జీవిత కథ
పరీక్షల్ని సహిస్తే దీవెనలు పొందుతాం
“నువ్వేం తండ్రివి, నీకసలు జాలి లేదు. నీ బిడ్డను, కడుపుతో ఉన్న నీ భార్యను వదిలేశావు. వాళ్ల పోషణ, బాగోగులు ఎవరు చూసుకుంటారు? నీ పనులు మాని ఇంటికి వెళ్లు” అని కె.జి.బి. a అధికారి తిట్టాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, “నా కుటుంబాన్ని నేను వదిలేయలేదు. మీరే నన్ను అరెస్టు చేశారు. అసలు నన్నెందుకు అరెస్టు చేశారు?” అప్పుడు ఆ అధికారి, “యెహోవాసాక్షిగా ఉండడం కన్నా పెద్ద తప్పు ఇంకొకటి లేదు” అని అన్నాడు.
ఆ సంభాషణ 1959లో రష్యాలోని ఇర్కుట్స్క్ అనే ఊరి జైల్లో జరిగింది. నేను, నా భార్య మరీయ ‘నీతిమంతులుగా ఉన్నందుకు బాధలుపడడానికి’ ఎందుకు సిద్ధపడ్డామో, నమ్మకంగా ఉన్నందుకు ఎలాంటి దీవెనలు పొందామో చెప్తాను వినండి.—1 పేతు. 3:13, 14.
నేను 1933లో యుక్రెయిన్‌లోని జలట్నికీ అనే పల్లెటూర్లో పుట్టాను. ఫ్రాన్స్‌లో ఉంటున్న మా మేనత్త, ఆమె భర్త కలిసి 1937లో మా ఇంటికి వచ్చారు. యెహోవాసాక్షులైన వాళ్లు తిరిగి వెళ్లిపోతూ వాచ్ టవర్ సొసైటీ ముద్రించిన గవర్నమెంట్, డెలివరెన్స్ అనే రెండు పుస్తకాల్ని ఇచ్చారు. మా నాన్న ఆ పుస్తకాల్ని చదివినప్పుడు దేవుని మీద అతనికున్న విశ్వాసం పెరిగింది. కానీ విచారకరంగా, 1939లో నాన్నకు బాగా జబ్బు చేసి చనిపోయాడు. అయితే చనిపోయే ముందు అమ్మతో, “ఇదే సత్యం. మన పిల్లలకు దీన్ని నేర్పించు” అని చెప్పాడు.
సైబీరియా—ప్రకటించడానికి ఒక కొత్త ప్రాంతం
1951 ఏప్రిల్‌లో, యు.ఎస్.ఎస్.ఆర్. పశ్చిమ భాగంలో ఉంటున్న యెహోవాసాక్షులైన చాలామందిని అధికారులు సైబీరియాకు తీసుకెళ్లడం మొదలుపెట్టారు. మా అమ్మ, తమ్ముడు గ్రిగోరీతో పాటు నన్ను కూడా పశ్చిమ యుక్రెయిన్ నుండి వెళ్లిపొమ్మన్నారు. మేము ట్రైన్లో 6,000 కి.మీ. ప్రయాణించాక సైబీరియాలోని టూలూన్ అనే ఊరు చేరుకున్నాం. రెండు వారాల తర్వాత మా అన్నయ్య బోగ్దన్, దగ్గర్లో ఉన్న అన్గార్స్క్ ఊరిలోని క్యాంప్‌కు వెళ్లాడు. అప్పుడు అతనికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించి, వెట్టిచాకిరి చేయించారు.
మా అమ్మ, తమ్ముడు గ్రిగోరీ, నేను టూలూన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో స్థిరపడిన వాళ్లకు ప్రీచింగ్ చేశాం. అయితే మేము తెలివిగా మసులుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు, “ఇక్కడెవరైనా ఆవును అమ్మాలనుకుంటున్నారా?” అని అడిగేవాళ్లం. అలా అమ్మాలనుకుంటున్న వాళ్లు కలిసినప్పుడు, ఆ వ్యక్తితో ఆవులు సృష్టించబడిన అద్భుతమైన రీతి గురించి మాట్లాడేవాళ్లం. ఆ తర్వాత, సృష్టికర్త గురించి మాట్లాడేవాళ్లం. అప్పట్లో ఒక వార్తాపత్రికవాళ్లు, యెహోవాసాక్షులు ఆవుల కోసం అడుగుతారు కానీ నిజానికి వాళ్లు గొర్రెల కోసం వెతుకుతున్నారని రాశారు. మేము నిజంగానే గొర్రెల్లాంటి వాళ్లను కనుగొన్నాం. ఇంతవరకు ప్రకటనాపని జరగని ఆ ప్రాంతంలో వినయం, ఆతిథ్యమిచ్చే గుణం ఉన్నవాళ్లతో కలిసి బైబిలు స్టడీ చేయడం సంతోషాన్నిచ్చేది. ఈ రోజు టూలూన్లో 100 కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్న సంఘం ఏర్పడింది.
