యువత అడిగే ప్రశ్నలు
మెసేజ్‌లు పంపించడం గురించి నేనేమి తెలుసుకోవాలి?
:-) ఆలోచించి తెలివిగా ఉపయోగిస్తే, మెసేజ్‌ల ద్వారా మీ స్నేహితుల బాగోగులు గురించి ఎప్పటికప్పుడు చక్కగా తెలుసుకోవచ్చు.
:-( కానీ అదే అజాగ్రత్తగా చేస్తే మీ స్నేహాలు, మీకున్న మంచి పేరు పాడైపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి మెసేజ్‌లు పంపించడం గురించి మీరేమి తెలుసుకోవాలో ఈ ఆర్టికల్ మీకు చెప్తుంది.
ఇంకా ఈ ఆర్టికల్‌లో
ఎవరికి మెసేజ్‌లు పంపిస్తున్నారు
ఇతరులతో మాట్లాడడానికి మెసేజ్‌లు పంపించడం ఒక తిరుగులేని పద్ధతి అని చాలామంది టీనేజర్లు భావిస్తున్నారు. మీ అమ్మానాన్నలు అడ్డు చెప్పనంత వరకూ, మెసేజ్‌ల ద్వారా మీకు తెలిసినవాళ్లెవరితోనైనా లేదా అందరితోనైనా మీరు మాట్లాడవచ్చు.
“నేనూ, మా చెల్లి అబ్బాయిలతో మాట్లాడడం మా నాన్నగారికి నచ్చదు. ఒకవేళ మాట్లాడినా, ల్యాండ్‌లైన్ ఫోన్లో, హాల్లో అందరి ముందు మాట్లాడాలి.”—లనోర్.
మీరు తెలుసుకోవాల్సిన విషయాలు: ఎవరికి పడితే వాళ్లకు మీ నెంబరు ఇచ్చేస్తే, మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు.
“ఎవరెవరికి మీ నెంబరు తెలుస్తుంది అనే విషయంలో జాగ్రత్త పడకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మెసేజ్‌లు, బొమ్మలు మీకు రావచ్చు.”—స్కాట్.
“మీరు ఎప్పుడూ ఒక అమ్మాయి లేదా అబ్బాయికి మెసేజ్‌లు పంపుతూ ఉంటే, భావోద్వేగంగా మీరు వాళ్లకు చాలా త్వరగా దగ్గరైపోతారు.”—స్టీవెన్.
బైబిలు ఇలా చెప్తుంది: “బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును.
” (సామెతలు 22:3) చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బోలెడన్ని బాధల్ని తప్పించుకోవచ్చు.
నిజంగా జరిగిన కథ: “నేనూ, ఒక అబ్బాయి మంచి స్నేహితులం. మేము ఎప్పుడూ మెసేజ్‌లు పంపించుకుంటూ ఉండేవాళ్లం. మేము కేవలం మంచి స్నేహితులమని అనుకునేదాన్ని. అతను నన్ను ఇష్టపడుతున్నాడని నాతో చెప్పేవరకూ అతనితో స్నేహం ఏ మాత్రం సమస్యగా అనిపించలేదు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను అతనితో అంత ఎక్కువగా బయటకు వెళ్లడం, మెసేజ్‌లు పంపించడం చేసి ఉండకూడదని నాకు అనిపించింది.
”—మెలిండా.
పరిశీలించండి: ఆ అబ్బాయి తన భావాల గురించి చెప్పిన తర్వాత మెలిండాకు, ఆ అబ్బాయికి మధ్యున్న స్నేహం ఏమైందని మీరనుకుంటున్నారు?
ఈ విషయాన్ని మరోలా రాయండి! మెలిండా, ఆ అబ్బాయి ఎప్పటికీ కేవలం స్నేహితులుగా ఉండేలా మెలిండా మొదటినుండి ఏమి చేసుంటే బాగుండేది?
