దేవుని నియమాలతో, సూత్రాలతో మీ మనస్సాక్షికి శిక్షణ ఇవ్వండి
“నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను.”—కీర్త. 119:97.
1. జంతువులకూ, మనుషులకూ ఉన్న ముఖ్యమైన తేడాల్లో ఒకటి ఏమిటి?
యెహోవా మనుషులకు మనస్సాక్షి అనే ప్రత్యేకమైన బహుమానాన్ని ఇచ్చాడు. జంతువులకూ, మనుషులకూ ఉన్న ముఖ్యమైన తేడాల్లో మనస్సాక్షి కలిగివుండడం కూడా ఒకటి. అయితే, ఆదాముహవ్వలకు మనస్సాక్షి ఉండేదని ఎలా చెప్పవచ్చు? వాళ్లు దేవుని ఆజ్ఞను మీరిన తర్వాత ఆయనకు కనిపించకుండా దాక్కున్నారు. ఎందుకంటే వాళ్ల మనస్సాక్షి వాళ్లను గద్దించింది.
2. మన మనస్సాక్షిని స్టీరింగ్ వీల్‌తో ఎందుకు పోల్చవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)
2 సరైన శిక్షణలేని మనస్సాక్షి కలిగివున్న వాళ్లను, సరిగ్గా పనిచేయని స్టీరింగ్ వీల్ కలిగివున్న ఓడతో పోల్చవచ్చు. అలాంటి ఓడలో ప్రయాణం చాలా ప్రమాదకరం. ఎందుకంటే సముద్రపు అలలు, భీకరమైన గాలులు ఆ ఓడను తప్పు దారిలో తీసుకెళ్తాయి. అదే స్టీరింగ్ వీల్ సరిగ్గా పనిచేస్తుంటే, కెప్టెన్ ఓడను సరైన దారిలో నడిపించగలుగుతాడు. మన మనస్సాక్షి కూడా ఒకరకంగా స్టీరింగ్ వీల్ లాంటిదేనని చెప్పవచ్చు. జీవితంలో తప్పొప్పులను గుర్తిస్తూ సరైన దారిలో నడవడానికి మనస్సాక్షి మనకు సహాయం చేస్తుంది. కానీ అది సరిగ్గా పనిచేయాలంటే దానికి సరైన శిక్షణనివ్వాలి.
3. మనస్సాక్షికి సరైన శిక్షణ ఇవ్వకపోతే ఏమి జరిగే అవకాశం ఉంది?
3 మన మనస్సాక్షికి సరైన శిక్షణ ఇవ్వకపోతే, తప్పు చేస్తున్నప్పుడు 1 తిమో. 4:1, 2) పైగా ‘చెడును మంచి’ అనుకునేలా మనల్ని మభ్యపెట్టే అవకాశం ఉంది. (యెష. 5:20, NW) అందుకే యేసు తన అనుచరులను ఇలా హెచ్చరించాడు, “మిమ్మల్ని చంపే ప్రతీ ఒక్కరు తాను దేవునికి పవిత్రసేవ చేస్తున్నానని అనుకునే సమయం రాబోతుంది.” (యోహా. 16:2) శిష్యుడైన స్తెఫనును చంపినవాళ్లు అలానే అనుకున్నారు. (అపొ. 6:8, 12; 7:54-60) చరిత్రను గమనిస్తే ఎంతోమంది మతోన్మాదులు హత్యలు వంటి ఘోరమైన నేరాలు చేసి, వాటిని తమ దేవుని కోసం చేశామని చెప్పుకున్నారు. కానీ వాస్తవమేమిటంటే, వాళ్లు చేసినవి దేవుని నియమాలకు విరుద్ధమైన పనులు. (నిర్గ. 20:13) కాబట్టి మనస్సాక్షి వాళ్లను సరైన దారిలో నడిపించలేదని స్పష్టంగా అర్థమౌతుంది.
అది మనల్ని హెచ్చరించదు. (4. మన మనస్సాక్షి సరిగ్గా పనిచేయాలంటే ఏమి చేయాలి?