మరీయ విశ్వాసానికి పరీక్ష
రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన కొన్ని సంవత్సరాలకు నా భార్య మరీయ యుక్రెయిన్‌లో సత్యం నేర్చుకుంది. ఆమెకు 18 ఏళ్లు ఉన్నప్పుడు, ఒక కె.జి.బి. అధికారి తనతో అసభ్యంగా ఆది. 39:12, 20) మరీయను కోర్టు నుండి జైలుకు తీసుకెళ్లిన డ్రైవరు ఆమెతో, “భయపడకు, జైలుకు వెళ్లే చాలామంది మళ్లీ గౌరవంగా బయటకు వస్తారు” అని అన్నాడు. ఆ మాటలు ఆమెకు ఎంతో బలాన్నిచ్చాయి.
ప్రవర్తించి ఆమెను బలవంతపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె దానికి ససేమిరా ఒప్పుకోలేదు. ఒకరోజు ఆమె తన ఇంటికి తిరిగొచ్చేసరికి అతను ఆమె మంచం మీద పడుకొని ఉండడం చూసి అక్కడ నుండి పారిపోయింది. కోపంతో ఊగిపోయిన ఆ అధికారి ఆమె ఒక యెహోవాసాక్షి అనే కారణంతో జైల్లో వేస్తానని బెదిరించాడు. చివరికి 1952లో, మరీయకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించారు. తన పరిస్థితి, దేవునికి నమ్మకంగా ఉన్నందుకు జైలు పాలైన యోసేపు పరిస్థితిలా ఉందని ఆమె చెప్పింది. (రష్యాలోని గోర్కీ (ఇప్పుడు నీజ్నీ నొవ్గరడ్ అని పిలుస్తున్నారు) నగరంలో మరీయను 1952 నుండి 1956 వరకు లేబర్ క్యాంప్‌లో వేశారు. అక్కడ ఆమెకు చెట్లను నరికే పని అప్పగించారు. ఎముకలు కొరికే చలిలో కూడా ఆ పని చేయాలి. దాంతో ఆమె ఆరోగ్యం పాడైంది. కానీ 1956లో ఆమెను విడుదల చేయడంతో టూలూన్కు వెళ్లింది.
నా భార్యాపిల్లలకు దూరంగా
టూలూన్కి ఓ సహోదరి వస్తోందని తోటి సహోదరుడు నాకు చెప్పాడు. ఆమె బ్యాగులు మోయడంలో సహాయం చేద్దామని సైకిల్ వేసుకొని బస్టాప్‌కు వెళ్లాను. ఆ సహోదరే మరీయ. తనను కలిసిన మొదటి రోజే ఆమె నాకు నచ్చింది. ఆమె మనసును గెలవడానికి చాలా ప్రయత్నాలు చేశాను, చివరికి అవి ఫలించాయి. మేము 1957లో పెళ్లి చేసుకున్నాం. ఒక సంవత్సరం తర్వాత మాకో కూతురు పుట్టింది, తనకి ఇరీన అని పేరుపెట్టాం. కానీ మరీయతో ఎక్కువకాలం కలిసివుండే అవకాశం దొరకలేదు. ఎందుకంటే, బైబిలు ఆధారిత ప్రచురణల్ని ముద్రిస్తున్నందుకు నన్ను 1959లో అరెస్టు చేశారు. ఆరు నెలలపాటు నన్ను ఒక్కడినే ఒక జైలు గదిలో నిర్భందించారు. ఆ సమయంలో, నా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, క్రమంగా ప్రార్థన చేసేవాణ్ణి, రాజ్యగీతాలు పాడేవాణ్ణి. అంతేకాదు ఒకవేళ నేను జైల్లో కాకుండా బయట ఉంటే ఎలా ప్రీచింగ్ చేసేవాడినో ఊహించుకునేవాణ్ణి.
