కంటెంట్‌కు వెళ్లు

యెహోవాసాక్షులు ఈస్టర్‌ ఎందుకు చేసుకోరు?

యెహోవాసాక్షులు ఈస్టర్‌ ఎందుకు చేసుకోరు?

తప్పుడు అభిప్రాయాలు

 అపోహ: యెహోవాసాక్షులు క్రైస్తవులు కాదు, అందుకే వాళ్లు ఈస్టర్‌ చేసుకోరు.

 నిజమేంటి? యేసుక్రీస్తు మా రక్షకుడని మేము నమ్ముతాం, ఆయన ‘అడుగుజాడల్లో నడుచుకోవడానికి’ మా శాయశక్తులా కృషిచేస్తాం.—1 పేతురు 2:21; లూకా 2:11.

 అపోహ: యేసు పునరుత్థానం అయ్యాడని మీరు నమ్మరు.

 నిజమేంటి? యేసు పునరుత్థానం అయ్యాడని మేము నమ్ముతాం. క్రైస్తవ విశ్వాసానికి అది మూలాధారమని మేము ఒప్పుకుంటాం. మా ప్రకటనా పనిలో దానికెంతో ప్రాధాన్యతనిస్తాం.—1 కొరింథీయులు 15:3, 4, 12-15.

 అపోహ: ఈస్టర్‌ పండుగ వల్ల కలిగే ఆనందాన్ని మీ పిల్లలు కోల్పోతున్నా మీరు పట్టించుకోరు.

 నిజమేంటి? మా పిల్లల మీద మాకెంతో ప్రేమ ఉంది. అందుకే వాళ్లను మంచి క్రమశిక్షణలో పెంచడానికి, వాళ్లను సంతోషంగా ఉంచడానికి మేము చేయాల్సినదంతా చేస్తాం.—తీతు 2:3-5.

యెహోవాసాక్షులు ఈస్టర్‌ ఎందుకు చేసుకోరు?

  •   ఈస్టర్‌ పండుగ బైబిలు మీద ఆధారపడినది కాదు.

  •   యేసు తన మరణాన్ని జ్ఞాపకార్థంగా ఆచరించమని చెప్పాడే కానీ తన పునరుత్థానాన్ని కాదు. మేము ఆ ఆచరణను ప్రతీ సంవత్సరం బైబిల్లోని చాంద్రమాన క్యాలెండర్‌ ప్రకారం, ఆయన చనిపోయిన తేదీన ఆచరిస్తాం.—లూకా 22:19, 20.

  •   ఈస్టర్‌ పండుగలో పాటించే ఆచారాలు, ప్రాచీనకాలంలో సంతాన సాఫల్యం కోసం పాటించే ఆచారాల నుండి పుట్టుకొచ్చాయి, అందుకే దేవుడు ఈస్టర్‌ను ఆమోదించడు. మనం తనను మాత్రమే ఆరాధించాలని దేవుడు చెబుతున్నాడు కాబట్టి, ఆయన ఆమోదించని ఆచారాలను చేర్చి ఆరాధిస్తే, ఆయనకు చాలా కోపమొస్తుంది.—మార్కు 12:28-30; 1 రాజులు 18:21.

 ఈస్టర్‌ చేసుకోకూడదని మేము తీసుకున్న నిర్ణయం పూర్తిగా బైబిలు మీద ఆధారపడినది. మనుషులు ప్రవేశపెట్టిన ఆచారాలను గుడ్డిగా పాటించే బదులు, ‘జ్ఞానాన్ని, వివేచనను’ ఉపయోగించమని బైబిలు ప్రోత్సహిస్తోంది. (సామెతలు 3:21; మత్తయి 15:3) ఎవరైనా అడిగినప్పుడు, ఈస్టర్‌కి సంబంధించిన మా నమ్మకాల గురించి చెబుతాం. అయితే ఈ విషయంలో ప్రతి ఒక్కరూ ఏమి చేస్తారనేది వాళ్ల వ్యక్తిగత నిర్ణయం, దాన్ని మేము పూర్తిగా గౌరవిస్తాం.—1 పేతురు 3:15, 16.