కంటెంట్‌కు వెళ్లు

బ్రిటన్‌ ఫోటో గ్యాలరీ 1 (2015 జనవరి నుండి ఆగస్టు వరకు)

బ్రిటన్‌ ఫోటో గ్యాలరీ 1 (2015 జనవరి నుండి ఆగస్టు వరకు)

బ్రిటన్‌లోని యెహోవాసాక్షులు తమ బ్రాంచి కార్యాలయాన్ని లండన్‌లోని మిల్‌ హిల్‌ ప్రాంతం నుండి, 70 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉన్న ఎసిక్స్‌లోని చెమ్స్‌ఫోర్డ్‌ అనే పట్టణం దగ్గరికి మార్చారు. 2015 జనవరి నుండి ఆగస్టు మధ్యకాలంలో, నిర్మాణాన్ని మొదలుపెట్టేందుకు వర్కర్లు ఏర్పాట్లు చేశారు.

జనవరి 23, 2015—బ్రాంచిని నిర్మించే స్థలం

స్థానిక అధికారుల అనుమతితో వర్కర్లు పడిపోయిన చెట్లను తీసేసి, తర్వాతి పనికోసం స్థలాన్ని శుభ్రం చేశారు. పక్షులు గూళ్లుపెట్టే కాలం మొదలవ్వక ముందే ఆ పనిని పూర్తి చేసేలా వాళ్లు చూసుకున్నారు. చెట్లను నరకగా వచ్చిన చెక్కముక్కలతో పాదచారులు నడిచేందుకు దారిని ఏర్పాటు చేశారు. కలపను నిర్మాణ పనికోసం భద్రపరిచారు.

జనవరి 30, 2015—నిర్మాణపనిలో భాగం వహించేవాళ్లు భోజనం చేసేందుకు హాలు

ఒకప్పుడు హోటల్‌గా ఉపయోగించిన స్థలాన్ని ఇప్పుడు వంటకోసం, భోజనాలు చేయడం కోసం ఉపయోగిస్తున్నారు. ఓ ఎలక్ట్రీషియన్‌ అక్కడ వీడియో మానిటర్ల కోసం స్విచ్‌బోర్డులను బిగిస్తున్నాడు. నిర్మాణ పనిచేసేవాళ్లు ఉదయకాల ఆరాధన, బెతెల్‌ కుటుంబ కావలికోట స్టడీలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆ మానిటర్లలో చూస్తారు.

ఫిబ్రవరి 23, 2015—బ్రాంచిని నిర్మించే స్థలం

నిర్మాణ స్థలం చుట్టూ భద్రత కోసం కంచెను పెడుతున్నారు. ఆ ప్రాంతం కాస్త అడవి ప్రాంతంలా ఉంటుంది కాబట్టి, నిర్మాణ పని ప్రభావం అక్కడుండే జంతువులపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదాహరణకు, రాత్రిపూట ఆహారం కోసం బయటికి వచ్చే జంతువులకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు నేల నుండి 20 సెంటిమీటర్ల ఖాళీని వదిలి కంచెను పెట్టారు.

ఫిబ్రవరి 23, 2015—బ్రాంచిని నిర్మించే స్థలం

నిర్మాణపనిలో భాగం వహించేవాళ్లు ఉంటున్న స్థలం నుండి బ్రాంచిని నిర్మించే స్థలం వరకు రోడ్డు వేస్తున్నారు. నిర్మాణపని అయ్యేంతవరకు ఆ రోడ్డును ఉపయోగిస్తారు.

మార్చి 5, 2015—బ్రాంచిని నిర్మించే స్థలం

పూర్తైన రోడ్డును మీరు ఈ చిత్రంలో చూడవచ్చు. కుడివైపు చివరన కనిపిస్తున్నట్లుగా ఆ రోడ్డు బ్రాంచిని నిర్మించే స్థలం వరకు ఉంది. ఎడమవైపు కింద కనిపిస్తున్న బిల్డింగ్‌లను, వర్కర్లు ఉండేందుకు అపార్ట్‌మెంట్లుగా మారుస్తున్నారు. అందుకు కావాల్సిన వాటిని ఏర్పాటు చేయడానికి పక్కన ఉన్న పొలాలను ఉపయోగిస్తారు.

