కంటెంట్‌కు వెళ్లు

బ్రిటన్‌ 5వ ఫోటో గ్యాలరీ (సెప్టెంబరు 2017 నుండి ఫిబ్రవరి 2018 వరకు)

బ్రిటన్‌ 5వ ఫోటో గ్యాలరీ (సెప్టెంబరు 2017 నుండి ఫిబ్రవరి 2018 వరకు)

సెప్టెంబరు 2017 నుండి ఫిబ్రవరి 2018 మధ్యకాలంలో బ్రిటన్‌లోని యెహోవాసాక్షుల కొత్త బ్రాంచి కార్యాలయ నిర్మాణ పని ఎలా జరిగిందో చూడండి.

చెమ్స్‌ఫోర్డ్‌లోని బ్రిటన్‌ బ్రాంచి పూర్తైనప్పుడు ఇలా ఉంటుంది.

  1. నార్త్‌ ప్రొడక్షన్‌ బిల్డింగ్‌

  2. సౌత్‌ ప్రొడక్షన్‌ బిల్డింగ్‌

  3. ఆఫీసు భవనం

  4. నివాసభవనం A

  5. నివాసభవనం B

  6. నివాసభవనం C

  7. నివాసభవనం D

  8. నివాసభవనం E

  9. నివాసభవనం F

సెప్టెంబరు 6, 2017​—నివాసభవనం C

ఎక్స్‌టీరియర్స్‌ టీంకు చెందిన వాళ్లు తాపీతో ఇటుకల్ని అతికించి, ఎక్కువైన సిమెంటును తీసేస్తున్నారు. ఇలా అతికించిన ఇటుక స్లాబ్స్‌ని మెటల్‌ ఫ్రేమ్‌వర్క్‌కి అతికించి, ఇనుముతో చేసిన గోడ సపోర్ట్‌ల మీద ఉంచుతారు.

సెప్టెంబరు 20, 2017​—నివాసభవనం D

ఆర్కిటెక్చురల్‌ టీంకు చెందిన ఒకతను మూడు కాళ్ల స్టాండు మీదున్న లేజర్‌ లెవల్‌ను, సర్వే స్టాఫును ఉపయోగించి అపార్ట్‌మెంట్‌ వెలుపలి గోడలు ఎక్కడ రావాలో మార్క్‌ చేస్తున్నాడు. వెనక భాగంలో నివాసభవనం F లోపల చెక్కపని జరుగుతోంది.

సెప్టెంబరు 27, 2017​—నివాసభవనం F

ఒకామె ప్లాస్టరింగ్‌ చేసిన గోడ మీద నీళ్లు స్ప్రే చేస్తూ, తాపీతో దాన్ని నున్నగా చేస్తుంది. నీళ్లు ఆదా చేయడానికి ఫినిషెస్‌ విభాగం వాళ్లు తేమను లాగేసే పరికరంతో నీళ్లు సేకరించి ఆ నీటిని టైల్స్‌ వేసే సిమెంట్‌లో కలపడానికి ఉపయోగిస్తారు.

అక్టోబరు 3, 2017​—బ్రాంచి స్థలం

నివాసభవనం E బయట, కాంట్రాక్టర్లు రోడ్డు మీద తారు వేస్తున్నారు.

అక్టోబరు 10, 2017​—నివాసభవనం F

71 ఏళ్ల వయసున్న ఒకతను నివాసభవనం F వెలుపలి గోడ కడుతున్నాడు. ఈ నిర్మాణ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి 70 ఏళ్లు పైబడిన సాక్షులు 100 కన్నా ఎక్కువమంది ఇక్కడ పనిచేశారు. వాళ్లు తమ విలువైన నైపుణ్యాల్ని, అనుభవాన్ని ఈ పనిలో వెచ్చించారు.