జైల్లో నన్ను విచారణ చేస్తున్న ఒక పోలీసు అధికారి, “త్వరలోనే మేము మిమ్మల్ని ఎలుకల్ని తొక్కి చంపినట్టు చంపుతాం” అని అరిచాడు. అందుకు నేను, “రాజ్యం గురించిన మంచివార్త అన్నిదేశాల ప్రజలకు ప్రకటించబడుతుందని యేసు చెప్పాడు, ఆ పనిని ఎవ్వరూ ఆపలేరు” అని జవాబిచ్చాను. అప్పుడు మొదట్లో నేను చెప్పినట్టు, ఆ అధికారి తన తెలివితేటలు ఉపయోగించి నా విశ్వాసాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించాడు. అతని బెదిరింపులు, ప్రయత్నాలు ఏవీ ఫలించకపోయే సరికి నన్ను సరాన్స్క్ నగరానికి దగ్గర్లో ఉన్న లేబర్ క్యాంప్‌లో ఏడు సంవత్సరాలు పనిచేయడానికి పంపించారు. అక్కడికి వెళ్తుండగా నాకు మరో కూతురు పుట్టిందనే వార్త తెలిసింది. తన పేరు ఓల్గ. భార్యాపిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పటికీ, నేనూ మరీయ యెహోవాకు నమ్మకంగా ఉన్నందుకు ఓదార్పుగా అనిపించింది.
మరీయ నన్ను కలవడానికి సంవత్సరానికి ఒకసారి సరాన్స్క్కు వచ్చేది. టూలూన్ నుండి సరాన్స్క్కు ట్రైన్లో వచ్చి వెళ్లడానికి 12 రోజులు పట్టేది, అయినా మరీయ వచ్చేది. అలా వచ్చే ప్రతీసారి ఆమె నాకొక జత కొత్త బూట్లు తెచ్చేది. ఆ బూట్ల హీల్స్‌లో కొత్త కావలికోట ప్రతుల్ని దాచిపెట్టి తెచ్చేది. ఒక సంవత్సరం మాత్రం నాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఎందుకంటే మరీయ తనతోపాటు మా ఇద్దరు కూతుళ్లను కూడా తీసుకొచ్చింది. వాళ్లను చూసినప్పుడు, వాళ్లతో సమయం గడిపినప్పుడు నాకెంత సంతోషంగా అనిపించివుంటుందో ఊహించండి.
కొత్త ప్రాంతాలు, కొత్త సవాళ్లు
నన్ను 1966లో లేబర్ క్యాంప్ నుండి విడుదల చేశారు. నేను, నా భార్యాపిల్లలు నల్ల సముద్రం దగ్గర్లో ఉన్న ఆర్మవీర్ నగరానికి వెళ్లిపోయాం. అక్కడే మా ఇద్దరు కొడుకులైన యారస్లావ్, పావెల్‌లు పుట్టారు.
కొంతకాలానికే, కె.జి.బి. ఆఫీసర్లు బైబిలు ప్రచురణల కోసం వెతుకుతూ మా ఇంటిని సోదా చేయడానికి వచ్చారు. వాళ్లు మొత్తం వెతికారు, ఆఖరికి ఆవుకు పెట్టే ఆహారాన్ని కూడా రోమా. 12:21.
