కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

యెరికో పట్టణాన్ని కొన్నిరోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారని చెప్పడానికి ఏవైనా పురావస్తు ఆధారాలు ఉన్నాయా?

ఒకవేళ ఆ ముట్టడి ఎక్కువకాలం కొనసాగితే, ఆ పట్టణంలోని ప్రజలు తాము నిల్వ చేసుకున్న ఆహారాన్ని చాలావరకు తినేసేవాళ్లు. సైన్యాలు చివరికి ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు, మిగిలిన ధాన్యంతోపాటు దొరికినదంతా దోచుకునేవాళ్లు. పాలస్తీనాలోని కొన్ని పట్టణాలపై ఇలాంటి దాడే జరిగింది. అందుకే వాటి శిథిలాల్లో పురావస్తు శాస్త్రజ్ఞులకు కొంచెం ధాన్యమే దొరికింది, కొన్ని చోట్లయితే అస్సలు దొరకలేదు. కానీ యెరికో శిథిలాల్లో మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ధాన్యం కనుగొన్నారు. కాబట్టి, బైబిలు చెప్తున్నట్లు ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని కొన్నిరోజుల్లోనే స్వాధీనం చేసుకున్నారని చెప్పవచ్చు.—w15 11/15, 13వ పేజీ.

యెహోవాను సేవించేలా టీనేజీ వయసులో ఉన్న తమ పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి తల్లిదండ్రులు ఏ ముఖ్యమైన పనులు చేయవచ్చు?

తల్లిదండ్రులు టీనేజీలో ఉన్న తమ పిల్లల్ని ప్రేమించాలి, ఆ ప్రేమను తమ పనుల్లో చూపించాలి. ఇలా చేయడం చాలా ప్రాముఖ్యం. అంతేకాదు తల్లిదండ్రులు వివేచన చూపిస్తూ, పిల్లల్ని అర్థం చేసుకోవడానికి కృషిచేయాలి.—w15 11/15, 9-11 పేజీలు.

మాట్లాడే ముందు మనం ఏ విషయాల గురించి ఆలోచించాలి?

మన నాలుకను మంచి కోసం ఉపయోగించాలంటే, మాట్లాడే ముందు ఈ మూడు విషయాల గురించి ఆలోచించాలి. (1) ఎప్పుడు మాట్లాడాలి? (ప్రసం. 3:7), (2) ఏమి మాట్లాడాలి? (సామె. 12:18), (3) ఎలా మాట్లాడాలి? (సామె. 25:15).—w15 12/15, 19-22 పేజీలు.

క్రిస్మస్‌కి సంబంధించిన ఆచారాల్లో తప్పేమైనా ఉందా?

క్రిస్మస్‌లో ఉన్న అసలు సమస్య ఏంటంటే, అది వేరే మతాల ఆచారాలనుండి వచ్చింది. కాబట్టి క్రిస్మస్‌ దేవున్ని, ఆయన కుమారుడు యేసుక్రీస్తుని అవమానిస్తుంది. ఇది చిన్న విషయమా? వంకరగా ఎదిగిపోయాక చెట్టు మొద్దుని తిన్నగా చేయలేము. అలాగే క్రిస్మస్‌ ఎంత వంకరగా ఉందంటే ఇప్పుడు “దానిని చక్కపరచ శక్యముకాదు.”—wp16.01, 9 పేజీ.

జ్ఞాపకార్థ ఆచరణ రోజున రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను మనమెలా చూడాలి?

రొట్టె, ద్రాక్షారసం తీసుకునేవాళ్లను క్రైస్తవులు ప్రత్యేకమైన వాళ్లలా చూడరు. నిజంగా అభిషిక్తుడైన ఓ వ్యక్తి, ఇతరులు తనను ప్రత్యేకంగా చూడాలని అనుకోడు. (మత్త. 23:8-12) దేవునితో అతనికున్న వ్యక్తిగత సంబంధం గురించి అందరికీ తెలియాలని కూడా కోరుకోడు.—w16.01, 23-24 పేజీలు.

అబ్రాహాము యెహోవాకు స్నేహితుడైన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

అబ్రాహాము బహుశా షేము ద్వారా యెహోవా గురించి నేర్చుకుని ఉండవచ్చు. అంతేకాదు యెహోవా దేవుడు తనతో, తన కుటుంబంతో వ్యవహరించిన విధానం నుండి అబ్రాహాము అనుభవాన్ని సంపాదించాడు. మనం కూడా అలానే నేర్చుకోవచ్చు.—w16.02, 9-10 పేజీలు.

మనం క్రమంగా మీటింగ్స్‌కు ఎందుకు వెళ్లాలి?

అక్కడ మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ప్రోత్సాహం పొందుతాం, పవిత్రశక్తి మనపై పనిచేస్తుంది, తోటి సహోదరసహోదరీల్ని ప్రేమిస్తున్నామని చూపించేందుకు అక్కడ మనకు ఎన్నో అవకాశాలు దొరుకుతాయి, తోటి విశ్వాసులతో ఐక్యంగా ఉండేందుకు సహాయం చేస్తాయి. అంతేకాదు మీటింగ్స్‌లో యెహోవాకు చెందాల్సినవి ఆయనకు ఇస్తాం. అలాగే మీటింగ్స్‌కు వెళ్లడం ద్వారా, మనం యెహోవాకూ ఆయన కుమారునికీ దగ్గరవ్వాలని కోరుకుంటున్నామనీ, దేవుని సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నామనీ చూపిస్తాం.—w16.04, 22వ పేజీ.

సాతాను యేసును శోధించినప్పుడు ఆయన్ను నిజంగా దేవాలయానికి తీసుకెళ్లాడా?

సాతాను యేసుకు దేవాలయాన్ని ఎలా చూపించాడో మనకు ఖచ్చితంగా తెలీదు. మత్తయి 4:5 అలాగే లూకా 4:9 వచనాల్ని బట్టి, సాతాను దేవాలయాన్ని బహుశా దర్శనంలో చూపించివుండవచ్చు లేదా యేసును దేవాలయంలోని ఏదైనా ఎత్తైన స్థలానికి తీసుకొని వెళ్లివుండవచ్చు.—w16.03, 31-32 పేజీలు.

మన పరిచర్యను మంచు బిందువుతో ఎందుకు పోల్చవచ్చు?

మంచు బిందువు తేమ నుండి క్రమక్రమంగా తయారౌతుంది, సేదదీర్పునిస్తుంది, జీవాన్ని కాపాడుతుంది. నిజమైన మంచు బిందువులు యెహోవా ఇచ్చే ఆశీర్వాదం. (ద్వితీ. 33:13) పరిచర్యలో దేవుని ప్రజలందరూ కలిసి చేసే కృషి కూడా ఆ ఆశీర్వాదం లాంటిదే.—w16.04, 4వ పేజీ.