నవంబరు 16, 2017​—నివాసభవనాలు

పశ్చిమం వైపు పైనుండి చూస్తే ఇలా ఉంటుంది. అన్ని నివాసభవనాల పైన మొక్కలతో నిండిన పైకప్పు ఉంటుంది. ఆ పైకప్పులను ఇన్సులేట్‌ చేసి, వాటర్‌ప్రూఫ్‌ చేసి, డ్రైనేజీ లేయర్‌ వేసిన తర్వాత ఆ ప్రాంతంలో పెరిగే మొక్కల విత్తనాలను వేస్తారు. ఇలాంటి పైకప్పులు కొన్ని ప్రాణులకు ఎంతో ఉపయోగకరం. అంతేకాదు అవి ఖర్చును తగ్గిస్తాయి, వర్షపు నీళ్ల వృథాను ఆపుతాయి. ముందుభాగంలో నివాసభవనం A పునాది, ఆఫీసు భవనాల పునాది వేసే స్థలం కనిపిస్తుంది.

నవంబరు 21, 2017​—నివాసభవనం F

ఒక అపార్ట్‌మెంట్‌ ముందుభాగంలో కార్పెంటర్లు ముందే తయారుచేసిన మెటల్‌ డోర్‌ ఫ్రేమ్‌ను బిగిస్తున్నారు. నిర్మాణ స్థలానికి తరలించక ముందే వాటికి పెయింటింగులు వేస్తారు, తాళం, గడియ అన్ని అమర్చుతారు. దానివల్ల వాటిని తేలిగ్గా, త్వరగా బిగించవచ్చు.

నవంబరు 28, 2017​—ఆఫీసు భవనం

చీకటి పడుతుండగా కాంట్రాక్టర్లు ఆఫీసు భవనాల కోసం పిల్లర్లు వేస్తున్నారు. ఫోటో మధ్యలో కాంట్రాక్టర్లు దాదాపు 65 అడుగుల లోతున్న, కాంక్రీటుతో నిండిన కన్నంలోకి స్టీల్‌ ఫ్రేమును దించుతున్నారు. వెనక భాగంలో నివాసభవనం B కనిపిస్తుంది.

డిసెంబరు 5, 2017​—నివాసభవనం E

ఒక వర్కర్‌ పార్కింగ్‌ స్థలంలోని సీలింగ్‌లో ఉన్న హీటింగ్‌ పైపులకు ఇన్సులేటెడ్‌ సపోర్ట్‌ బ్రాకెట్లను వేలాడదీస్తున్నాడు. పైనున్న నివాసభవనాల నేలను ఎక్కువ చలి నుండి రక్షించడానికి ఈ సీలింగులో సోఫిట్‌ బోర్డులను ఉపయోగించారు.

డిసెంబరు 8, 2017​—నివాసభవనం F

గోడల మీద వినైల్‌ పొర వేయడానికి ఫినిషెస్‌ టీంకు చెందిన ఒకతను ప్లాస్టింగ్‌ చేసిన గోడలను నునుపు చేస్తున్నాడు. ఆ పరికరంలో చాలా చిన్నచిన్న రంధ్రాలు ఉండడం వల్ల, నునుపు చేసేటప్పుడు వచ్చే దుమ్ము, ధూళి అంతా వాక్యూమ్‌ పైపులోకి వెళ్తుంది.

డిసెంబరు 21, 2017​—బ్రాంచి స్థలం

సైట్‌వర్క్స్‌ టీంకు చెందిన ఇద్దరు యుటిలిటీ స్టేషన్‌కి వెళ్లే రోడ్డు ఉపరితలాన్ని సిద్ధం చేస్తున్నారు. గ్యాస్‌ టార్చ్‌ ఉపయోగించి కాంక్రీటు మధ్యలో ఉన్న అచ్చులను కాల్చేస్తున్నారు. ఆ ఖాళీల్లో తర్వాత గడ్డి మొలుస్తుంది. దానివల్ల వర్షపు నీరు వృథా కాకుండా ఉంటుంది.

డిసెంబరు 26, 2017​—నివాసభవనం F

అపార్ట్‌మెంట్‌ కిచెన్‌లో ఎయిర్‌లెస్‌ పెయింట్‌ స్ప్రేయర్‌ ఉపయోగించి పెయింటర్లు చివరి కోటింగ్‌ వేస్తున్నారు.

డిసెంబరు 28, 2017​—నివాసభవనం F

బాల్కనీలు పెట్టడానికి, స్కఫోల్డ్‌ టీంలు చుట్టూ ఉన్న స్కఫోల్డ్‌లను తీసేస్తున్నారు. ఫోటో మధ్యలో ఉన్న ఎర్రటి పైపులు ద్వారా చలికాలంలో సిమెంటు నేలలు, ప్లాస్టింగ్‌ చేసిన గోడలు, పెయింట్‌ వేసిన ఉపరితలాలు ఆరడానికి వేడిగాలులు పంపిస్తారు.