ఏం మెసేజ్‌లు పంపిస్తున్నారు
మెసేజ్‌లు పంపించడం చాలా సులువు. ఎవరైనా మనకు మెసేజ్‌లు పంపిస్తే వాటిని చదవడం కూడా చాలా సరదాగా ఉంటుంది. కానీ ఒక్కోసారి వాటిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మనం తేలిగ్గా మర్చిపోతుంటాం.
మీరు తెలుసుకోవాల్సిన విషయాలు: మెసేజ్‌ల ద్వారా పంపించే మాటల్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది.
“మెసేజుల్లో మీరు ఎదుటివాళ్ల భావాలను, వాళ్ల ఉద్దేశాలను ఖచ్చితంగా తెలుసుకోలేరు. సింబల్స్‌ని, చిన్న చిన్న బొమ్మల్ని వాడినా అర్థం కాకపోవచ్చు. అపార్థాలకు దారితీయవచ్చు.”—బ్రియానా.
“అబ్బాయిలకు మెసేజ్‌లు పంపించి, మంచి పేరును పోగొట్టుకున్న కొంతమంది అమ్మాయిలు నాకు తెలుసు. వాళ్లు పంపించిన మాటల్ని బట్టి అందరూ వాళ్లను సరసాలాడేవాళ్లుగా చూశారు.”—లారా.
బైబిలు ఇలా చెప్తుంది: “మంచివాళ్లు ఆలోచించిన తర్వాతే జవాబిస్తారు.
” (సామెతలు 15:28, గుడ్ న్యూస్ ట్రాన్స్లేషన్) దీనిలో మనకేమి పాఠం ఉంది? మీరు “Send” కొట్టేముందు మీ మెసేజ్‌ని మళ్లీ ఒకసారి చదువుకోండి.
ఎప్పుడు మెసేజ్‌లు పంపిస్తున్నారు
మెసేజుల్లో ఏం పంపిస్తే మంచిది, ఏం పంపిస్తే మంచిది కాదు, అని కామన్‌సెన్స్‌తో మీకు మీరే కొన్ని రూల్స్ పెట్టుకోవచ్చు.
మీరు తెలుసుకోవాల్సిన విషయాలు: మెసేజులు పంపిస్తున్నప్పుడు పద్ధతులు పాటించకపోతే, మీకు మర్యాద లేదనుకుని మీకు దగ్గరయ్యే బదులు మీ స్నేహితులు మీకు దూరమైపోవచ్చు.
“మెసెజ్‌లు పంపించేటప్పుడు మంచి పద్ధతులను పాటించడం మనం తేలిగ్గా మర్చిపోతాం. ఒక్కోసారి భోజనం చేసేటప్పుడు టేబుల్ దగ్గర కూర్చొని లేక ఎవరితోనైనా మాట్లాడుతూ, మెసేజ్‌లు పంపుతూ ఉంటాను.”—యాలిసన్.
“డ్రైవింగ్ చేస్తూ మెసేజ్‌లు పంపించడం ప్రమాదాలకు దారితీస్తుంది. రోడ్డు చూస్తూ నడపకపోతే యాక్సిడెంట్ అవ్వొచ్చు.”—యాన్.
బైబిలు ఇలా చెప్తుంది: “ప్రతిదానికి సమయము కలదు, . . . మౌనముగా నుండుటకు మాటలాడుటకు (సమయము కలదు).
” (ప్రసంగి 3:1, 7) ఈ వచనం మాట్లాడడానికే కాదు, మెసేజులు పంపించడానికి కూడా వర్తిస్తుంది.
మెసేజులు పంపించేటప్పుడు పాటించాల్సిన కొన్ని సలహాలు
ఎవరికి మెసేజులు పంపిస్తున్నారు
;-) మీ అమ్మానాన్నలు పెట్టే నియమాలను పాటించండి.—కొలొస్సయులు 3:20.
