెప్పేది ఎప్పుడూ వింటాడు. (కీర్తన 65:2) “ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక” మీ మనసులో ఉన్నదంతా ఆయనకు చెప్పండి.—1 పేతురు 5:7.

ఏం చేయకూడదు

అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నారనే బాధ నుండి బయటపడడం, చెయ్యి విరిగి ఆ పరిస్థితి నుంచి తట్టుకొని బయటపడడం లాంటిదే. అది కష్టంగానే ఉన్నా మెల్లగా, తప్పకుండా నయమౌతుంది

 పగ పెట్టుకోవద్దు. తనకు ఏడు సంవత్సరాల వయసున్నప్పుడు విడిపోయిన తన తల్లిదండ్రుల గురించి డానియేల్‌ ఇలా అంటున్నాడు: “మా అమ్మానాన్నలు స్వార్థపరులు. వాళ్లు మా గురించి గానీ, వాళ్లు చేసేది మా మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని గానీ అస్సలు ఆలోచించలేదు.”

 డానియేల్‌ తన కోపాన్ని, బాధను మర్చిపోవడానికి ప్రయత్నించకపోతే అతనికి ఏం జరిగుండేది?–తెలుసుకోవడానికి: సామెతలు 29:22 చదవండి.

 తనకు బాధ కలిగించిన తన తల్లిదండ్రులను క్షమించడం డానియేల్‌కు ఎందుకు మంచిది?–తెలుసుకోవడానికి: ఎఫెసీయులకు 4:31, 32 చదవండి.

 మిమ్మల్ని పాడుచేసే చెడు ప్రవర్తనను రానివ్వకండి. “మా అమ్మానాన్నలు విడాకులు తీసుకున్నాక నేను చాలా బాధ, కృంగుదలలో ఉండేవాడిని. నాకు స్కూల్లో సమస్యలు మొదలై ఒక సంవత్సరం ఫెయిల్‌ అయ్యాను. ఆ తర్వాత నేను క్లాసులో జోకర్లా అయిపోయాను. చాలా గొడవల్లోకి కూడా దిగేవాడిని” అని డెన్ని గుర్తుచేసుకుంటున్నాడు.

 క్లాసులో జోకరుగా మారడం, గొడవల్లోకి దిగడం ద్వారా డెన్ని ఏమి సాధించాలని అనుకుంటున్నాడంటారు?

 వాళ్లకు వాళ్లే పాడైపోయే ప్రవర్తన రాకుండా డెన్ని లాంటి వారికి గలతీయులు 6:7 లో సూత్రం ఎలా సహాయపడుతుంది?

 మానసికంగా గాయపడితే బాగవడానికి సమయం పడుతుంది. కానీ కాలం గడుస్తుండగా మీరు మళ్లీ మామూలు స్థితికి రాగలుగుతారు.