కంటెంట్‌కు వెళ్లు

బ్రిటన్‌ 4వ ఫోటో గ్యాలరీ (2017 మార్చి నుండి ఆగస్టు వరకు)

బ్రిటన్‌ 4వ ఫోటో గ్యాలరీ (2017 మార్చి నుండి ఆగస్టు వరకు)

2017 మార్చి నుండి ఆగస్టు వరకు బ్రిటన్‌లోని యెహోవాసాక్షుల కొత్త బ్రాంచి కార్యాలయ నిర్మాణ పని ఎలా జరిగిందో చూడండి.

మార్చి 28, 2017​—బ్రాంచి స్థలం

ట్రక్కు మీదున్న క్రేన్‌ సహాయంతో ఒక కాంట్రాక్టర్‌, ముందువైపు గ్లాసు ఉన్న క్యాబిన్‌ను దించుతున్నాడు. ఈ క్యాబిన్‌, ఎత్తు నుండి చూడడానికి ఉపయోగపడే డెక్‌లో భాగం. ఈ డెక్‌, నిర్మాణ స్థలంలో చుట్టూ సురక్షితం చేసిన ఒక ప్రాంతంలో ఉంటుంది. విజిటర్‌ సెంటర్‌ను, డెక్‌ను 2017 మేలో ప్రారంభించారు. ఆగస్టు కల్లా, ప్రాజెక్టును చూడడానికి 17,000 కన్నా ఎక్కువమంది సందర్శకులు టూర్‌లు బుక్‌ చేసుకున్నారు.

మార్చి 29, 2017​—నివాస భవనం F

ముందే తయారుచేసిన కాంక్రీట్‌ టేబుల్‌ ఫ్రేమును కాంట్రాక్టర్లు టవర్‌ క్రేన్‌ సహాయంతో నివాసభవనం Fలో దించుతున్నారు. వాటిని వేరేలా పెట్టాల్సి వస్తే, భవనాల చుట్టూ సరిపడా స్థలం ఉండడం వల్ల, మొత్తం ఊడదీయకుండానే కావల్సినట్టు పెట్టవచ్చు.

ఏప్రిల్‌ 7, 2017​—నివాస భవనాలు

ఐదు నివాసభవనాల్ని ఒకే సమయంలో నిర్మిస్తున్నారు. ముందుభాగంలో, నివాసభవనం Bకి కాంక్రీట్‌ పునాది వేయడానికి కాంట్రాక్టర్లు చువ్వల్ని బిగిస్తున్నారు. వెనుకభాగం కుడివైపున, కాంట్రాక్టర్లు నివాసభవనం D గ్రౌండ్‌ ఫ్లోర్‌కి కాంక్రీట్‌తో స్లాబ్‌ వేస్తున్నారు. వెనుకభాగం ఎడమవైపున, నివాసభవనం Eకి సంబంధించిన లిఫ్ట్‌, మెట్ల గదుల్ని తయారుచేయడానికి ఉపయోగించే ఫ్రేమును టవర్‌ క్రేన్‌ దాని స్థానంలో పెడుతోంది.

ఏప్రిల్‌ 19, 2017​—బ్రాంచి స్థలం

మెకానికల్‌ టీంకి చెందిన ఒక సహోదరి, ఫైర్‌-హైడ్రంట్‌ పైపు రెండు భాగాల్ని అతికించిన చోట ఉన్న బొడుపుల్ని పరికరంతో తీసేస్తోంది. ఆ రెండు భాగాల్ని వేడితో కరిగించి అతికిస్తారు. అలా అతికిస్తున్నప్పుడు ఏర్పడే బొడుపుల్ని తొలగించి, ఆ జాయింటు బలంగా, నాణ్యంగా ఉందో లేదో పరీక్షిస్తారు. నిర్మాణంలో భాగంగా, మొత్తం దాదాపు 4 కి.మీ. (2 మైళ్ల) పొడవున్న ఫైర్‌-హైడ్రంట్‌ పైపు వేశారు.

ఏప్రిల్‌ 25, 2017​—నివాస భవనాలు

ఒకతను, ఈమధ్యే వాటర్‌ప్రూఫ్‌ చేసిన కల్వర్టును శుభ్రం చేస్తున్నాడు. నిర్మాణ స్థలంలో ఉన్న ఈ కల్వర్టు, రోడ్లు నీటి మార్గాల మీదుగా వెళ్లడానికి వీలుగా ఉంటుంది. వర్షం నీళ్లు వాటి గుండా చెరువులోకి వెళ్తాయి, అలా పెద్ద వరద అవ్వకుండా ఉంటుంది.