సోదా చేశారు. అలాంటి ఒక సందర్భంలో, ఎండకి అధికారులు చమట్లు కక్కుతున్నారు, వాళ్ల సూట్లు దుమ్ముకొట్టుకుపోయి ఉన్నాయి. వాళ్లను చూసినప్పుడు మరీయకు జాలేసింది. నిజానికి వాళ్లు కేవలం తమ పైఅధికారులకు లోబడుతున్నారు. కాబట్టి ఆమె వాళ్లకు కొంచెం జూస్ ఇచ్చి, వాళ్ల బట్టలకు పట్టిన దుమ్ము దులుపుకోవడానికి బ్రష్‌ను, ఒక గిన్నెతో నీళ్లను, టవళ్లను ఇచ్చింది. కాసేపటికి, కె.జి.బి. ముఖ్య అధికారి వచ్చినప్పుడు, తమపట్ల మరీయ ఎలా దయ చూపించిందో ఆ అధికారులు అతనికి వివరించారు. వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు, ఆ ముఖ్య అధికారి చిరునవ్వుతో మాకు టాటా చెప్పాడు. “మంచి చేసి చెడు మీద విజయం సాధిస్తూ” ఉండడానికి ప్రయత్నించినప్పుడు వచ్చిన చక్కని ఫలితాల్ని చూసి చాలా సంతోషంగా అనిపించింది.—అలా సోదాలు జరిగినప్పటికీ, మేము ఆర్మవీర్లో ప్రీచింగ్ చేయడం ఆపలేదు. అంతేకాదు మాకు దగ్గర్లో ఉన్న కూర్గానిన్స్క్ నగరంలోని ప్రచారకుల చిన్న గుంపును కూడా బలపర్చాం. ఈరోజు ఆర్మవీర్లో ఆరు సంఘాలు, కూర్గానిన్స్క్లో నాలుగు సంఘాలు ఉన్నాయని వినడం చాలా సంతోషంగా ఉంది.
ఆ సంవత్సరాలన్నిటిలో, మేము దేవునికి దూరమైపోయే సందర్భాలు వస్తూనే ఉన్నాయి. కానీ నమ్మకమైన సహోదరుల ద్వారా యెహోవా మమ్మల్ని సరిచేస్తూ, తనతో బలమైన స్నేహాన్ని కలిగివుండేలా సహాయం చేసినందుకు మేమెంతో కృతజ్ఞులం. (కీర్త. 130:3) కె.జి.బి. వాళ్ల మనుషులు గూఢచారుల్లా మా సంఘాల్లోకి వచ్చి మాతో సహవసించారు. వాళ్లతో కలిసి సేవచేయడం మాకు ఎదురైన ఒక పెద్ద పరీక్ష అని చెప్పవచ్చు. వాళ్లు చాలా ఉత్సాహంగా పరిచర్య చేస్తున్నట్టు కనిపించేవాళ్లు. కొంతమందైతే సంస్థలో బాధ్యతాయుత స్థానాల్లో కూడా సేవచేశారు. కానీ కొంతకాలానికి, వాళ్ల అసలు రూపం తెలుసుకోగలిగాం.
1978లో మరీయకు 45 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె మళ్లీ గర్భవతి అయింది. ఆమెకు తీవ్రమైన గుండె సమస్య ఉంది కాబట్టి ఆమె ప్రాణానికి హాని జరుగుతుందేమోనని డాక్టర్లు భయపడ్డారు. అబార్షన్ చేయించుకోమని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ మరీయ ఒప్పుకోలేదు. దాంతో కొంతమంది డాక్టర్లు, హాస్పిటల్లో ఆమె వెనకాలే వెళ్తూ, నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చేలా ఇంజెక్షన్ చేయడానికి ప్రయత్నించారు. కడుపులో ఉన్న బిడ్డను కాపాడుకోవడానికి మరీయ హాస్పిటల్ నుండి పారిపోయింది.
కె.జి.బి. అధికారులు మమ్మల్ని ఊరు వదిలి వెళ్లిపొమ్మన్నారు. మేము ఇస్టోనియాలోని టాలన్ నగరానికి దగ్గర్లో ఉన్న ఒక పల్లెటూరుకు వెళ్లిపోయాం. అది కూడా యు.ఎస్.ఎస్.ఆర్.లోని ఒక ప్రాంతమే. టాలన్లో, అంతకుముందు డాక్టర్లు మరీయకు చెప్పిన దానికి వ్యతిరేకంగా, ఆమె ఆరోగ్యంగా ఉన్న ఒక మగబిడ్డను కనింది. ఆ బాబుకు విటాలీ అనే పేరు పెట్టాం.
కొంతకాలం తర్వాత, మేము ఇస్టోనియా నుండి దక్షిణ రష్యాలోని నెజ్లోబ్నయ అనే ప్రాంతానికి వెళ్లిపోయాం. పర్యాటక స్థలాలుగా ఉన్న అక్కడి చుట్టుపక్కల ఊళ్లలో మేము జాగ్రత్తగా ప్రీచింగ్ చేసేవాళ్లం. దేశ నలుమూలల నుండి ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చేవాళ్లు. వాళ్లు అక్కడికి వైద్యం కోసం వచ్చేవాళ్లు. అయితే, వాళ్లలో కొంతమంది తిరిగి వెళ్లినప్పుడు శాశ్వత జీవితం పొందే నిరీక్షణతో వెళ్లేవాళ్లు.
