బెతెల్ టూర్‌లు
మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; వాటిని మేం బెతెల్ అని పిలుస్తాం. కొన్ని కార్యాలయాల్లో మ్యూజియంలు కూడా ఉన్నాయి, వాటిని గైడ్ సహాయం లేకుండా మీ అంతట మీరే చూసేలా ఏర్పాట్లు జరిగాయి.
టూర్‌లు మళ్లీ మొదలౌతున్నాయి: చాలా దేశాల్లో, మా బ్రాంచి కార్యాలయాల్ని సందర్శకులు వచ్చి చూసేలా 2023 జూన్ 1 నుండి టూర్లను మొదలుపెడుతున్నాం. వివరాల కోసం, మీరు ఏ బ్రాంచిని సందర్శించాలనుకుంటున్నారో ఆ బ్రాంచిని సంప్రదించండి. దయచేసి మీకు కోవిడ్ పాజిటీవ్ అని తెలిసినా, జలుబు లేదా ఫ్లూ లక్షణాలు ఉన్నా, లేదా ఈ మధ్యే కోవిడ్ పాజిటీవ్ ఉన్నవాళ్లను కలిసినా టూర్‌కి రాకండి.
అమెరికా
ఈ పేజీలో
టూర్ సమాచారం
ప్రదర్శనలు
వార్విక్ సెల్ఫ్-గైడెడ్ ప్రదర్శనలు
బైబిలు, అందులోని దేవుని పేరు. ఈ ప్రదర్శనలో అరుదైన బైబిళ్లు ఉన్నాయి. దేవుని పేరును లేఖనాల నుండి తీసేయడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా అది ఎలా భద్రపర్చబడిందో చూపిస్తుంది. ఇందులో ఉన్న ఒక రోటేషనల్ గ్యాలరీలో చాలా అరుదైన బైబిళ్లను, బైబిలుకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి.
యెహోవా పేరు కోసం ఎంచుకోబడిన ప్రజలు. యెహోవాసాక్షుల చరిత్రను కళ్లకు కట్టినట్టు చూపించే ప్రదర్శన. తన ఇష్టాన్ని నెరవేర్చేలా యెహోవా తన ప్రజల్ని ఎలా క్రమక్రమంగా నడిపించాడో, బోధించాడో, సంస్థీకరించాడో చూపించే కొన్ని వస్తువులు, బొమ్మలు, అనుభవాలు ఉన్నాయి.
ప్రపంచ ప్రధాన కార్యాలయాలు—విశ్వాసంతో ముందుకెళ్తున్నారు. ఈ ప్రదర్శన పరిపాలక సభ కమిటీలు చేసే పనిని వివరిస్తుంది. అలాగే లేఖనాల్లో చెప్పినట్టు మీటింగ్స్ జరుపుకునే విషయంలో, శిష్యుల్ని చేసే విషయంలో, ఆధ్యాత్మిక ఆహారం తీసుకునే విషయంలో, ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో ఆ కమిటీలు యెహోవాసాక్షులకు ఎలా సహాయం చేస్తాయో చూపిస్తుంది.
ప్యాటర్‌సన్ సెల్ఫ్-గైడెడ్ ప్రదర్శనలు
మొదటి శతాబ్దపు బైబిలు గ్రామం. యేసు భూమ్మీద నివసించినప్పుడు జీవితం ఎలా ఉండేదో అని మీకెప్పుడైనా అనిపించిందా? ఈ బైబిలు గ్రామంలో మీరు, మొదటి శతాబ్దపు గ్రామంలోని రోజువారి కార్యక్రమాలు చూడడమే కాదు వాటిలో పాల్గొనవచ్చు కూడా. ఈ ప్రదర్శన వల్ల, బైబిలు చదివినప్పుడు మీరు ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందుతారు.
మొదటి శతాబ్దపు బైబిలు నాణేలు. ఈ ప్రదర్శనలో, క్రైస్తవ గ్రీకు లేఖనాలు ప్రస్తావించే మొదటి శతాబ్దపు అసలైన నాణేలు కొన్ని చూడవచ్చు. అంతేకాదు, ప్రతీ నాణెం గురించి ఆసక్తికరమైన వివరాలు, అలాగే అవి ఫలనా బైబిలు భాగాలతో ఎలా ముడిపడి ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు.
“నీ పిల్లలందరూ యెహోవా చేత బోధించబడతారు.” ఈ ప్రదర్శన మా సంస్థ నిర్వహించే వేర్వేరు పాఠశాలలు, శిక్షణా కార్యక్రమాల గురించి వివరిస్తుంది. ఇష్టపూర్వకంగా ముందుకొచ్చిన స్వచ్ఛంద సేవకులకు నైపుణ్యంగల బోధకులుగా, సంఘపెద్దలుగా తయారవ్వడానికి ఈ పాఠశాలలు ఎలా సహాయం చేశాయో తెలుసుకోండి.
‘మంచివార్త తరఫున వాదించడం, దాన్ని ప్రకటించేలా చట్టబద్ధమైన హక్కును సంపాదించడం.’ ఈ ప్రదర్శనలో, తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా విశ్వాసం విషయంలో రాజీపడని యెహోవాసాక్షులకు సంబంధించిన మనసును కదిలించే కథలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే మా ప్రకటనా పనికి చట్టబద్ధమైన ఆధారం కల్పించడానికి మా సంస్థ ఏమేం చేసిందో చూడండి.