బాధలన్నిటికీ కారణం సాతానేనా?
బైబిలు ఇచ్చే జవాబు
అపవాదియైన సాతాను నిజమైన వ్యక్తి అని బైబిలు చెబుతుంది. నేరస్తుల నాయకునిలా ‘అబద్ధ సూచక క్రియలతో,’ ‘మోసాలతో’ తన పనులన్నీ జరిగిస్తాడు. అంతేకాక, “వెలుగుదూత” వేషం వేస్తాడని కూడా బైబిల్లో ఉంది. (2 థెస్సలొనీకయులు 2:9, 10; 2 కొరింథీయులు 11:14) అతని వల్ల వస్తున్న నష్టాలు చూస్తే సాతాను నిజంగా ఉన్నాడని అర్థమౌతుంది.
అయితే, బాధలన్నిటికీ సాతానే కారణం కాదు. ఎందుకు? దేవుడు మనుషుల్ని మంచి చెడులను నిర్ణయించుకునే శక్తితో సృష్టించాడు. (యెహోషువ 24:15) మనం సరైన నిర్ణయాలు తీసుకోకపోతే దానివల్ల కూడా చెడు ఫలితాలు వస్తాయి.—గలతీయులు 6:7, 8.