కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయనం కోసం చిట్కా

గుర్తుపెట్టుకోవడానికి బొమ్మలు గీయండి

గుర్తుపెట్టుకోవడానికి బొమ్మలు గీయండి

నేర్చుకున్నవి గుర్తుపెట్టుకోవడం మనలో చాలామందికి అంత ఈజీ కాదు. కానీ యేసు చెప్పిన ఉదాహరణలు మాత్రం టక్కుమని గుర్తొస్తాయి. ఎందుకో తెలుసా? మీరు వాటిని మీ మనసులో బొమ్మల రూపంలో ఊహించుకుంటారు, అందుకే అవి గుర్తొస్తాయి. కాబట్టి, నేర్చుకున్నవి గుర్తుపెట్టుకోవాలంటే వాటిని బొమ్మల రూపంలో ఊహించుకోవాలి. దాని ఎలా చేయవచ్చు? మీరు నేర్చుకున్న వాటిని బొమ్మల రూపంలో గీయండి.

నేర్చుకునే కొత్త విషయాల్ని బొమ్మల రూపంలో ఎవరైతే గీస్తారో వాళ్లు వాటిని బాగా గుర్తుంచుకుంటారు. పదాలనే కాదు, ముఖ్యమైన విషయాల్ని అర్థంచేసుకోవడానికి కూడా ఈ పద్ధతి ఉపయోగపడుతుందని చాలామంది అంటారు. అయితే వాళ్ల బొమ్మలేమీ కళాఖండాలు కావు. అవి చాలా సింపుల్‌గా, చిన్నగా ఉంటాయి. అంతేకాదు, బొమ్మలు గీయడం వల్ల ముఖ్యంగా వృద్ధులు బాగా గుర్తుపెట్టుకుంటారని ఆధారాలు చూపిస్తున్నాయి.

ఈసారి అధ్యయనం చేసేటప్పుడు, నేర్చుకున్న వాటిని బొమ్మల రూపంలో గీసి చూడండి. మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటారో చూసి మీరే ఆశ్చర్యపోతారు!