ఏప్రిల్‌ 20, 2015—నిర్మాణపనిలో భాగం వహించేవాళ్లు ఉండే స్థలం

యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడు, అలాగే ప్రధాన కార్యాలయ ప్రతినిధి ఒకరు నిర్మాణపని చేస్తున్న టీమ్‌ను కలవడానికి వచ్చారు. ఆ వారంలో ఓరోజున, బ్రిటన్‌ అలాగే ఐర్లాండ్‌లోని రాజ్యమందిరాల్లో ఒక ప్రత్యేక మీటింగ్‌ని ప్రసారం చేశారు. మన ప్రాజెక్టును కట్టడానికి కావాల్సిన మొదటి అనుమతిని చెమ్స్‌ఫోర్డ్‌ పట్టణ కౌన్‌స్సిల్‌ ముందురోజు సాయంత్రం ఇచ్చిందని ఆ మీటింగ్‌లో చెప్పారు.

మే 13, 2015—నిర్మాణానికి సంబంధించిన పనులు జరిగే ప్రధాన స్థలం

బరువైన పరికరాలను తీసుకెళ్తున్నప్పుడు అక్కడున్న చెట్ల వేర్లకు ఏ హాని జరగకుండా ఉండేలా వర్కర్లు రెండు పెద్ద ఓక్‌ చెట్ల మధ్య ఉన్న స్థలంలో వేర్లకు రక్షణనిచ్చే సిస్టమ్‌ని అమర్చుతున్నారు. దాన్ని నిర్మాణ పనికి సంబంధించిన పనులు జరిగే ప్రధాన స్థలానికీ, బ్రాంచిని నిర్మించే స్థలానికీ మధ్యన ఏర్పాటు చేశారు.

మే 21, 2015—నిర్మాణపనిలో భాగం వహించేవాళ్లు ఉండే స్థలం

తాత్కాలికంగా కట్టిన ఇళ్లకు నీళ్లు, గ్యాసు వంటివి సరఫరా చేసే పైపులను పెట్టడానికి కొంతమంది వర్కర్లు భూమిని త్రవ్వుతున్నారు. చిత్రంలో కనిపిస్తున్నవి ప్రాజెక్టు జరుగుతున్నంతకాలం వర్కర్లు ఉండడానికి కట్టిన మొదటి 50 ఇళ్లు.

జూన్‌ 16, 2015—నిర్మాణపనిలో భాగం వహించేవాళ్లు ఉండే స్థలం

నిర్మాణ పని అయ్యేంతవరకు వర్కర్లు ఉండే ఓ ఇంటికి నీటి పైపులను బిగిస్తున్న ప్లంబర్‌.

జూన్‌ 16, 2015—నిర్మాణపనిలో భాగం వహించేవాళ్లు ఉండే స్థలం

చిత్రంలో కనిపిస్తున్నవి, కొంతకాలం వరకు ఉపయోగించుకోవడానికి కొత్తగా ఏర్పాటు చేసిన ఇళ్లు. వాటి ముందున్న ఖాళీ స్థలంలో మరిన్ని ఇళ్లు కట్టడానికి పునాదులు సిద్ధం చేస్తున్నారు. ఎడమవైపు కనిపిస్తున్న షెడ్డును, నిర్మాణ పనిచేస్తున్న వాళ్లు సామాన్లు పెట్టుకోవడానికి, భోజనం చేయడానికి ఉపయోగించుకుంటారు. ఇళ్ల వెనుక పచ్చగా కనిపిస్తున్న ఖాళీ స్థలంలో బ్రాంచిని నిర్మిస్తారు.