ఏప్రిల్‌ 28, 2017​—నివాస భవనం F

ఆర్కిటెక్చురల్‌ టీంలో ఉన్న ఒక జంట గ్రౌండ్‌ ఫ్లోర్‌ కారిడార్‌ కోసం గుర్తులు పెడుతున్నారు.

మే 5, 2017​—నివాస భవనాలు

తూర్పు వైపు పైనుండి చూస్తే, నిర్మాణ దశలో ఉన్న ఐదు నివాస భవనాలు ఇలా కనిపిస్తాయి. సెప్టెంబరు కల్లా: కాంక్రీట్‌ ఫ్రేములు పూర్తయ్యాయి, నివాసభవనం F (వెనుక కుడివైపు) లోపలి గోడల పని జరుగుతోంది, ఆ భవనానికి సంబంధించిన ప్లాస్టరింగ్‌, పెయింటింగ్‌ పనులు మొదలయ్యాయి. ఈలోగా, వర్కర్లు నివాసభవనం E (వెనుక ఎడమవైపు) బయటి గోడలు, కిటికీల పని మొదలుపెట్టారు. నివాసభవనాలు B, C, Dలను (ముందుభాగం) ఆర్కిటెక్చురల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, స్కఫోల్డింగ్‌ టీంలు పనిచేయడానికి సిద్ధం చేశారు.

మే 18, 2017​—నిర్మాణానికి సంబంధించిన పనులు జరిగే ప్రధాన స్థలం

పరిపాలక సభ పబ్లిషింగ్‌ కమిటీ సహాయకుడూ, ప్రపంచవ్యాప్త డిజైన్‌/నిర్మాణ విభాగం (WDC) పర్యవేక్షకుడూ అయిన రాబర్ట్‌ లూచీయోనీ ఒక బైబిలు ప్రసంగంతో నిర్మాణ టీంలను ప్రోత్సహిస్తున్నాడు. WDC కొత్త బ్రాంచి భవనాల్ని డిజైన్‌ చేయడం, నిర్మించడం వంటి పనుల్ని పర్యవేక్షిస్తుంది. అలాగే ఉన్న వనరులతో నిర్మాణ పని చక్కగా జరిగేలా చూస్తుంది.

మే 25, 2017​—బ్రాంచి స్థలం

గ్యాస్‌, డేటా, ఎలక్ట్రికల్‌ పరికరాలు ఉండే చోటు కోసం వర్కర్లు కాంక్రీట్‌ స్లాబ్‌లు తయారు చేస్తున్నారు. కుడివైపున వర్కర్లు, సౌండు తగ్గించే కంచె కోసం కదిలే కాంక్రీట్‌ పంపు సహాయంతో పునాది వేస్తున్నారు. దానివల్ల, పనిముట్లు ఉపయోగించేటప్పుడు వచ్చే సౌండు తగ్గుతుంది.

జూన్‌ 7, 2017​—నివాస భవనం E

ఫ్లోర్‌ మీద స్టీల్‌ ఫ్రేముల్ని బిగించడం కోసం గుర్తులు పెట్టడానికి ముందు ఆర్కిటెక్చురల్‌ టీం వాళ్లు వాటి నమూనా చిత్రాల్ని గమనిస్తున్నారు.

జూన్‌ 13, 2017​—నివాస భవనం F

ఒకతను బయటి గోడల కోసం స్టీల్‌ ఫ్రేములు బిగిస్తున్నాడు.

జూన్‌ 22, 2017​—నివాస భవనం E

వర్కర్లు బయటి గోడలకు చెందిన పనిచేయడానికి వీలుగా నివాసభవనం E చుట్టూ స్కఫోల్డింగ్‌ ఏర్పాటు చేశారు.

జూలై 11, 2017​—నివాస భవనం F

కొత్తగా అమర్చిన కిటికీలకు ఒక పెయింటరు ప్రత్యేక కోటింగ్‌ వేస్తోంది. ఇది ఎండిపోయినప్పుడు ప్లాస్టిక్‌ పొర ఏర్పడుతుంది. అది నిర్మాణ పని జరుగుతున్నప్పుడు రక్షణగా ఉంటుంది, పని అయిపోయిన తర్వాత దాన్ని తీసేస్తారు.

