కంటెంట్‌కు వెళ్లు

బెతెల్‌ టూర్‌లు

మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; వాటిని మేం బెతెల్‌ అని పిలుస్తాం. కొన్ని కార్యాలయాల్లో మ్యూజియంలు కూడా ఉన్నాయి, వాటిని గైడ్‌ సహాయం లేకుండా మీ అంతట మీరే చూసేలా ఏర్పాట్లు జరిగాయి.

టూర్‌లు మళ్లీ మొదలౌతున్నాయి: చాలా దేశాల్లో, మా బ్రాంచి కార్యాలయాల్ని సందర్శకులు వచ్చి చూసేలా 2023 జూన్‌ 1 నుండి టూర్లను మొదలుపెడుతున్నాం. వివరాల కోసం, మీరు ఏ బ్రాంచిని సందర్శించాలనుకుంటున్నారో ఆ బ్రాంచిని సంప్రదించండి. దయచేసి మీకు కోవిడ్‌ పాజిటీవ్‌ అని తెలిసినా, జలుబు లేదా ఫ్లూ లక్షణాలు ఉన్నా, లేదా ఈ మధ్యే కోవిడ్‌ పాజిటీవ్‌ ఉన్నవాళ్లను కలిసినా టూర్‌కి రాకండి.

దక్షిణ ఆఫ్రికా

టూర్‌ సమాచారం

టూర్‌కి రావడానికి ముందు మీరు రిజర్వేషన్‌ చేసుకోవాలా? అవును, చేసుకోవాలి. ఎక్కువ రద్దీ లేకుండా అందరూ టూర్‌ని ఆనందించేలా, సందర్శకులు ముందే టూర్‌ రిజర్వ్‌ చేసుకోవాలని కోరుతున్నాం. వస్తున్నది కొంతమంది అయినా సరే, కనీసం ఒక వారం ముందే టూర్‌ రిజర్వ్‌ చేసుకోవాలి. ఒకవేళ పబ్లిక్‌ హాలిడేస్‌ సమయంలో మీరు సందర్శించాలనుకుంటే ఇంకా ముందే టూర్‌ని రిజర్వ్‌ చేసుకోండి.

రిజర్వేషన్‌ లేకపోయినా టూర్‌ దొరుకుతుందా? ఒకవేళ మీరు టూర్‌ రిజర్వ్‌ చేసుకోకపోతే, మేము మీకు టూర్‌ ఇవ్వలేకపోవచ్చు. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి, రోజుకి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలకు టూర్‌ ఇవ్వడం వీలౌతుంది.

టూర్‌ కోసం మీరు ఏ టైంకి రావాలి? మీ టూర్‌ రిజర్వేషన్‌ టైంకి, గంట ముందు రావచ్చు. రద్దీ లేకుండా ఉండాలంటే, దయచేసి అంతకన్నా ముందు రాకండి.

టూర్‌ ఎలా రిజర్వ్‌ చేసుకోవాలి? “రిజర్వేషన్‌ చేయి” బటన్‌ మీద క్లిక్‌ చేయండి.

టూర్‌ రిజర్వేషన్‌ మార్చవచ్చా లేదా క్యాన్సిల్‌ చేయవచ్చా? చేయవచ్చు. “రిజర్వేషన్‌లు చూపించు/మార్చు” బటన్‌ మీద క్లిక్‌ చేయండి.

మీకు కావల్సిన తేదీల్లో టూర్‌ లేకపోతే ఏంచేయాలి? వెబ్‌సైట్‌ని అప్పుడప్పుడు చెక్‌ చేస్తూ ఉండండి. ఇతరులు రిజర్వేషన్లను మార్చుకున్నప్పుడు లేదా క్యాన్సిల్‌ చేసుకున్నప్పుడు టూర్‌లు అందుబాటులోకి వస్తాయి.

రిజర్వేషన్‌ చేయి

టూర్‌ బ్రోషుర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి

ప్రదర్శనలు

హోమ్‌ విజిటర్‌ సెంటర్‌: బెతెల్‌లో ఏమేమి జరుగుతాయో, మన ఆరాధనకు బెతెల్‌ ఎలా మద్దతు ఇస్తుందో వివరించే వీడియోలు ఉంటాయి.

ప్రింటరీ 2 విజిటర్‌ సెంటర్‌: స్థానిక భాషల్లోకి ప్రచురణల్ని అనువదించడం, ప్రింట్‌ చేయడం ఎందుకు ముఖ్యమో చూపించే వీడియోలు ఉంటాయి. ప్రింటింగ్‌ ప్రెస్‌లను పైనుండి వీక్షించేలా ఏర్పాటు చేశారు. కొన్ని స్థానిక భాష బైబిళ్లలో దేవుని పేరును ఎలా ఉపయోగించారో చూపించే ప్రదర్శన కూడా ఉంటుంది.

ప్రింటరీ 3 విజిటర్‌ సెంటర్‌: ప్రచురణల్ని ప్యాక్‌ చేసి పంపించే స్థలానంతటినీ పైనుండి చూసేలా ఏర్పాటు చేశారు. ప్రచురణల బాక్సులు ఎక్కడెక్కడికి చేరుకుంటాయో లైవ్‌లో ఒక స్క్రీన్‌ మీద చూపిస్తారు. రాజ్య మందిరం నిర్మాణ పనులు, ప్రచురణల రవాణా ఏర్పాట్లు, ఆడియో-వీడియో ప్రచురణల తయారీకి సంబంధించిన వీడియోలు ఉంటాయి.

అదనపు సమాచారం: ఒక విజిటర్‌ సెంటర్‌ నుండి ఇంకోదానికి వెళ్లడానికి బస్సులు ఉంటాయి. సందర్శకులు విశ్రాంతి తీసుకునే ప్రాంతంలో వాళ్లు తెచ్చుకున్న ఆహారాన్ని తినొచ్చు.

అడ్రస్‌, ఫోన్‌ నంబర్‌

1 Robert Broom Drive East

Rangeview

KRUGERSDORP

1739

SOUTH AFRICA

+27 11-761-1002

నిర్దేశాలు చూపించు