4 మన మనస్సాక్షి సరిగ్గా పనిచేయాలంటే ఏమి చేయాలి? బైబిల్లో ఉన్న నియమాలు, సూత్రాలు “బోధించడానికి, గద్దించడానికి, సరిదిద్దడానికి, దేవుని నీతి ప్రమాణాల ప్రకారం క్రమశిక్షణ ఇవ్వడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.” (2 తిమో. 3:16) అందుకే మనం బైబిల్ని రోజూ చదవాలి, లోతుగా ఆలోచించాలి, నేర్చుకున్నవాటిని జీవితంలో పాటించాలి. అలాచేస్తే యెహోవాలా ఆలోచించడం నేర్చుకుంటాం. అప్పుడు మన మనస్సాక్షి మనల్ని ఖచ్చితంగా సరైన దారిలో నడిపిస్తుంది. అయితే యెహోవా నియమాలతో, సూత్రాలతో మనస్సాక్షికి ఎలా శిక్షణ ఇవ్వవచ్చో చర్చించుకుందాం.
దేవుని నియమాలతో శిక్షణ ఇవ్వండి
5, 6. దేవుని నియమాల నుండి ప్రయోజనం పొందాలంటే మనమేమి చేయాలి?
5 దేవుని నియమాల నుండి ప్రయోజనం పొందాలంటే, కేవలం వాటిని చదివితే లేదా అవేమిటో తెలిసుంటే సరిపోదు. మనం వాటిని ప్రేమించాలి, గౌరవించాలి. బైబిలు మనకిలా చెప్తుంది, ‘కీడును ద్వేషించి మేలును ప్రేమించండి.’ (ఆమో. 5:15) ఎలా? విషయాల్ని యెహోవా చూసినట్లు చూడడం మనం నేర్చుకోవాలి. ఉదాహరణకు, మీరు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు అనుకుందాం. డాక్టరు దగ్గరకు వెళ్తే ఆయన మిమ్మల్ని బలమైన ఆహారం తీసుకోమని, ఎక్కువ వ్యాయామం చేయమని, మీ జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోమని చెప్పాడు. మీరు అవన్నీ చేయడం వల్ల నిద్రలేమి సమస్య పోయింది. మరి, మంచి సలహాలను ఇచ్చినందుకు మీరు ఆ డాక్టరుకు కృతజ్ఞత కలిగివుంటారు కదా?
6 అదేవిధంగా, పాపం వల్ల వచ్చే చెడు ఫలితాల నుండి తప్పించుకుని సంతోషంగా జీవించడానికి అవసరమయ్యే నియమాల్ని మన సృష్టికర్త ఇచ్చాడు. ఉదాహరణకు అబద్ధాలు చెప్పకూడదని; మోసం, దొంగతనం, వ్యభిచారం చేయకూడదని; దౌర్జన్యానికి, దయ్యాలకు సంబంధించిన వాటికి దూరంగా ఉండాలని బైబిలు మనకు చెప్తుంది. (సామెతలు 6:16-19 చదవండి; ప్రక. 21:8) వీటిని పాటించడం వల్ల కలిగే మంచి ఫలితాల్ని రుచిచూసినప్పుడు యెహోవా పట్ల, ఆయన నియమాల పట్ల మనకున్న ప్రేమ పెరుగుతుంది.
7. బైబిలు వృత్తాంతాలు మనకెలా సహాయం చేస్తాయి?
7 ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవడానికి దేవుని నియమాల్ని మీరి చెడు పర్యవసానాల్ని అనుభవించాల్సిన అవసరం లేదు. గతంలో వేరేవాళ్లు చేసిన పొరపాట్ల నుండి కూడా మనం పాఠాలు నేర్చుకోవచ్చు. అలాంటి అనుభవాలు బైబిల్లో ఉన్నాయి. “జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును [లేదా మరింత ఉపదేశం పొందుతాడు, NW]” అని సామెతలు 1:5 చెప్తుంది. ఆ ఉపదేశం దేవుని నుండి వస్తుంది, అంతకన్నా శ్రేష్ఠమైన ఉపదేశం ఇంకెక్కడా దొరకదు. ఉదాహరణకు, దావీదు దేవుని నియమాన్ని మీరి బత్షెబతో వ్యభిచారం చేయడం వల్ల ఎంత గుండెకోత అనుభవించాడో ఒకసారి ఆలోచించండి. (2 సమూ. 12:7-15) ఆ వృత్తాంతాన్ని చదువుతున్నప్పుడు వీటి గురించి ఆలోచించండి: ‘దావీదు ఏమి చేసుంటే ఆ సమస్యల్ని తప్పించుకునేవాడు? అలాంటి పరిస్థితిలో నేనుంటే ఏమి చేస్తాను? వ్యభిచారం చేయాలనే శోధన ఎదురైతే దావీదులా ప్రవర్తిస్తానా లేదా యోసేపులా ప్రవర్తిస్తానా?’ (ఆది. 39:11-15) పాపం వల్ల వచ్చే ఘోరమైన ఫలితాల గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే, చెడును మరింత ఎక్కువగా అసహ్యించుకుంటాం.
