కంటెంట్‌కు వెళ్లు

ఈ లైబ్రరీని మీతో తీసుకెళ్లవచ్చు

ఈ లైబ్రరీని మీతో తీసుకెళ్లవచ్చు

బైబిల్ని చదవడానికి, లోతుగా పరిశీలించడానికి సహాయపడే ఒక మొబైల్‌ డివైజ్‌ యాప్‌, JW బ్రరీ. దీన్ని 2013 అక్టోబరు 7న, యెహోవాసాక్షులు విడుదలచేశారు. ఈ లైబ్రరీలో ఆరు రకాల ఇంగ్లీషు అనువాద బైబిళ్లు ఉన్నాయి. వాటిలో కింగ్‌ జేమ్స్‌ వర్షన్‌, 2013లో రివైజ్‌ చేసిన పరిశుద్ధ లేఖనముల నూతనలోక అనువాదము కూడా ఉన్నాయి. a

ఎందుకు తయారుచేశారు?

కోట్లమంది తమ పనిలో, ఇతరులతో మాట్లాడడానికి స్మార్ట్‌ ఫోన్‌, టాబ్లెట్‌, అలాంటి ఇతర పరికరాలను ఉపయోగిస్తున్నారు. అయితే, వీటిని వాడే వాళ్లు బైబిల్ని చదవడానికి, లోతుగా పరిశీలించడానికి కావాల్సిన సమాచారాన్ని jw.org వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చు. అలాంటప్పుడు, JW లైబ్రరీ ఎందుకు తయారుచేశారు?

మొదటి కారణం, ఈ యాప్‌ని ఒక్కసారి ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత ఇక ఇంటర్నెట్‌తో పని ఉండదు. కాబట్టి దాన్ని ఆఫ్‌లైన్‌లో కూడా వాడవచ్చు. రెండవ కారణం, పాఠకులు లేఖనాలను సులువుగా తీసి, బైబిలు మొత్తాన్ని లోతుగా పరిశీలించడానికి వీలుగా దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. అదెలా సాధ్యమౌతుంది?

బిల్ని లోతుగా పరిశీలించడానికి JW లైబ్రరీ సహాయం చేస్తుంది

JW లైబ్రరీని మొదటిసారి తెరిచినప్పుడు, బైబిలు పుస్తకాలు కనిపిస్తాయి. ఏ బైబిలు పుస్తకం కావాలో ఎంచుకున్న తర్వాత, ఆ పుస్తకంలోని అధ్యాయాల పట్టిక వస్తుంది. అలా కావాల్సిన వచనాన్ని లేదా ఒక అధ్యాయంలోని భాగాన్ని కొన్ని సెకన్లలో చూడవచ్చు. బైబిల్ని లోతుగా పరిశీలించడానికి సహాయపడే ఇలాంటి అంశాలు కూడా దీనిలో ఉన్నాయి:

  • ఫలాన పదబంధాన్ని ఇంకా ఎలా అనువదించవచ్చో తెలిపే లేదా నేపథ్య సమాచారాన్ని చూపే అధస్సూచిలు

  • ఒకేలాంటి అర్థాలున్న బైబిలు వచనాలకు క్రాస్‌ రెఫరెస్స్‌లు

  • ఫలాన పదం లేదా పదబంధం ఎక్కడెక్కడ ఉందో వెతికే ఏర్పాటు

  • ప్రతి బైబిలు పుస్తకం మొదట్లో, ఆ పుస్తకంలో ఏముందో క్లుప్తంగా తెలిపే భాగం

  • ఏ పుస్తకాన్ని ఎవరు రాశారో, ఎక్కడ రాశారో, ఎప్పుడు రాశారో, అందులోని విషయాలు ఏ కాలానికి చెందినవో చూపించే పట్టిక

  • రంగురంగుల మ్యాపులు, చార్టులు, కాలరేఖలు, చిత్రాలు ఉన్న భాగం

యెహోవాసాక్షుల మిగతా ప్రచురణల్లాగే JW లైబ్రరీ కూడా ఉచితంగా పొందవచ్చు. ఈ బైబిలు యాప్‌కు కావాల్సిన నిధులు పూర్తిగా స్వచ్ఛంద విరాళాలవల్లే వస్తున్నాయి. ఇప్పటికే పదిలక్షల కన్నా ఎక్కువసార్లు దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. (2 కొరింథీయులు 9:7) మీరు కూడా ఈ సాటిలేని లైబ్రరీని డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రయోజనం పొందండి.

a 2014 జవవరిలో ఈ యాప్‌ను అప్‌డేట్‌ చేశారు. ఇప్పుడు దీనిలో యెహోవాసాక్షులు ఉపయోగించే దినవచనం, పాటల పుస్తకం కూడా ఉన్నాయి.