కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

ప్రతీ అభిషిక్త క్రైస్తవుడు దేవుని నుండి పొందే “సంచకరువు,” “ముద్ర” ఏమిటి?—2 కొరిం. 1:21, 22.

ఒకప్పుడు, ఓ దస్తావేజు అధికారికతను తెలపడానికి ముద్ర ఉన్న ఉంగరాన్ని దస్తావేజుపై ఉన్న బంకమట్టిలో లేదా మైనంలో అద్దేవాళ్లు

సంచకరువు: ఓ రెఫరెన్సు ప్రకారం, 2 కొరింథీయులు 1:22 లో “సంచకరువు” అని అనువదించబడిన గ్రీకు పదం “ఓ చట్టపరమైన, వాణిజ్యపరమైన పదం.” ఆ పదానికి, “వస్తువును కొన్నందుకు చెల్లించాల్సిన మొత్తం డబ్బులో ముందు కొంతభాగాన్ని కట్టి ఆ వస్తువుపై చట్టపరమైన హక్కు సంపాదించుకునేలా లేదా కాంట్రాక్టును అమలులోకి తెచ్చేలా కట్టే మొదటి వాయిదా, డిపాజిట్‌, అడ్వాన్సు, చేసే ప్రమాణం” అని అర్థం. అభిషిక్తుల విషయానికొస్తే, వాళ్లు పొందే పూర్తి ప్రతిఫలం లేదా బహుమానం గురించి 2 కొరింథీయులు 5:1-5 లో వర్ణించబడింది. ఆ బహుమానంలో, అక్షయమైన శరీరం పొందడం, అమర్త్యతను పొందడం ఉన్నాయి.—1 కొరిం. 15:48-54.

ఆధునిక గ్రీకులో, సంచకరువు లాంటి ఓ పదాన్నే నిశ్చితార్థ ఉంగరాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. సూచనార్థక భావంలో క్రీస్తుకు భార్య అయ్యేవాళ్ల గురించి చెప్పడానికి ఇది సరైన ఉదాహరణ.—2 కొరిం. 11:2; ప్రక. 21:2, 9.

ముద్ర: ఒకప్పుడు యాజమాన్య హక్కునూ, అధికారికతనూ, ఒప్పందాన్నీ తెలపడానికి ముద్రను సంతకంగా లేదా ఓ గుర్తుగా ఉపయోగించే వాళ్లు. అభిషిక్తుల విషయంలోనైతే, వాళ్లు దేవుని సొత్తుగా పవిత్రశక్తి చేత ‘ముద్రించబడ్డారని’ తెలిపే సూచనార్థక గుర్తే ఆ ముద్ర. (ఎఫె. 1:13, 14) అయితే, ఓ అభిషిక్తుడు నమ్మకంగా చనిపోయేముందు లేదా మహాశ్రమలు మొదలవ్వడానికి కొంతకాలం ముందు మాత్రమే ఆ ముద్రకు శాశ్వత విలువ వస్తుంది.—ఎఫె. 4:30; ప్రక. 7:2-4.