మీకు జ్ఞాపకమున్నాయా?
మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:
బాగా పాడడానికి ఏ నాలుగు సలహాలు సహాయం చేస్తాయి?
నిటారుగా నిలబడి, పాటల పుస్తకాన్ని పైకెత్తి పట్టుకోవాలి. దీర్ఘశ్వాస తీసుకోవాలి. నోటిని విశాలంగా తెరచి, బిగ్గరగా పాడాలి.—w17.11, 5వ పేజీ.
ఇశ్రాయేలులోని ఆశ్రయపురాలు ఉన్న ప్రాంతాలకు, వాటికి వెళ్లే రోడ్లకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?
ఇశ్రాయేలు దేశంలో ఆరు ఆశ్రయపురాలు ఉండేవి, వాటికి వెళ్లే రోడ్లను మంచి స్థితిలో ఉంచేవాళ్లు. దానివల్ల ఆశ్రయపురానికి వెళ్లే వ్యక్తి ఆ మార్గంలో ఏ ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా చేరుకోగలిగేవాడు.—w17.11, 14వ పేజీ.
దేవుని నుండి మనం పొందగల అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్ యేసు విమోచన క్రయధనమని ఎందుకు చెప్పవచ్చు?
ఎందుకంటే బ్రతికి ఉండాలనే మన కోరికను, పాపమరణాల నుండి విడుదలవ్వాలనే మన అవసరాన్ని అది తీరుస్తుంది. ఆదాము సంతానంపై ప్రేమతో మనం ఇంకా పాపులుగా ఉండగానే దేవుడు యేసును మనకోసం పంపించాడు.—wp17.6, 6-7 పేజీలు.
కీర్తన 118:22 యేసు పునరుత్థానాన్ని సూచిస్తుందని ఎలా చెప్పవచ్చు?
యూదులు యేసును మెస్సీయగా తిరస్కరించి, చంపించారు. ఆయన “మూలకు తలరాయి” అవ్వాలంటే పునరుత్థానమవ్వాలి.—w17.12, 9-10 పేజీలు.
మెస్సీయకు పూర్వీకులయ్యే అవకాశం కేవలం జ్యేష్ఠ కుమారులకే దక్కిందా?
మెస్సీయకు పూర్వీకులయ్యే అవకాశాన్ని కేవలం జ్యేష్ఠ కుమారులే పొందలేదు. ఎందుకంటే దావీదు యెష్షయికి మొదటి కుమారుడు కాదు, అయినప్పటికీ ఆయన మెస్సీయకు పూర్వీకుడు అయ్యాడు.—w17.12, 14-15 పేజీలు.
మనల్ని మనం కొంతమేరకు ప్రేమించుకోవడం ఎందుకు తప్పు కాదు?
మనల్ని మనం ప్రేమించుకున్నట్టు సాటిమనిషిని ప్రేమించాలి. (మార్కు 12:31) “భర్త తన శరీరాన్ని ప్రేమించుకున్నట్టే తన భార్యను ప్రేమించాలి.” (ఎఫె. 5:28) కానీ మనమీద మనకున్న ప్రేమ కొన్నిసార్లు తప్పుదారి పట్టవచ్చు.—w18.01, 23వ పేజీ.
ఆధ్యాత్మికంగా బలంగా తయారవ్వడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి, చదివిన వాటిని ధ్యానించాలి. నేర్చుకున్నవాటిని పాటించాలి. యెహోవా ఇచ్చే పవిత్రశక్తి సహాయాన్ని తీసుకోవాలి. ఇతరుల సహాయాన్ని అంగీకరించాలి, కృతజ్ఞత చూపించాలి.—w18.02, 26వ పేజీ.
ఆతిథ్యాన్ని అంగీకరించే విషయంలో మనం ఎలాంటి వైఖరిని కలిగివుండాలి?
మనం ఏదైనా ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు, అనివార్య పరిస్థితిలో తప్ప దాన్ని రద్దు చేసుకోకూడదు. (కీర్త. 15:4) ఆతిథ్యం ఇచ్చేవాళ్లు కష్టపడి మనకోసం అంతా సిద్ధం చేసి ఉంటారు.—w18.03, 18వ పేజీ.
తిమోతి నుండి నియమిత పురుషులు ఏమి నేర్చుకోవచ్చు?
తిమోతి ప్రజలపట్ల నిజమైన శ్రద్ధ చూపించాడు. ఆధ్యాత్మిక విషయాలకు మొదటిస్థానం ఇచ్చాడు. ఆయన దేవుని సేవలో చాలా కష్టపడ్డాడు. నేర్చుకున్నవాటిని పాటించాడు. ఆయన తనకు తాను శిక్షణ ఇచ్చుకున్నాడు. పవిత్రశక్తి మీద ఆధారపడ్డాడు. పెద్దలు అలాగే ఇతరులు తిమోతిని ఆదర్శంగా తీసుకోవచ్చు.—w18.04, 13-14 పేజీలు.