కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షుల ప్రచారకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది

యెహోవాసాక్షుల ప్రచారకుల సంఖ్య రికార్డు స్థాయికి చేరింది

1987లో యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన లైమన్‌ స్వింగిల్‌ వెనిజ్యులాకి వచ్చారు. అయితే వెనిజ్యులాలోని వలెన్‌షీయలో ఎద్దుల పోటీలు జరిగే స్థలమైన ప్లాసా మోన్యామెన్‌టాల్‌లో ఆయనిస్తున్న ప్రసంగం వినడానికి 63,580 మంది వచ్చారు. వాళ్లలో చాలామంది రాత్రంతా బస్సుల్లో ప్రయాణం చేసి వచ్చారు. వాళ్లందరితో మాట్లాడుతూ సహోదరుడు స్వింగిల్‌ ఇలా అన్నాడు, ‘మీదిప్పుడు చిన్న బ్రాంచి కాదు, అది కాస్త పెద్దది అయింది. కనిపిస్తున్నదాన్ని బట్టి త్వరలోనే ఒక రోజు మీ ప్రచారకుల సంఖ్య 1,00,000కు చేరుతుంది.’

1978లలో, వెనిజ్యులాలో 38,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు ఉండేవాళ్లు. వాళ్లు రాజ్యసువార్తను ఎంతో ఆసక్తిగా ప్రకటించారు. అప్పట్లో, ఎనిమిది దేశాల్లో మాత్రమే 1,00,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉండేవాళ్లు.

ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల సంఖ్య పెరగడం ఇతరులను ఆకట్టుకుంటోంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, యెహోవా రాజ్యం గురించి ప్రజలకు ప్రకటించేవాళ్లు కొన్ని వేలమంది మాత్రమే ఉండేవాళ్లు. కానీ తర్వాత అది మారిపోయింది. 1943 యెహోవాసాక్షుల వార్షిక పుస్తకం (ఇంగ్లీషు)లో ఇలా ఉంది, ‘సమాచారాన్ని సరిగ్గా అందించేవాళ్లు లేక 1942, 1943కి సంబంధించిన పూర్తి రిపోర్టు లేకపోయినా, ఆ రిపోర్టు ఒక ఆశీర్వాదం ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్న ప్రచారకుల సంఖ్య ఇప్పుడు 1,06,000 అని అది చూపిస్తుంది. రెండవ ప్రపంచ యూద్ధం సమయంలో ఉన్న ఆందోళనకర పరిస్థితుల్లో కూడా చాలామంది బైబిలు సత్యాన్ని అంగీకరించారు. 1950లో కేవలం అమెరికాలోనే ప్రచారకుల సంఖ్య 1,00,000 దాటింది.’

తర్వాత 1974లో ప్రచారకుల సంఖ్య 1,00,000కు చేరుకున్న దేశం నైజీరియా.

ఆ తర్వాత సంవత్సరం బ్రెజిల్‌, జర్మనీలలో ప్రచారకుల సంఖ్య 1,00,000 దాటిపోయింది. నాలుగు ఖండాల్లో జరిగిన ఈ పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా బైబిలు సత్యాలకు ప్రజలు ఆసక్తి చూపిస్తారనడానికి ఒక రుజువుగా ఉంది.

ప్రపంచమంతటా, సువార్తను అంగీకరిస్తున్నవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది బైబిల్లో ముందే చెప్పబడిన దానికి అనుగుణంగా ఉంది, “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.”—యెషయా 60:22.

2014 సేవ సంవత్సరానికి సంబంధించిన రిపోర్టు ప్రకారం, 24 దేశాల్లో 1,00,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు. ఆ దేశాల్లో 2007లో రికార్డు సాధించిన వెనిజ్యులా కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 1,15,416 యెహోవాసాక్షుల సంఘాల్లో 82,01,545 మంది ప్రచారకులు ఉన్నారు.

1,00,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్న దేశాలు

ఖండం

దేశం

ప్రచారకులు

ఆఫ్రికా

అంగోలా

1,08,607

కాంగో, డెమొ. రిపబ్లిక్‌ ఆఫ్‌

2,16,024

ఘానా

1,25,443

నైజీరియా

3,62,462

జాంబియా

1,78,481

ఆసియా

జపాన్‌

2,15,703

కొరియా, రిపబ్లిక్‌ ఆఫ్‌

1,00,641

ఫిలిప్పీన్స్‌

1,96,249

యూరప్‌

బ్రిటన్‌

1,38,515

ఫ్రాన్స్‌

1,27,961

జర్మనీ

1,66,262

ఇటలీ

2,51,650

పోలండ్‌

1,23,177

రష్యా

1,71,268

స్పెయిన్‌

1,12,493

యుక్రెయిన్‌

1,50,906

ఉత్తర అమెరికా

కెనడా

1,16,312

మెక్సికో

8,29,523

అమెరికా

12,43,387

దక్షిణ అమెరికా

అర్జెంటీనా

1,50,171

బ్రెజిల్‌

7,94,766

కొలంబియా

1,66,049

పెరూ

1,23,251

వెనిజ్యులా

1,40,226