యెహోవాను ప్రేమించేలా పిల్లల్ని పెంచాం
మా కూతుళ్లు, కొడుకుల హృదయాల్లో యెహోవా మీద ప్రేమ చిగురింపజేసేందుకు, ఆయన సేవ చేయాలనే కోరిక వాళ్లలో కలిగించేందుకు మేము చాలా ప్రయత్నించాం. మా పిల్లలమీద మంచి ప్రభావం చూపించే సహోదరులను తరచూ మా ఇంటికి పిలిచేవాళ్లం. 1970 నుండి 1995 వరకు ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేసిన మా తమ్ముడు గ్రిగోరీ మా ఇంటికి తరచూ వచ్చేవాడు. కుటుంబమంతా అతనితో చాలా ఆనందంగా గడిపేవాళ్లం ఎందుకంటే అతను సరదాగా, చమత్కారంగా ఉండేవాడు. మా ఇంటికి వచ్చినవాళ్లతో బైబిలుకు సంబంధించిన ఆటలు ఆడేవాళ్లం. మా పిల్లలు ఎదుగుతుండగా వాళ్లకు బైబిల్లోని చరిత్ర వృత్తాంతాలు బాగా నచ్చాయి.
1987లో మా కొడుకు యారస్లావ్ లాట్వియలోని రేయిగ అనే నగరానికి వెళ్లిపోయాడు. అక్కడ అతను చాలా స్వేచ్ఛగా ప్రీచింగ్ చేయగలిగాడు. కానీ మిలిటరీలో చేరడానికి నిరాకరించినందుకు అతన్ని ఏడాదిన్నరపాటు వేర్వేరు జైల్లలో వేశారు. నేను జైలుకు వెళ్లినప్పుడు ఎదురైన అనుభవాల గురించి చెప్పిన విషయాలు యారస్లావ్కు సహించడానికి సహాయం చేశాయి. కొంతకాలానికి అతను పయినీరు సేవ మొదలుపెట్టాడు. 19 ఏళ్లు వచ్చిన మా కొడుకు పావెల్ 1990లో ఉత్తర జపాన్‌లోని ఒక ద్వీపమైన సాఖలీన్లో పయినీరు సేవ చేయాలనుకున్నాడు. మొదట్లో, అతను అక్కడికి వెళ్లడం మాకు ఇష్టంలేదు. ఆ ద్వీపం మొత్తం మీద కేవలం 20 మంది ప్రచారకులే ఉండేవాళ్లు. అంతేకాదు ఆ ద్వీపం మేము ఉంటున్న ప్రాంతానికి 9,000 కి.మీ. దూరంలో ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత మా మనసు మార్చుకున్నాం, పావెల్ తీసుకున్న నిర్ణయం సరైనదే. ఎందుకంటే, అక్కడ ప్రజలు రాజ్య సువార్తను చక్కగా విన్నారు. కొన్ని సంవత్సరాల్లోనే అక్కడ ఎనిమిది సంఘాలు ఏర్పడ్డాయి. 1995 వరకు పావెల్ సాఖలీన్లోనే సేవచేశాడు. ఆ సమయంలో, మా చిన్న కొడుకు విటాలీ మాతోనే ఇంటి దగ్గర ఉండేవాడు. వాడికి చిన్నప్పటి నుండి బైబిలు చదవడమంటే ఇష్టం. తనకు 14 ఏళ్లు వచ్చినప్పుడు పయినీరు సేవ మొదలుపెట్టాడు. నేను కూడా విటాలీతో కలిసి రెండేళ్లు పయినీరు సేవచేశాను. ఆ సమయం అద్భుతంగా ఉండేది. విటాలీకి 19 ఏళ్లు వచ్చినప్పుడు ప్రత్యేక పయినీరుగా వేరే ప్రాంతంలో సేవచేయడానికి వెళ్లిపోయాడు.