జనవరి 16, 2018​—నివాసభవనం F

ఫినిషెస్‌ టీంకు చెందిన ఒకతను వినైల్‌ పొర వేసిన గోడ మీద ఉన్న గాలి బుడగల్ని తీసేస్తున్నాడు. ఈ గోడల్ని నీళ్లతో కడగవచ్చు కాబట్టి బాగా రద్దీగా ఉన్న చోట్లలో ఇవి చక్కగా పనిచేస్తాయి, ఎక్కువకాలం ఉంటాయి. వెనక భాగంలో ఆ టీంకు చెందినవాళ్లు గోడకు పెయింట్‌ వేసి, ఆ పొరల్ని అతికిస్తున్నారు.

జనవరి 27, 2018​—నివాసభవనం E

వర్కర్లు ఆ రోజు తమకు అప్పగించిన పని చేయడానికి ముందు ఒక మీటింగ్‌ జరుపుకుంటున్నారు. ఆ టీం లీడర్‌ భద్రతకు చాలా ప్రాముఖ్యతనిస్తూ వాళ్లకు ఎదురవ్వగల ప్రమాదాల గురించి చెప్తున్నాడు. నివాసభవనం F అపార్ట్‌మెంట్‌లలో ఉండేవాళ్లు రావడానికి ముందు వాటినీ, వాటి చుట్టు పరిసరాలనూ శుభ్రం చేయడానికి వేర్వేరు విభాగాలకు చెందిన వర్కర్లు ఓవర్‌టైమ్‌ చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

ఫిబ్రవరి 1, 2018​—నివాసభవనం F

కాంట్రాక్టర్లు బూమ్‌ లిఫ్ట్‌ ఉపయోగించి పూర్తైన బాల్కనీలను నివాసభవనం Fలో పెడుతున్నారు. వాటికి వేసిన రంగు ఆ బిల్డింగులను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడుతుంది, అలాగే ఆకురాలే కాలంలో అవి చుట్టూ ఉన్న ప్రకృతితో కలిసిపోతాయి. వెనక భాగంలో స్కఫోల్డ్‌ తీసేయడానికి ముందు నివాసభవనం E మీద ఉన్న కవర్‌ను తొలగిస్తున్నారు.

ఫిబ్రవరి 3, 2018​—నివాసభవనాలు

పని అయిపోయిన తర్వాత, ఒక జంట వాళ్ల వస్తువులను నివాసభవనం-F అపార్ట్‌మెంట్‌లోకి తీసుకెళ్తున్నారు. ఆ భవనం ముందురోజే పూర్తయింది. నిర్మాణ పని చేసేవాళ్లను తాత్కాలికంగా ఈ కొత్త అపార్ట్‌మెంట్‌లో ఉంచారు. దానివల్ల అద్దె ఖర్చులు, ప్రయాణ ఖర్చులు తగ్గుతాయి. అంతేకాదు వాళ్లు మెరుగ్గా పనిచేయగలుగుతారు.

ఫిబ్రవరి 12, 2018​—నివాసభవనం A

సాయంత్రం పూట కాంట్రాక్టర్లు పార్కింగ్‌ స్థలంలో స్లాబ్‌ వేయడానికి పంపుతో కాంక్రీటును పోస్తున్నారు. వెనక భాగంలో నివాసభవనం B కనిపిస్తుంది.

ఫిబ్రవరి 15, 2018​—నివాసభవనం E

కార్పెంట్రీ టీంకు చెందిన ఒక జంట వంటగది బల్లను కరెంట్‌ యంత్రంతో కట్‌ చేస్తున్నారు. అలా కట్‌ చేస్తున్నప్పుడు వచ్చే దుమ్మును, ధూళిని ఆ యంత్రం పీల్చేసుకుంటుంది. మోసుకెళ్లేటప్పుడు అవి విరగకుండా ఉండేలా, వాటిని అమర్చాల్సిన చోటే వాటిని కట్‌ చేస్తున్నారు.