;-) మీ నెంబరు ఎవరికి ఇవ్వాలో జాగ్రత్తగా ఆలోచించి ఎంపిక చేసుకోండి. నా ఫోన్ నెంబర్ లాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వాలనుకోవట్లేదు అని ఎవరికైనా మర్యాదపూర్వకంగా చెప్పినప్పుడు, ఎదిగిన వాళ్లకు అవసరమైన ఒక మంచి నైపుణ్యాన్ని మీరు వృద్ధి చేసుకోగలుగుతారు.
;-) సరసాలాడుతున్నట్టు అనిపించే మెసేజ్‌లు పంపించి మీరు వాళ్లకు చాలా దగ్గర వాళ్లు అనుకునేలా చేయకండి. ఎందుకంటే మీ మీద కోరికలు కానీ ఇష్టం గానీ పెరిగితే, చివరకు మీరే చికాకులు, తలనొప్పులు అనుభవించాలి.
“సెల్‌ఫోన్ ఉపయోగించే విషయంలో నేను మా అమ్మానాన్నల దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాను. కాబట్టి ఎవరెవరితో ఫోన్లో మాట్లాడాలో నేనే జ్ఞానయుక్తంగా ఎంచుకోగలనని వాళ్లు నమ్ముతారు.”—బ్రియానా.
ఏం మెసేజ్‌లు పంపిస్తున్నారు
;-) మీరు మెసేజ్ టైప్ చేసేముందు ‘ఇలా మెసేజ్ ద్వారా మాట్లాడడం ఈ సందర్భంలో సరైనదేనా?’ అని ఆలోచించండి. ఒక్కోసారి కాస్త ఆగి ఫోన్ చేసి మాట్లాడడం, లేదా వాళ్లను కలసి మాట్లాడడం మంచిది.
;-) మీరు వాళ్ల ఎదురుగా నిల్చుని చెప్పలేని విషయాన్ని మెసేజ్ ద్వారా కూడా చెప్పకండి. “
అది అందరికీ వినిపించేలా చెప్పలేని విషయమైతే, దాన్ని మెసేజ్ ద్వారా కూడా పంపించకూడదు
” అని 23 ఏళ్ల సారా అంటుంది.
“ఎవరైనా మీ ఫోన్‌కి పిచ్చిపిచ్చి బొమ్మలు పంపిస్తుంటే మీ అమ్మానాన్నలకు చెప్పండి. అది మిమ్మల్ని ప్రమాదం నుండి కాపాడుతుంది. అంతేకాదు మీ అమ్మానాన్నలకు మీమీద మంచి నమ్మకం కలుగుతుంది.”—సిర్వాన్.
ఎప్పుడు మెసేజ్‌లు పంపిస్తున్నారు
;-) మీ ఫోన్‌ని ఎప్పుడెప్పుడు ఆపేయాలో ముందుగానే నిర్ణయించుకోండి. ఒలీవియా అనే అమ్మాయి ఇలా అంటుంది, “
భోజనం చేసేటప్పుడు, చదవుకునేటప్పుడు నేను ఫోన్‌ని నా దగ్గర ఉంచుకోను
.క్రైస్తవ కూటాలు జరిగేటప్పుడైతే, దానివైపు చూడాలని నాకు అనిపించకుండా ఆఫ్ చేసి పెడతాను.
”;-) శ్రద్ధ నిలపండి. (ఫిలిప్పీయులు 2:4) మీరు ఒకరితో మాట్లాడుతుండగా, వేరేవాళ్లకు మెసేజ్‌లు పంపించకండి.
“నాకు నేనే కొన్ని రూల్స్ పెట్టుకున్నాను. ఉదాహరణకు నేను చాలామంది స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఎంతో అవసరమైతే తప్ప మెసేజ్‌లు పంపించకూడదని నిర్ణయించుకున్నాను. అంతేకాదు నాకు చాలా దగ్గరగా ఉండేవాళ్లకు మాత్రమే నా ఫోన్ నెంబరు ఇస్తాను.”—యానెల్లీ.