8, 9. (ఎ) మనస్సాక్షి మనకు ఎలా సహాయం చేస్తుంది? (బి) సూత్రాలకు, మనస్సాక్షికి ఉన్న సంబంధం ఏమిటి?
8 నిజమే, దేవుడు అసహ్యించుకునే వాటికి మనం దూరంగా ఉంటాం. కానీ మనం ఎదుర్కొంటున్న పరిస్థితికి సంబంధించి సూటైన నియమం బైబిల్లో లేకపోతే ఏమి చేయాలి? మనమేమి చేస్తే దేవునికి నచ్చుతుందో ఎలా తెలుస్తుంది? అలాంటి పరిస్థితుల్లో తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి బైబిలు శిక్షిత మనస్సాక్షి సహాయం చేస్తుంది.
9 యెహోవాకు మనమంటే చాలా ఇష్టం, అందుకే మన మనస్సాక్షిని సరైన దారిలో నడిపించగలిగే సూత్రాల్ని ఇచ్చాడు. యెహోవా ఇలా చెప్తున్నాడు, “నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును.” (యెష. 48:17, 18) బైబిలు సూత్రాలను లోతుగా ఆలోచించి, అవి సరైనవనే నమ్మకాన్ని హృదయంలో వృద్ధి చేసుకుంటే, మన మనస్సాక్షిని సరిదిద్ది సరైన దారిలో పెట్టుకోగలుగుతాం. అలాంటి మనస్సాక్షి తెలివైన నిర్ణయాల్ని తీసుకోవడానికి సహాయం చేస్తుంది.
దేవుని సూత్రాల నిర్దేశంలో నడవండి
10. సూత్రం అంటే ఏమిటి? యేసు తన శిష్యులకు బోధించేటప్పుడు సూత్రాలను ఎలా ఉపయోగించాడు?
10 మన ఆలోచనల్ని నిర్దేశిస్తూ, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేసే ప్రాథమిక సత్యమే సూత్రం. యెహోవా ఆలోచనా విధానాన్ని, ఆయనిచ్చిన నియమాల వెనకున్న కారణాల్ని అర్థంచేసుకోవడానికి సూత్రాలు సహాయం చేస్తాయి. మన ఆలోచనలకు, పనులకు తగిన ప్రతిఫలాన్ని పొందుతామని ఆ సూత్రాల ద్వారానే యేసు తన శిష్యులకు నేర్పించాడు. ఉదాహరణకు కోపం హింసకు దారితీస్తుందనీ, తప్పుడు ఆలోచనలు వ్యభిచారానికి నడిపిస్తాయని ఆయన చెప్పాడు. (మత్త. 5:21, 22, 27, 28) మనం యెహోవా సూత్రాల ప్రకారం నడిస్తే మనస్సాక్షికి సరైన శిక్షణ ఇవ్వగలుగుతాం, దేవున్ని మహిమపర్చే నిర్ణయాలు తీసుకోగలుగుతాం.—1 కొరిం. 10:31.
11. అందరి మనస్సాక్షి ఒకేలా ఉంటుందా? వివరించండి.
11 క్రైస్తవులు బైబిలు సహాయంతో తమ మనస్సాక్షికి శిక్షణ ఇచ్చినప్పటికీ, కొన్ని విషయాల్లో వేర్వేరు ముగింపులకు రావచ్చు. ఉదాహరణకు మద్యం తాగడం గురించే తీసుకుంటే, మద్యం తాగడం తప్పని బైబిలు చెప్పట్లేదు. కాకపోతే అతిగా తాగకూడదని లేదా తాగుడుకు బానిసలు కాకూడదని హెచ్చరిస్తోంది. (సామె. 20:1; 1 తిమో. 3:8) అయితే అతిగా తాగకుండా ఉంటే సరిపోతుందా? ఒక క్రైస్తవుడు ఆలోచించాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. మద్యం తాగడానికి అతని మనస్సాక్షి అనుమతించినా, ఇతరుల మనస్సాక్షి గురించి కూడా ఆలోచించాలి.
12. ఇతరుల మనస్సాక్షి గురించి రోమీయులు 14:21 మనకేమి నేర్పిస్తుంది?
12 “మాంసం తినడమైనా, ద్రాక్షారసం తాగడమైనా లేదా మీ సోదరుణ్ణి విశ్వాసంలో తడబడేలా చేసే ఏ పనైనా చేయకపోవడమే మంచిది” అని పౌలు రాసిన మాటల్ని బట్టి ఇతరుల మనస్సాక్షిని మనం గౌరవించాలని అర్థంచేసుకోవచ్చు. (రోమా. 14:21) మద్యం తాగడానికి మన మనస్సాక్షి అనుమతించినా, దానివల్ల తోటి క్రైస్తవుడు ఇబ్బంది పడతాడని అనిపిస్తే మన ఇష్టాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే సత్యం తెలుసుకోకముందు మద్యానికి బానిసైన ఒక సహోదరుడు, ఇంకెప్పుడూ మద్యం ముట్టకూడదని నిర్ణయించుకుని ఉండవచ్చు. అలాంటివ్యక్తి తిరిగి పాత జీవితానికి అలవాటుపడడానికి మనం కారణం అవ్వాలని ఎన్నడూ కోరుకోం. (1 కొరిం. 6:9, 10) ఒకవేళ ఆ సహోదరుడే మన ఇంటికి అతిథిగా వస్తే, అతను వద్దన్నా తాగమని బలవంతం చేస్తామా? ఖచ్చితంగా చేయం కదా!
13. మంచివార్తను అంగీకరించే విషయంలో ఇతరులు తనవల్ల అభ్యంతరపడకూడదని తిమోతి ఏమి చేశాడు?
13 యౌవనస్థుడైన తిమోతి, తాను ప్రకటించే యూదులు అభ్యంతరపడకూడదనే ఉద్దేశంతో నొప్పిని కూడా భరించి సున్నతి చేయించుకున్నాడు. పౌలులాగే తిమోతి కూడా ఇతరుల్ని నొప్పించకూడదని అనుకునేవాడు. (అపొ. 16:3; 1 కొరిం. 9:19-23) మీరు కూడా ఇతరుల కోసం వ్యక్తిగతంగా త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉంటారా?
“పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోదాం”
14, 15. (ఎ) పరిణతి సాధించాలంటే ఏమి చేయాలి? (బి) మనం ఏమి చేసినప్పుడు పరిణతి సాధించినట్లు చూపిస్తాం?
14 “క్రీస్తు గురించిన ప్రాథమిక బోధలు నేర్చుకునే స్థాయి దాటి,” ‘పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోవాలని’ మనందరం కోరుకుంటాం. (హెబ్రీ. 6:1) సత్యంలో ఎక్కువ ఏళ్లుగా ఉన్నంత మాత్రాన మనం పరిణతి సాధించం. దానికి కృషి అవసరం. మన జ్ఞానాన్ని, అవగాహనను పెంచుకుంటూ ఉండాలి. దానికోసం ప్రతీరోజు బైబిలు చదవాలి. (కీర్త. 1:1-3) అలా చదివితే యెహోవా నియమాల్ని, సూత్రాల్ని మరింత బాగా అర్థంచేసుకోగలుగుతాం.
15 క్రైస్తవులందరూ పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన నియమం ఏమిటి? ప్రేమ చూపించాలనే నియమం. యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు, “మీ మధ్య ప్రేమ ఉంటే, మీరు నా శిష్యులని అందరికీ తెలుస్తుంది.” (యోహా. 13:35) ప్రేమ చూపించడమనేది “సర్వోన్నతమైన ఆజ్ఞ,” ప్రేమ చూపిస్తే “ధర్మశాస్త్రాన్ని పాటించినట్టే.” (యాకో. 2:8; రోమా. 13:10) “దేవుడు ప్రేమ” కాబట్టే ప్రేమకు అంత ప్రాముఖ్యమైన స్థానం ఉంది. (1 యోహా. 4:8) దేవుని దృష్టిలో ప్రేమ అనేది ఒక భావన మాత్రమే కాదు. ఆయన తన ప్రేమను చేతల్లో చూపిస్తాడు. “దేవుడు తన ఒక్కగానొక్క కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించి మనమీద తనకున్న ప్రేమను వెల్లడిచేశాడు. మనం ఆ కుమారుని ద్వారా జీవం సంపాదించుకునేలా దేవుడు ఆయన్ని పంపించాడు” అని యోహాను రాశాడు. (1 యోహా. 4:9) మనం యెహోవా పట్ల, యేసు పట్ల, తోటి సహోదరసహోదరీల పట్ల, ఇతరుల పట్ల ప్రేమ చూపించినప్పుడు, క్రైస్తవులముగా పరిణతి సాధించినట్లు నిరూపిస్తాం.—మత్త. 22:37-39.
