కంటెంట్‌కు వెళ్లు

వేర్వేరు జాతులవాళ్లు పెళ్లి చేసుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

వేర్వేరు జాతులవాళ్లు పెళ్లి చేసుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు

 దేవుని దృష్టిలో అన్ని జాతుల ప్రజలు ఒక్కటే కాబట్టి వేర్వేరు జాతులకు చెందిన అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. బైబిలు ఇలా చెప్తోంది, “దేవుడు ఎట్టి పక్షపాతము లేక … ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే.”—అపొస్తలుల కార్యములు 10:34-35, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.

 అన్ని జాతుల ప్రజలు సమానమని చెప్పడానికి, పెళ్లికి సంబంధించిన మరికొన్ని బైబిలు సూత్రాలను పరిశీలించండి:

అన్ని జాతుల ప్రజలకు మూలం ఒక్కరే

 మనుషులందరూ మొదటి మనిషైన ఆదాము, అతని భార్య హవ్వ నుండే వచ్చారు. బైబిలు ఆమెను “జీవముగల ప్రతివానికిని తల్లి” అని పిలుస్తోంది. (ఆదికాండము 3:20) అందుకే బైబిలు దేవుని గురించి ఇలా చెప్తుంది, ‘ఆయన ఒకనినుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించాడు.’ (అపొస్తలుల కార్యములు 17:26, 27) జాతితో సంబంధం లేకుండా మనుషులందరూ ఒకే కుటుంబానికి చెందినవాళ్లు. ఒకవేవ మీరు ఉంటున్న ప్రాంతంలో జాతి వివక్షలు, వర్గభేదాలు బలంగా ఉంటే అప్పుడేంటి?

తెలివైనవాళ్లు ఒకరి ఆలోచనల్ని మరొకరు తెలుసుకుంటారు

 వేర్వేరు జాతులవాళ్లు పెళ్లి చేసుకోవడాన్ని దేవుడు పూర్తిగా అంగీకరించినప్పటికీ, అందరూ దానికి ఒప్పుకోకపోవచ్చు. (యెషయా 55:8, 9) ఒకవేవ మీరు వేరే జాతికి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటే, మీరూ అలాగే మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తీ కలిసి కింది విషయాల గురించి మాట్లాడుకోవడం మంచిది:

  •   మీ సమాజం లేదా కుటుంబం నుండి వచ్చే ఒత్తిడిని మీరు ఎలా తట్టుకుంటారు?

  •   వివక్షను తట్టుకోవడానికి మీరు మీ పిల్లలకు ఎలా సహాయం చేస్తారు?

 ఈ విధంగా ఒకరి ఆలోచనల్ని మరొకరు తెలుసుకోవడం వల్ల మీ వివాహ జీవితాన్ని సంతోషంగా గడపగలుగుతారు.—సామెతలు 13:10; 21:5.