పాఠకులకు గమనిక
ప్రియమైన పాఠకులారా
ఈ కావలికోట సంచికలోని ఐదు ఆర్టికల్స్‌లో, ఒకదానికొకటి సంబంధం ఉన్న ఈ ప్రశ్నల్ని పరిశీలిస్తాం:
ఒకటి, భూమ్మీదున్న తన పిల్లలు పాపంతో పోరాడడానికి యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?
రెండు, నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో యెహోవా ఎలా నేర్పించాడు? పాపం చేసినవాళ్లను పశ్చాత్తాపం వైపు నడిపించడానికి యెహోవా ఎలా సహాయం చేశాడు?
మూడు, కొరింథు సంఘంలో తప్పు చేసి, పశ్చాత్తాపం చూపించని వ్యక్తితో ఎలా వ్యవహరించాలని యెహోవా కోరుకున్నాడు?
నాలుగు, ఈ రోజుల్లో ఘోరమైన పాపం చేసినవాళ్లతో సంఘపెద్దలు ఎలా వ్యవహరిస్తారు?
ఐదు, పశ్చాత్తాపం చూపించని వ్యక్తిని సంఘం నుండి తొలగించాక కూడా అతని మీద ప్రేమ, కరుణ ఎలా చూపించవచ్చు?