కావలికోట—అధ్యయన ప్రతి అక్టోబరు 2018

డిసెంబరు 3-30, 2018 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఈ సంచికలో ఉన్నాయి.

1918—వంద సంవత్సరాల క్రితం

యూరప్‌లో మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఆ సంవత్సరం ఆరంభంలో జరిగిన కొన్ని సంఘటనలు బైబిలు విద్యార్థుల్లో అలాగే ప్రజల్లో మంచి జరుగుతుందనే ఆశను చిగురింపజేశాయి.

మనం నిజమే మాట్లాడాలి

ప్రజలు ఎందుకు అబద్ధాలు చెప్తారు? దానివల్ల ఎలాంటి పర్యవసానాలు వస్తాయి? మనం ఒకరితో ఒకరం నిజమే మాట్లాడుతున్నామని ఎలా చూపించవచ్చు?

సత్యాన్ని బోధించండి

ఈ వ్యవస్థ అతిత్వరలోనే అంతమౌతుంది కాబట్టి మనకున్న ఈ కొద్ది సమయంలో ప్రజలకు సత్యాన్ని బోధించడంపై మనం మనసుపెట్టాలి. అలా చేయడానికి బోధనా పనిముట్లు ఎలా ఉపయోగపడతాయి?

జీవిత కథ

నా నిర్ణయాన్ని యెహోవా మెండుగా ఆశీర్వదించాడు

తన సేవను విస్తృతం చేసుకోవడానికి యౌవనంలో ఉన్నప్పుడే చాల్స్‌ మాలహన్‌ బెతెల్‌కు దరఖాస్తు పెట్టాడు. అప్పటినుండి దశాబ్దాలపాటు యెహోవా ఆయన్ని మెండుగా దీవించాడు.

మన నాయకుడైన క్రీస్తుపై నమ్మకం ఉంచండి

దేవుని సంస్థ వేగంగా ముందుకు వెళ్తుండగా, నేడు మన నాయకుడైన యేసుపై నమ్మకం ఉంచడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి?

పరిస్థితులు మారినప్పటికీ మనశ్శాంతిగా ఎలా ఉండవచ్చు?

మన జీవితం అనుకోని విధంగా మలుపు తిరిగినప్పుడు మనం మానసిక ఒత్తిడి గురవ్వవచ్చు. అప్పుడు “దేవుని శాంతి” మనకు ఎలా సహాయం చేస్తుంది?

మీకు తెలుసా?

క్రీస్తు అనుచరుల్లో, మొట్టమొదటి హతసాక్షిగా నమోదైన వ్యక్తి స్తెఫను. అతను హింసించబడుతున్నా అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగాడు?