అధ్యయనం కోసం చిట్కా
యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకంలో ఉన్న లేఖనాల వివరణల నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారా?
ఈ లేఖనాల వివరణలు బైబిల్లో ఉన్న సత్యాల్ని తవ్వి తీయడానికి ఉపయోగపడతాయి. ఫలానా లేఖనం రాయబడినప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగాయో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఆ లేఖనాల్ని ఎందుకు రాశారో, అవి ఎవరికి వర్తిస్తాయో అందులో ఉంటాయి. అంతేకాదు, కొన్ని పదాల లేదా మాటల వివరణలు కూడా అందులో చూడొచ్చు.
కావలికోట ఆన్‌లైన్ లైబ్రరీలో అలాగే JW లైబ్రరీలో నేరుగా బైబిలు వచనాల పైన నొక్కితే పరిశోధనా పుస్తకాన్ని చూడొచ్చు. అందుబాటులో ఉన్న రెఫరెన్సులన్నీ కుడివైపు కనిపిస్తాయి.
రెఫరెన్సులను చూస్తున్నప్పుడు తేదీలను జాగ్రత్తగా గమనించండి. కొత్తగా వచ్చిన ఆర్టికల్స్ అన్నీ పైన కనిపిస్తాయి. కిందికి వెళ్తున్న కొద్దీ పాత ఆర్టికల్స్ కనిపిస్తాయి, అయితే ఆ పాత ఆర్టికల్స్‌లో పాత అవగాహనలు ఉండొచ్చు.
కావలికోట ఆన్‌లైన్ లైబ్రరీలో పరిశోధనా పుస్తకంలోని రెఫరెన్సులు ఆటోమెటిక్‌గా కనిపిస్తాయి.
JW లైబ్రరీలో లేఖనాలకు సంబంధించిన రెఫరెన్సులు కనిపించాలంటే, పరిశోధనా పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బైబిల్లో ఏ అధ్యాయాన్ని తెరిచినా, కుడివైపు కనిపించే డౌన్‌లోడ్ బటన్‌ని నొక్కి ఆ పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.