16. మనం పరిణతి సాధించేకొద్దీ సూత్రాలను మరింత విలువైనవిగా ఎందుకు ఎంచుతాం?
1 కొరిం. 15:33) కానీ పిల్లలు పెద్దయ్యేకొద్దీ బైబిలు సూత్రాల గురించి లోతుగా ఆలోచించగలుగుతారు. వాటి సహాయంతో మంచి స్నేహితుల్ని ఎంచుకోగలుగుతారు. (1 కొరింథీయులు 13:11; 14:20 చదవండి.) బైబిలు సూత్రాల గురించి ఎంత లోతుగా ఆలోచిస్తే, మన మనస్సాక్షి అంత చక్కగా శిక్షణ పొందుతుంది. దానివల్ల, ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనం ఏమి చేయాలని దేవుడు కోరుతున్నాడో అర్థంచేసుకోగలుగుతాం.
16 మనం పరిణతి సాధించేకొద్దీ సూత్రాలను మరింత విలువైనవిగా ఎంచుతాం. ఎందుకంటే నియమాలు నిర్దిష్టమైన పరిస్థితులకు మాత్రమే ఉపయోగపడతాయి, కానీ సూత్రాలు వేర్వేరు పరిస్థితులకు వర్తిస్తాయి. ఉదాహరణకు, చెడ్డవాళ్లతో స్నేహం చేయడం ఎంత ప్రమాదకరమో చిన్నపిల్లలకు తెలీదు కాబట్టి వాళ్లను కాపాడుకోవడానికి అమ్మానాన్నలు కొన్ని నియమాలు పెడతారు. (17. యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమయ్యే ప్రతీది మన దగ్గర ఉందని ఎందుకు చెప్పవచ్చు?
17 యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమయ్యే ప్రతీది మన దగ్గర ఉంది. ‘ప్రతీ మంచి పని చేయడానికి పూర్తిగా సమర్థులు అవ్వడానికి, పూర్తిగా సిద్ధంగా ఉండడానికి’ సహాయం చేసే నియమాలు, సూత్రాలు బైబిల్లో ఉన్నాయి. (2 తిమో. 3:16, 17) యెహోవా ఆలోచనను అర్థం చేసుకోవడానికి బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి. కానీ వాటిని కనుగొనడానికి కృషి అవసరం. (ఎఫె. 5:17) కాబట్టి యెహోవాసాక్షుల పరిశోధనా పుస్తకం, వాచ్‌టవర్ లైబ్రరీ, కావలికోట ఆన్‌లైన్ లైబ్రరీ, JW లైబ్రరీ యాప్ లాంటి ఉపకరణాల్ని చక్కగా ఉపయోగించుకోండి. వీటిని వ్యక్తిగత అధ్యయనంలో, కుటుంబ ఆరాధనలో ఉపయోగిస్తే ప్రయోజనం పొందుతాం.
బైబిలు శిక్షిత మనస్సాక్షి కలిగివుంటే దీవెనలు పొందుతాం
18. యెహోవా ఇచ్చిన నియమాలు, సూత్రాలు పాటించినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది?
18 యెహోవా ఇచ్చిన నియమాలు, సూత్రాలు పాటించినప్పుడు మన జీవితం చాలా బాగుంటుంది. కీర్తన 119:97-100 వచనాల్లో ఇలా ఉంది, “నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగ జేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటె నాకు విశేషజ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు.” సమయం వెచ్చించి దేవుని నియమాల్ని, సూత్రాల్ని లోతుగా ఆలోచిస్తే మరింత జ్ఞానంతో, అవగాహనతో ప్రవర్తించగలుగుతాం. దేవుని నియమాలతో, సూత్రాలతో మన మనస్సాక్షికి శిక్షణనిస్తే “సంపూర్ణ పరిణతిగల క్రీస్తులా” తయారౌతాం.—ఎఫె. 4:13.