యెహోవాసాక్షులు దశమభాగం చెల్లిస్తారా?
లేదు, యెహోవాసాక్షులు దశమభాగాన్ని చెల్లించరు. మా పని స్వచ్ఛంద విరాళాల సహాయంతో జరుగుతుంది. ఇంతకీ దశమభాగం అంటే ఏమిటి? దాన్ని యెహోవాసాక్షులు ఎందుకు చెల్లించరు?
దశమభాగం ఇవ్వడం అంటే, ఒకరు తమకు కలిగిన దానిలో పదియవ వంతు ఇవ్వడం. అలా ఇవ్వాలనే ఆజ్ఞ ప్రాచీన ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో ఉంది. అయితే ధర్మశాస్త్రం, అలాగే “పదియవవంతును పుచ్చుకొనుట” అనే అందులోని ఆజ్ఞ క్రైస్తవులకు వర్తించవని బైబిలు స్పష్టం చేస్తుంది.—హెబ్రీయులు 7:5, 18; కొలొస్సయులు 2:13, 14.
అలాంటి లాంటి దశమభాగాలను, అర్పణలను ఇచ్చే బదులు యెహోవాసాక్షులు రెండు విధాలుగా తొలి క్రైస్తవులను అనుకరిస్తారు, వాళ్ల పరిచర్యకు మద్దతునిస్తారు. ఒకటి, వాళ్లు ఉచితంగా ప్రకటిస్తారు, బోధిస్తారు. రెండు, వాళ్లు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తారు.
అలా మేము క్రైస్తవులకు బైబిలు ఇచ్చే ఈ నిర్దేశాన్ని పాటిస్తాం: “సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును.”—2 కొరింథీయులు 9:7.