బెతెల్ టూర్‌లు
మా బ్రాంచి కార్యాలయాల్ని చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం; వాటిని మేం బెతెల్ అని పిలుస్తాం. కొన్ని కార్యాలయాల్లో మ్యూజియంలు కూడా ఉన్నాయి, వాటిని గైడ్ సహాయం లేకుండా మీ అంతట మీరే చూసేలా ఏర్పాట్లు జరిగాయి.
టూర్‌లు మళ్లీ మొదలౌతున్నాయి: చాలా దేశాల్లో, మా బ్రాంచి కార్యాలయాల్ని సందర్శకులు వచ్చి చూసేలా 2023 జూన్ 1 నుండి టూర్లను మొదలుపెడుతున్నాం. వివరాల కోసం, మీరు ఏ బ్రాంచిని సందర్శించాలనుకుంటున్నారో ఆ బ్రాంచిని సంప్రదించండి. దయచేసి మీకు కోవిడ్ పాజిటీవ్ అని తెలిసినా, జలుబు లేదా ఫ్లూ లక్షణాలు ఉన్నా, లేదా ఈ మధ్యే కోవిడ్ పాజిటీవ్ ఉన్నవాళ్లను కలిసినా టూర్‌కి రాకండి.
స్లోవాకియా
టూర్ రిజర్వేషన్‌లు
టూర్‌కి రావడానికి ముందు మీరు రిజర్వేషన్ చేసుకోవాలా? అవును, చేసుకోవాలి. ఎక్కువ రద్దీ లేకుండా అందరూ టూర్‌ని ఆనందించేలా, సందర్శకులు ముందే టూర్ రిజర్వ్ చేసుకోవాలని కోరుతున్నాం. వస్తున్నది కొంతమంది అయినా సరే, కనీసం ఒక వారం ముందే టూర్ రిజర్వ్ చేసుకోవాలి. ఒకవేళ పబ్లిక్ హాలిడేస్ సమయంలో మీరు సందర్శించాలనుకుంటే ఇంకా ముందే టూర్‌ని రిజర్వ్ చేసుకోండి.
రిజర్వేషన్ లేకపోయినా టూర్ దొరుకుతుందా? ఒకవేళ మీరు టూర్ రిజర్వ్ చేసుకోకపోతే, మేము మీకు టూర్ ఇవ్వలేకపోవచ్చు. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి, రోజుకి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలకు టూర్ ఇవ్వడం వీలౌతుంది.
టూర్ కోసం మీరు ఏ టైంకి రావాలి? మీ టూర్ రిజర్వేషన్ టైంకి కనీసం 10 నిమిషాల ముందు వస్తే, టూర్ సమయానికి మొదలౌతుంది.
టూర్ ఎలా రిజర్వ్ చేసుకోవాలి? “రిజర్వేషన్ చేయి” బటన్ మీద క్లిక్ చేయండి.
టూర్ రిజర్వేషన్ మార్చవచ్చా లేదా క్యాన్సిల్ చేయవచ్చా? చేయవచ్చు. “రిజర్వేషన్‌లు చూపించు/మార్చు” బటన్ మీద క్లిక్ చేయండి.
మీకు కావల్సిన తేదీల్లో టూర్ లేకపోతే ఏంచేయాలి? వెబ్‌సైట్‌ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇతరులు రిజర్వేషన్లను మార్చుకున్నప్పుడు లేదా క్యాన్సిల్ చేసుకున్నప్పుడు టూర్‌లు అందుబాటులోకి వస్తాయి.
రిజర్వేషన్ చేయి
టూర్‌లు
Pekna cesta 17
831 52 BRATISLAVA 34
SLOVAK REPUBLIC
+421 2-49107611
నిర్దేశాలు చూపించు
ముఖ్యాంశాలు
చెక్ రిపబ్లిక్ అలాగే స్లోవాకియాలో ఉన్న 26,500 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షుల పనుల్ని పర్యవేక్షిస్తుంది. చెక్, చెక్ సంజ్ఞా భాష, స్లోవాక్, స్లోవాక్ సంజ్ఞా భాష, రోమనీ (తూర్పు స్లోవాకియా) భాషల్లోకి బైబిలు ప్రచురణల్ని అనువదిస్తుంది.