జాస్‌ 16, 2015—నిర్మాణపనిలో భాగం వహించేవాళ్లు ఉండే స్థలం

టెలికమ్యునికేషన్స్‌ రూమ్‌లో ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లను కలుపుతున్న టెక్నీషియన్‌. నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులను చూడడానికి, ఇతర బ్రాంచీలతో మాట్లాడడానికి, ప్రపంచ ప్రధాన కార్యాలయం ఇస్తున్న నిర్దేశాలను పాటించడానికి కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ అలాగే ఇంటర్నెట్‌ మొదట్లో అవసరమైంది.

జూలై 6, 2015—బ్రాంచిని నిర్మించే స్థలం

ఒక కాంట్రాక్టర్‌ GPS పరికరాన్ని ఉపయోగిస్తూ పరిశోధన చేసేందుకు గుంటలు త్రవ్వడానికి స్థలాన్ని కొలుస్తున్నాడు. నిర్మాణపని మొదలవ్వక ముందు ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఆర్కియాలజీ విభాగం వాళ్లకు ఇవి ఉపయోగపడతాయి. చెమ్స్‌ఫోర్డ్‌ దగ్గర్లో రోమన్‌లు స్థిరపడినప్పటికీ, ప్రాంతాన్ని పరిశీలించే మొదటి దశలో త్రవ్విన 107 గుంటల్లో చరిత్రకు సంబంధించిన ఎలాంటి ముఖ్యమైన వస్తువులు దొరకలేదు.

జూలై 6, 2015​—నిర్మాణానికి సంబంధించిన పనులు జరిగే ప్రధాన స్థలం

తలుపు ఫ్రేమ్‌ను కావాల్సిన సైజ్‌లోకి కట్‌ చేస్తున్నారు. ఈ ప్రధాన స్థలంలోని కొన్ని బిల్డింగ్‌లకు మార్పులు చేర్పులు చేసి వాటిని వర్క్‌షాపుల్లా మారుస్తున్నారు. కొంతకాలంపాటు ఉపయోగించుకునే ఆఫీసులు ఇక్కడ ఉంటాయి, నిర్మాణ పనికి మద్దతుగా జరిగే ఇతర పనులు కూడా ఇక్కడే జరుగుతాయి.

జూలై 6, 2015​—నిర్మాణానికి సంబంధించిన పనులు జరిగే ప్రధాన స్థలం

అక్కడున్న మట్టిని వేరేచోటకు తీసుకెళ్లి వేయడానికి ట్రక్‌ను లోడ్‌ చేస్తున్నారు.

జూలై 7, 2015​—బ్రాంచిని నిర్మించే స్థలం

85 ఎకరాల స్థలం నుండి దక్షిణం వైపు చూస్తే కనిపిస్తున్న బ్రిటీష్‌ పల్లె ప్రాంతం. దగ్గర్లో ఉన్న మెయిన్‌ రోడ్డు (చిత్రంలో కనిపించడం లేదు) రేవులకు, విమానాశ్రయాలకు, లండన్‌ పట్టణానికి వెళ్లడానికి చాలా వీలుగా ఉంటుంది.

జూలై 23, 2015​—బ్రాంచిని నిర్మించే స్థలం

కొత్త బ్రాంచి కట్టేందుకు అక్కడున్న పాత నిర్మాణాలను తొలగించి శుభ్రం చేస్తున్న కాంట్రాక్టర్లు.

ఆగస్టు 20, 2015​—నిర్మాణానికి సంబంధించిన పనులు జరిగే ప్రధాన స్థలం

ముందే తయారుచేసి పెట్టిన క్యాబిన్‌కి సంబంధించిన కొంతభాగాన్ని కిందకు దించుతున్న 60 టన్‌ల క్రేన్‌. చిత్రం ముందు భాగంలో మరికొన్ని క్యాబిన్‌ల కోసం పునాదులు వేసి ఉన్నాయి. ఈ క్యాబిన్‌లను ప్రాజెక్టు కోసం కో-ఆర్డినేషన్‌ ఆఫీసులుగా ఉపయోగిస్తారు.