1952లో, ఒక కె.జి.బి. అధికారి మరీయతో, “నీ విశ్వాసాన్నైనా వదిలిపెట్టు లేకపోతే పదేళ్ల జైలు శిక్షయినా అనుభవించు. నువ్వు జైలు నుండి బయటికి వచ్చేసరికి ముసలిదానివి అయిపోతావు, అప్పుడు నీకెవ్వరూ ఉండరు” అని అన్నాడు. కానీ పరిస్థితులు అలా లేవు. యథార్థవంతుడైన యెహోవా ప్రేమను అలాగే మా పిల్లలు చూపించిన, మా ద్వారా సత్యం నేర్చుకున్న ఎంతోమంది చూపించిన ప్రేమను మేం రుచిచూశాం. మా పిల్లలు సేవ చేసిన ప్రాంతాలకు కూడా నేను, మరీయ వెళ్లాం. మా పిల్లల ద్వారా యెహోవా గురించి నేర్చుకున్నవాళ్లలో ఉన్న కృతజ్ఞతా భావాన్ని చూసి మేము చాలా సంతోషించాం.
యెహోవా మంచితనానికి కృతజ్ఞతలు
1991లో రష్యాలో యెహోవాసాక్షుల పనికి చట్టబద్ధమైన గుర్తింపు దొరికింది. అది తెలిసినప్పుడు ప్రీచింగ్ చేయడానికి నూతన బలం వచ్చింది. వారాంతాల్లో మా చుట్టుపక్కల పట్టణాలకు, పల్లెటూళ్లకు వెళ్లి సేవచేసేలా సంఘంలో ఉన్నవాళ్లమంతా కలిసి ఒక బస్సును కూడా కొన్నాం.
యారస్లావ్ తన భార్య ఆల్యోనతోపాటు, పావెల్ తన భార్య రాయతోపాటు బెతెల్‌లో సేవ చేస్తున్నందుకు అలాగే విటాలీ తన భార్య స్వెట్లానతోపాటు ప్రాంతీయ పనిలో సేవ చేస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మా పెద్ద కూతురు ఇరీన, తన కుటుంబంతో కలిసి జర్మనీలో ఉంటోంది. ఆమె భర్త వ్లాడీమిర్ అలాగే వాళ్ల ముగ్గురు కొడుకులు సంఘ పెద్దలుగా సేవచేస్తున్నారు. మా కూతురు ఓల్గ ఇస్టోనియాలో ఉంటుంది. ఆమె రోజూ ఫోన్ చేస్తూ ఉంటుంది. బాధకలిగించే విషయం ఏమిటంటే, నా భార్య మరీయ 2014లో చనిపోయింది. ఆమె పునరుత్థానమైనప్పుడు కలుసుకోవాలని ఆతురతతో ఎదురుచూస్తున్నాను. నేను ఇప్పుడు బెల్గొరడ్లో ఉంటున్నాను. ఇక్కడున్న సహోదరులు నాకు ఎంతో సహాయం చేస్తారు.
యెహోవా సేవ చేసిన సంవత్సరాలన్నిటిలో నేను ఒక విషయం నేర్చుకున్నాను. అదేమిటంటే, యథార్థంగా ఉన్నప్పుడు మనం కొన్ని కోల్పోతాం కానీ దానికి బదులు యెహోవా ఇచ్చే మనశ్శాంతి ఎంతో విలువైన సంపద లాంటిది. స్థిరంగా ఉండడం వల్ల నేను, మరీయ పొందిన దీవెనలు మేము ఊహించినవాటి కన్నా గొప్పవి. 1991లో యు.ఎస్.ఎస్.ఆర్. కుప్పకూలక ముందు 40 వేలకు పైగా ప్రచారకులు మాత్రమే ఉండేవాళ్లు. కానీ ఈ రోజు, ఒకప్పుడు సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న దేశాల్లో 4 లక్షల కన్నా ఎక్కువమంది ప్రచారకులు ఉన్నారు. నాకిప్పుడు 83 సంవత్సరాలు, నేను ఒక సంఘపెద్దగా కొనసాగుతున్నాను. యెహోవా మద్దతు నాకు, మరీయకు అన్ని సమయాల్లో సహించడానికి శక్తినిచ్చింది. అవును, యెహోవా నన్ను మెండుగా దీవించాడు.—కీర్త. 13:5, 6.
a కె.జి.బి. అంటే రష్యన్ భాషలో సోవియట్ స్టేట్ సెక్యూరిటీ కమిటీ.