కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయనం కోసం చిట్కా

వ్యక్తిగత అధ్యయనం కోసం, కుటుంబ ఆరాధన కోసం కొన్ని చిట్కాలు

వ్యక్తిగత అధ్యయనం కోసం, కుటుంబ ఆరాధన కోసం కొన్ని చిట్కాలు

మనం యెహోవాను మీటింగ్స్‌లో, పెద్దపెద్ద సమావేశాల్లోనే కాదు వ్యక్తిగతంగా, కుటుంబంగా కూడా ఆరాధిస్తాం. మీ వ్యక్తిగత అధ్యయనం కోసం, కుటుంబ ఆరాధన కోసం కొన్ని చిట్కాలు చూడండి:

  • మీటింగ్స్‌కి సిద్ధపడండి. దాంట్లో భాగంగా పాటలు ప్రాక్టీస్‌ చేయవచ్చు, కుటుంబంలో అందరూ కామెంట్స్‌ చెప్పేలా సిద్ధపడవచ్చు.

  • ఒక బైబిలు వృత్తాంతం చదవండి. తర్వాత, మీరు చదివిన వృత్తాంతంలోని సంఘటనను ఒక బొమ్మ గీయవచ్చు లేదా మీరు నేర్చుకున్న విషయాల్ని రాసుకోవచ్చు.

  • బైబిల్లో ఉన్న ఒక ప్రార్థనను చదవచ్చు. ఆ తర్వాత, మీ ప్రార్థనల్ని ఇంకా బాగా ఎలా చేయవచ్చో ఆలోచించవచ్చు.

  • jw.orgలో ఒక వీడియో చూసి, చర్చించుకోండి. ఆ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో రాసుకోండి.

  • ప్రీచింగ్‌ కోసం సిద్ధపడండి. ప్రీచింగ్‌లో ఎలా మాట్లాడతారో మీ కుటుంబ సభ్యులతో ప్రాక్టీస్‌ చేయండి.

  • సృష్టిని గమనించండి. అది యెహోవా గురించి మీకు ఏం నేర్పిస్తుందో ఆలోచించండి లేదా మాట్లాడుకోండి. a

a 2023, మార్చి కావలికోట సంచికలోని “సృష్టిని చూసి యెహోవా గురించి ఇంకా ఎక్కువ నేర్చుకోండి” అనే ఆర్టికల్‌ చూడండి.