అప్పటికే ఒక మతాన్ని అనుసరిస్తున్న వాళ్ల దగ్గరకు యెహోవాసాక్షులు ఎందుకు వెళ్తారు?
అప్పటికే ఒక మతాన్ని అనుసరిస్తున్న వాళ్లలో చాలామంది బైబిలు అంశాలను చర్చించడానికి ఆసక్తి చూపిస్తున్నారని మేము గమనించాం. వివిధ రకాల నమ్మకాలు కలిగివుండే హక్కు ప్రజలకు ఉంది, దాన్ని మేము గౌరవిస్తాం. మా సందేశాన్ని ఇతరుల మీద బలవంతంగా రుద్దం.
మతం గురించి చర్చించేటప్పుడు ‘సాత్వికముతో’, ఎదుటి వ్యక్తి పట్ల ‘ప్రగాఢ గౌరవం [NW]’ చూపిస్తూ మాట్లాడాలనే బైబిలు సలహాను పాటించడానికి ప్రయత్నిస్తాం. (1 పేతురు 3:15) మేము చెప్పే సందేశాన్ని కొందరు వినరని మాకు తెలుసు. (మత్తయి 10:14) అయినా ప్రజలు ఎలా స్పందిస్తారో వాళ్లతో మాట్లాడేంత వరకు మాకు తెలీదు. ప్రజల పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని కూడా మాకు తెలుసు.
ఉదాహరణకు, మాతో మాట్లాడలేనంతగా పనిరద్దీలో ఉన్న వ్యక్తి ఇంకో రోజు మాతో మాట్లాడడానికి ఇష్టపడవచ్చు. తాము తప్పక పరిష్కరించుకోవాల్సిన కొత్తకొత్త సమస్యలు, పరిస్థితులు ప్రజలకు తలెత్తుతుంటాయి, ఆ పరిస్థితుల్లో వాళ్లకు బైబిలు సందేశం మీద ఆసక్తి కలగవచ్చు. అందుకే, మేము ప్రజలతో ఒకటికన్నా ఎక్కువసార్లు కలిసి మాట్లాడడానికి కృషి చేస్తాం.