జూలై 13, 2017​—నివాస భవనం F

ఒక నివాస భవనం గది నేలలో ఉన్న హీటింగ్‌ సిస్టమ్‌కి మెకానికల్‌ టీం వాళ్లు ప్రెజర్‌ టెస్టు చేస్తున్నారు. అవసరమైన మార్పులు చేశాక, ఆ పైపుల మీదుగా చివరిగా కాంక్రీట్‌ ఫ్లోర్‌ వేస్తారు.

జూలై 19, 2017​—బ్రాంచి స్థలం

ఒకతను బ్రాంచి ప్రవేశ ద్వారం ముందు గుండ్రంగా ఉన్న గడ్డిపరుపును కోస్తున్నాడు. ఆ గడ్డిపరుపు వల్ల పిచ్చిమొక్కలు మొలవకుండా ఉంటాయి. దానివల్ల, బిజీ రహదారి పక్కనే ఉన్న ఈ పచ్చిక స్థలాన్ని చూసుకోవడానికి ఎక్కువ సమయం, శక్తి వెచ్చించాల్సిన అవసరం ఉండదు.

ఆగస్టు 1, 2017​—ఆఫీసు భవనం

ఆఫీస్‌ భవనాలకు ప్రవేశ ద్వారంగా ఉండే ఒక చోటును ఒకతను GPS సర్వే పరికరం సహాయంతో గుర్తించి, అక్కడ ఒక చువ్వ పెట్టి, అది స్పష్టంగా కనిపించేలా రంగు వేస్తున్నాడు. ఈ భాగంలో ఒక పర్మనెంట్‌ కిచెన్‌, అలాగే డైనింగ్‌ హాల్‌గా, ఆడిటోరియంగా ఉపయోగించే ఒక స్థలం ఉంటాయి. వెనుకభాగంలో కనిపించేవి నివాస భవనాలు.

ఆగస్టు 8, 2017​—నివాస భవనాలు

వర్షం నీళ్ల డ్రెయినేజీ సిస్టమ్‌లో భాగంగా ఉన్న ఫ్లో-కంట్రోల్‌ ఛాంబర్‌ కోసం ఒక జంట కాంక్రీట్‌ ఫ్రేములు తయారుచేస్తోంది. వెనుకభాగంలో, చలికాలం వాతావరణం ఎలా ఉన్నా పనిచేయగలిగేలా నివాస భవనాలు E, Fలను ప్లాస్టిక్‌ షీట్లతో కప్పారు.

ఆగస్టు 9, 2017​—బ్రాంచి స్థలం

ఒకతను వాక్యూమ్‌ హోస్‌ లిఫ్టర్‌తో ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నాడు. సుమారు 70 కిలోల బరువున్న కాంక్రీట్‌ దిమ్మల్ని ఒకచోటు నుండి ఇంకోచోటుకి తీసుకెళ్లడానికి, వాటిని సరైన స్థానంలో పెట్టడానికి ఆ లిఫ్టర్‌ను ఉపయోగిస్తారు. ఆ కాంక్రీట్‌ దిమ్మల్ని సరైన స్థానంలో ఉంచిన తర్వాత, అవి కదలకుండా ఉండేలా చుట్టూ కాంక్రీట్‌ పోస్తారు.

ఆగస్టు 16, 2017​—బ్రాంచి స్థలం

నీళ్ల పైపును చివరిగా దాని స్థానంలో పెడుతున్నప్పుడు, మెకానికల్‌ టీంకు చెందిన ఒకతను దాన్ని సరైన కోణంలో గట్టిగా పట్టుకున్నాడు. కొత్త బ్రాంచి ఆఫీసుకు, దాదాపు 3 మైళ్ల పొడవున్న నీళ్ల పైపు అవసరం.

ఆగస్టు 22, 2017​—నివాసస్థలం E

ఎక్స్‌టీరియర్‌ టీంకు చెందిన ఒకామె ఎలక్ట్రిక్‌ మాసోనరి బెంచ్‌ ఉపయోగించి ఇటుకల్ని కట్‌ చేస్తుంది. సగం ఇటుకల్ని ఫ్లెమిష్‌ బాండ్‌తో నివాస భవనాలు అందంగా కనిపించేలా తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తారు. నివాస భవనాలకు మొత్తం 3,00,000 కన్నా ఎక్కువ ఇటుకలు పడతాయి.