కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకు మీపై శ్రద్ధ ఉంది

యెహోవాకు మీపై శ్రద్ధ ఉంది

ఆ మాటలు నిజమని మీరెందుకు నమ్మవచ్చు? ఒక కారణం ఏమిటంటే బైబిలే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్తుంది. 1 పేతురు 5:7, NWలో ఇలా ఉంది: ‘మీరంటే ఆయనకు పట్టింపు [లేదా శ్రద్ధ] ఉంది కాబట్టి మీ ఆందోళనంతా ఆయన మీద వేయండి.’ యెహోవాకు మీరంటే శ్రద్ధ ఉందని దేన్ని బట్టి చెప్పవచ్చు?

దేవుడు మనుషుల భౌతిక అవసరాలను తీరుస్తున్నాడు

దయను, ఉదారతను చూపిస్తున్నాడు

ఒక విషయమేమిటంటే, మీరు ఓ మంచి స్నేహితునిలో ఉండాలనుకునే లక్షణాలు దేవునిలో ఉన్నాయి. సాధారణంగా ఒకరిపట్ల ఒకరు దయను, ఉదారతను చూపించుకునేవాళ్లు మంచి స్నేహితులవుతారు. యెహోవా ప్రతీరోజు మనుషుల విషయంలో దయను, ఉదారతను చూపిస్తున్నాడు, దాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఉదాహరణకు, “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతిమంతులమీదను వర్షము కురిపించుచున్నాడు.” (మత్త. 5:45) సూర్యునివల్ల, వర్షంవల్ల మనమెలాంటి ప్రయోజనాలు పొందుతున్నాం? ఒకటేంటంటే, వాటిద్వారా దేవుడు మనుషులను ‘ఆహారంతో సంతృప్తిపరుస్తూ, వాళ్ల హృదయాల్ని సంతోషంతో నింపుతూ’ ఉన్నాడు. (అపొ. 14:17, NW) అవును, భూమి సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చేలా యెహోవా చేస్తున్నాడు. అంతేకాదు రుచికరమైన భోజనం కన్నా మరింత సంతోషాన్నిచ్చే వేరే విషయాల్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నాడు.

మరి చాలామంది ఎందుకు ఆకలితో అలమటిస్తున్నారు? ఎందుకంటే మానవ పరిపాలకులకు ప్రజల జీవితాల్ని చక్కదిద్దాలనే పట్టింపులేదు. బదులుగా రాజకీయ పదవులు పొందడం మీద, ఎక్కువ డబ్బు సంపాదించడం మీద మాత్రమే వాళ్లు మనసుపెడుతున్నారు. యెహోవా త్వరలోనే, ఇప్పుడున్న మానవ ప్రభుత్వాల స్థానంలో తన పరలోక రాజ్యాన్ని తీసుకురావడం ద్వారా ఈ ధనాపేక్ష సమస్యను లేకుండా చేస్తాడు. ఆ రాజ్యానికి యేసు రాజుగా ఉంటాడు. ఆ రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో అలమటించరు. అప్పటివరకు, తనకు నమ్మకంగా ఉండే సేవకులను దేవుడు పోషిస్తాడు. (కీర్త. 37:25) దీన్నిబట్టి యెహోవాకు మనపట్ల శ్రద్ధ ఉందని అర్థమవ్వట్లేదా?

యెహోవా మనకోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాడు

మనకు ఆదర్శాన్ని ఉంచుతూ, యెహోవా

ఒక మంచి స్నేహితుడు మీతో ఎక్కువ సమయాన్ని గడుపుతాడు. అంతేకాదు అతను మీ ఇద్దరూ ఇష్టపడే విషయాల గురించి గంటల తరబడి మీతో మాట్లాడతాడు, మీరు మీ సమస్యల గురించి, భయాల గురించి చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటాడు. మరి యెహోవా కూడా అలా వింటాడా? ఖచ్చితంగా. ఆయన మన ప్రార్థనల్ని వింటాడు. అందుకే, “ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి,” “యెడతెగక ప్రార్థనచేయుడి” అని బైబిలు మనల్ని ప్రోత్సహిస్తోంది.—రోమా. 12:11; 1 థెస్స. 5:15.

మీ ప్రార్థనలను వినడానికి యెహోవా ఎంత సమయాన్ని వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు? బైబిల్లోని ఒక ఉదాహరణ దీనికి జవాబిస్తుంది. యేసు తన అపొస్తలులను ఎంపిక చేసుకునేముందు, “రాత్రంతా దేవునికి ప్రార్థిస్తూ గడిపాడు.” (లూకా 6:12, NW) బహుశా యేసు ఆ ప్రార్థనలో, తన శిష్యుల్లో చాలామందిని పేరుపేరున ప్రస్తావిస్తూ వాళ్ల లక్షణాలు, బలహీనతల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తూ వాళ్లను ఎంపిక చేసుకునే విషయంలో సహాయం చేయమని తన తండ్రిని అడిగివుంటాడు. మరుసటి రోజు సూర్యుడు ఉదయించే సరికి, సరైన అర్హత ఉన్నవాళ్లనే తన అపొస్తలులుగా ఎంపిక చేసుకున్నానని ఆయనకు అర్థమైంది. అవును ‘ప్రార్థన ఆలకించువాడైన’ యెహోవా, మనస్ఫూర్తిగా చేసే అందరి ప్రార్థనల్ని వినడానికి ఇష్టపడతాడు. (కీర్త. 65:2) ఎవరైనా ఒక వ్యక్తి తనను బాగా బాధపెడుతున్న విషయం గురించి గంటలు తరబడి ప్రార్థించినా, యెహోవా సమయాన్ని లెక్కచేయకుండా వింటాడు.

దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు

క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు

కొన్నిసార్లు మంచి స్నేహితులు కూడా ఒకరినొకరు క్షమించుకోలేకపోతారు. ఇంకొన్నిసార్లయితే, క్షమించడం కష్టమనిపించి ఎన్నో ఏళ్లుగా స్నేహితులుగా ఉన్నవాళ్లు సైతం విడిపోతారు. కానీ యెహోవా అలాంటివాడు కాదు. ‘ఆయన బహుగా క్షమిస్తాడు’ కాబట్టి ఆయన్ను క్షమాపణ అడగమని బైబిలు అందర్నీ ప్రోత్సహిస్తుంది. (యెష. 55:6, 7) అలా క్షమించడానికి యెహోవాను ఏది ప్రేరేపిస్తుంది?

అలా క్షమించడానికిగల కారణం ఆయనకున్న సాటిలేని ప్రేమే. ఆయన మనుషుల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే పాపం నుండి దానివల్ల కలిగే హాని నుండి మనుషుల్ని రక్షించడానికి తన కుమారుడైన యేసును భూమ్మీదకు పంపించాడు. (యోహా. 3:16) నిజానికి, యేసు బలివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ బలి ఆధారంగానే దేవుడు తాను ప్రేమించేవాళ్లను క్షమిస్తున్నాడు. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, ‘మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును.’ (1 యోహా. 1:9) ఆయన క్షమాగుణం వల్లే ప్రజలు ఇంకా ఆయనతో స్నేహం చేయగలుగుతున్నారు, అది మనకు సంతోషాన్ని కలిగించట్లేదా?

అవసరంలో ఉన్నప్పుడు ఆయన మీకు సహాయం చేస్తాడు

అవసరంలో ఉన్నప్పుడు మనకు సహాయం చేస్తున్నాడు

నిజమైన స్నేహితుడు ఇతరులు అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడు. మరి యెహోవా కూడా అలాగే సహాయం చేస్తాడా? బైబిలు ఇలా చెప్తుంది, “యెహోవా అతని [తన సేవకుని] చెయ్యి పట్టుకొని యున్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక యుండడు.” (కీర్త. 37:24) యెహోవా తన సేవకులకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తాడు. ఉదాహరణకు కరీబియన్‌ దీవి అయిన సెయింట్‌ క్రోయ్‌లోని ఈ అనుభవాన్ని పరిశీలించండి:

ఒక అమ్మాయి తన మత నమ్మకాల్నిబట్టి జెండా వందనం చేయనందుకు తోటి విద్యార్థులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ అమ్మాయి సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాక, ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. తర్వాత, తన క్లాసులోని వాళ్లతో జెండా వందనం అనే అంశం మీద మాట్లాడింది. జెండా వందనం చేయకూడదనే నిర్ణయం తీసుకోవడానికి షద్రకు, మేషాకు, అబేద్నెగోల వృత్తాంతం తనకెలా సహాయం చేసిందో నా బైబిలు కథల పుస్తకము ఉపయోగించి వివరించింది. “ఆ ముగ్గురు హెబ్రీ యువకులు ప్రతిమకు నమస్కరించలేదు కాబట్టి యెహోవా వాళ్లను కాపాడాడు” అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత, చదవడానికి ఇష్టపడేవాళ్లకు బైబిలు కథల పుస్తకాన్ని ఇస్తానని చెప్పింది. అప్పుడు 11 మంది విద్యార్థులు ఆ పుస్తకం తీసుకున్నారు. జాగ్రత్తగా మాట్లాడాల్సిన అలాంటి అంశం గురించి సాక్ష్యమివ్వడానికి తనకు కావాల్సిన శక్తిని, జ్ఞానాన్ని యెహోవాయే ఇచ్చాడని గుర్తించి ఆ అమ్మాయి చాలా సంతోషించింది.

యెహోవాకు మీపై శ్రద్ధ ఉందో లేదోననే సందేహం మీకెప్పుడైనా వస్తే, కీర్తన 34:17-19; 55:22; 145:18, 19 వంటి బైబిలు లేఖనాల గురించి లోతుగా ఆలోచించండి. ఎంతోకాలంగా యెహోవాను సేవిస్తున్నవాళ్లతో మాట్లాడి ఆయన వాళ్లపై ఎలా శ్రద్ధ చూపించాడో అడిగి తెలుసుకోండి. అంతేకాదు మీకు ఆయన సహాయం అవసరమైనప్పుడు ప్రార్థన చేయండి. అప్పుడు యెహోవాకు మీపై ఉన్న శ్రద్ధను చూస్తారు.