కావలికోట—అధ్యయన ప్రతి జనవరి 2017
ఫిబ్రవరి 27 నుండి ఏప్రిల్ 2, 2017 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఈ సంచికలో ఉన్నాయి.
తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు
వేరే దేశాల్లో సేవ చేసిన సహోదరీల్లో చాలామంది, అలా వెళ్లేందుకు మొదట్లో కాస్త వెనుకంజ వేశారు. కానీ చివరికి ధైర్యం ఎలా కూడగట్టుకున్నారు? వేరే దేశానికి వెళ్లి సేవచేయడం వల్ల వాళ్లేమి నేర్చుకున్నారు?
యెహోవామీద నమ్మకం ఉంచి మంచి చేయండి
మనం చేయలేని పనులను మనకోసం చేయడానికి యెహోవా సంతోషిస్తాడు. కానీ దానికోసం మనం చేయగలిగింది చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం చేయలేనివి ఏంటో, చేయగలిగేవి ఏంటో గుర్తించడానికి 2017 వార్షిక వచనం మనకెలా సహాయం చేస్తుంది?
స్వేచ్ఛాచిత్తం అనే బహుమానాన్ని విలువైనదిగా చూడండి
స్వేచ్ఛాచిత్తం అంటే ఏమిటి? దానిగురించి బైబిలు ఏమి చెప్తుంది? ఇతరుల స్వేచ్ఛాచిత్తాన్ని మీరెలా గౌరవించవచ్చు?
అణకువ ఎందుకు ప్రాముఖ్యం?
అణకువ అంటే ఏమిటి? వినయనానికి, అణకువకు ఉన్న సంబంధమేమిటి? అణకువను అలవర్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపించవచ్చు
మన పరిస్థితులు మారినప్పుడు, ఇతరులు మనల్ని విమర్శించినప్పుడు లేదా పొగిడినప్పుడు, అయోమయంలో ఉన్నప్పుడు అణకువను ఎలా కాపాడుకోవచ్చు?
‘ఈ విషయాల్ని నమ్మకస్థులైన పురుషులకు అప్పగించు’
యౌవనులు ఎక్కువ బాధ్యతలు చేపట్టేలా వయసుపైబడినవాళ్లు ఎలా సహాయం చేయవచ్చు? ఎన్నో సంవత్సరాలపాటు బాధ్యతలు చేపట్టినవాళ్లను గౌవరిస్తున్నామని యౌవనులు ఎలా చూపించవచ్చు?
మీకిది తెలుసా?
బైబిలు కాలాల్లో, మంటను ఒకచోటు నుండి మరొక చోటుకు ఎలా తీసుకెళ్లేవాళ్లు?