యెహోవాసాక్షుల మతశాఖ అమెరికాకు చెందిందా?
మా ప్రధాన కార్యాలయం అమెరికాలో ఉంది. కానీ మాది అమెరికాకు చెందిన మతశాఖ కాదు. దానికి కారణాలు ఇవి:
స్థాపిత మతం నుండి వేరుపడిన గుంపును శాఖ అని కొందరంటారు. యెహోవాసాక్షులు ఇతర మతాల గుంపు నుండి వేరుపడిన వాళ్లు కాదు. కానీ, మొదటి శతాబ్దంలో పాటించిన క్రైస్తవ మతాన్ని మేము పునఃస్థాపించామని భావిస్తున్నాం.
యెహోవాసాక్షులు తమ పరిచర్యను 230 కన్నా ఎక్కువ దేశాల్లో, ప్రాంతాల్లో చురుగ్గా చేస్తున్నారు. మేము ఎక్కడ నివసిస్తున్నా యెహోవా దేవునికి, యేసుక్రీస్తుకు కట్టుబడి ఉండడానికి ప్రాధాన్యతనిస్తాం కానీ అమెరికా ప్రభుత్వానికో లేదా వేరే ఏ మానవ ప్రభుత్వానికో కాదు.—యోహాను 15:19; 17:15, 16.
మా బోధలన్నీ బైబిలు మీద ఆధారపడినవి, అమెరికాలోని కొంతమంది మత గురువులు రాసిన వాటి మీద ఆధారపడినవి కాదు.—1 థెస్సలొనీకయులు 2:13.
మేము యేసుక్రీస్తును అనుసరిస్తాం కానీ, ఏ మానవ గురువునో కాదు.—మత్తయి 23:8-10.