కంటెంట్‌కు వెళ్లు

సందర్శకులకు ఆహ్వానం

సందర్శకులకు ఆహ్వానం

యెహోవాసాక్షులకు ప్రపంచమంతటా 15 ముద్రణా బ్రాంచీలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి సెంట్రల్‌ యూరప్‌ బ్రాంచి, అది జర్మనీలోని సెల్టర్స్‌లో ఉన్న స్టైన్‌ఫెల్స్‌ అనే ప్రాంతంలో ఉంది.

2014లో మే 23-25 వరకు, సెంట్రల్‌ యూరప్‌ బ్రాంచి వాళ్లు తమ బ్రాంచిని చూడడానికి పొరుగువాళ్లను, వ్యాపారస్థులను, స్థానిక అధికారులను ఆహ్వానించారు. ఆ సందర్భాన్ని వాళ్లు “సెల్టర్స్‌లో 30 సంవత్సరాలు” అని పిలిచారు. ఎందుకంటే, ఆ బ్రాంచిని ఏప్రిల్‌ 21, 1984లో ప్రభుత్వ ఆంగీకారంతో ప్రారంభించారు.

మూడు రోజులపాటు సందర్శకుల కోసం తెరిచి ఉంచిన బ్రాంచిని 3,000 కన్నా ఎక్కువ మంది వచ్చి చూశారు. “యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించడమనేది ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది” అని దాదాపు 30 సంవత్సరాలుగా మేయర్‌గా పనిచేస్తున్న స్థానిక ప్రభుత్వ అధికారి అన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, “1979 నుండి 1984లోపు ఇంత త్వరగా స్టైన్‌ఫెల్స్‌లో ఒక బ్రాంచి స్థాపించబడిందన్న విషయం నా ఆసక్తిని ఇంకా పెంచింది.”

సెంట్రల్‌ యూరప్‌ బ్రాంచి విశేషాలు

ఒక దానిపైన అందరికి కనిపించేలా “సెంట్రల్‌ యూరప్‌లోని యెహోవా ప్రజలు” అని రాసివుంది. ఆ ప్రాంతంలో సాక్షులకున్న 120 ఏళ్ల చరిత్ర గురించి తెలుసుకోవడానికి సందర్శకులకు అది సహాయం చేసింది. ఇప్పుడు కూడా దాన్ని బ్రాంచి కార్యాలయంలో చూడవచ్చు.

మరోక ప్రదర్శనలో అరుదుగా దొరికే, ప్రాముఖ్యమైన బైబిళ్లను పెట్టారు. ఉదాహరణకు, దానిలో 1534 నాటి పూర్తి జర్మన్‌ బైబిలు తొలి ఎడిషన్‌ని, అలాగే ఏలీయాస్‌ హుంటర్‌ రాసిన 1599 నాటి వివిధ భాషల్లో ఉన్న ఒక బైబిలు భాగాన్ని పెట్టారు, అందులోని సమాచారం 12 భాషల్లో ఉంది. వాటితోపాటు కొన్ని డిస్‌ప్లేలు, చార్టులు, ఇంకా నేడు మన జీవితంలో ఉపయోగపడే బైబిలు సూత్రాల గురించి ముఖ్యంగా తెలిపే వీడియోలు పెట్టారు.

ఎవరికివాళ్లే వెళ్లి చూసే రెండు టూర్లలో, బ్రాంచి కార్యాలయంలోనే ఉంటూ అక్కడ పనిచేస్తున్న 1,000 కన్నా ఎక్కువ మంది స్త్రీ పురుషుల రోజువారీ పనుల గురించి సందర్శకులు తెలుసుకున్నారు. “మా జీవిత విధానం” అనే ముఖ్యాంశంతో ఉన్న మొదటి టూరులో సందర్శకులు బ్రాంచిలో ఉండేవాళ్ల గదులను చూశారు. అంతేకాదు వాళ్లు డైనింగ్‌ రూములో భోజనం చేసి, పార్కును గుర్తుతెచ్చే బ్రాంచి కార్యాలయ పరిసరాలన్నీ తిరిగి చూశారు. “ఈ స్థలం నిజంగా చాలా అందంగా ఉంది” అని ఒక సందర్శకురాలు చెప్పింది.

“ఉత్పత్తి” అనే అంశంతో ఉన్న రెండవ టూరులో, ముద్రణా రూము, బైండింగ్‌ చేసే స్థలం, షిప్పింగ్‌ విభాగాలు ఉన్నాయి. బైబిలు సాహిత్యాన్ని ఎలా ముద్రిస్తారో, బైండింగ్‌ చేస్తారో, తర్వాత ఓడల్లో వాటిని 50 కన్నా ఎక్కువ దేశాలకు ఎలా పంపిస్తారో సందర్శకులు నేరుగా చూశారు. “యెహోవాసాక్షులది ప్రపంచవ్యాప్త సంస్థని నేనెప్పుడూ ఊహించలేదు. వాళ్ల ప్రచురణలు ప్రపంచ నలుమూలలకు వెళ్తున్నాయి. ఇదంతా స్వచ్ఛంద సేవకులువల్ల జరుగుతుందంటే ఇది ఒక అద్భుతమే.”

jw.orgతో పరిచయం పెంచుకుంటున్న సందర్శకులు

ఆసక్తిని కలిగించే ఒక ప్రత్యేక విషయం ఏమిటంటే, యెహోవాసాక్షుల అధికారిక వెబ్‌సైట్‌ను చూపించే jw.org స్టాండు. పిల్లలు అలాగే పెద్దలు ప్రదర్శనలను, వీడియోలను చూశారు, ఇంకా వాళ్లకున్న ఎన్నో ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నారు.

యెహోవాసాక్షుల ప్రపంచవ్యాప్త పని గురించి ఎన్నో కొత్తకొత్త విషయాలు తెలుసుకున్న సందర్శకుల్లో చాలామంది ఆ పనిని మెచ్చుకుంటూ తమ టూరును ముగించారు. ఆ సమయానికి వాళ్ల ముఖాల్లో చిరునవ్వు కనిపించింది. ఒకాయన ఏమన్నాడంటే, “యెహోవాసాక్షుల గురించి నాకు చాలా తప్పుడు అభిప్రాయాలు ఉండేవి. అయితే నేను ఏర్పర్చుకున్న అభిప్రాయం గురించి నిజంగా మళ్లీ ఆలోచించుకోవాలి.” ఒకామె పదేపదే ఇలా చెప్పింది, ‘యెహోవాసాక్షుల మీద ఉన్న తప్పుడు అభిప్రాయాలన్నీ ఈరోజుతో మటుమాయమైపోతాయి.’

a 2014 ప్రకారం ఉన్న అంకెలు

b 2014 ప్రకారం ఉన్న అంకెలు

c 2014 ప్రకారం ఉన్న అంకెలు