కావలికోట—అధ్యయన ప్రతి జూన్ 2019

ఈ సంచికలో ఆగస్టు 5–సెప్టెంబరు 1, 2019 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉంటాయి

“ఎవ్వరూ మిమ్మల్ని బానిసలుగా చేసుకోకుండా జాగ్రత్తపడండి”!

ప్రజల్ని మోసం చేయడంలో సాతాను దిట్ట. మన ఆలోచనా విధానాన్ని మార్చి యెహోవాకు ఎదురు తిరిగేలా చేయడానికి సాతాను ఏమి చేస్తాడు?

దేవుని జ్ఞానానికి వ్యతిరేకంగా ఉన్న తర్కాల్ని తిప్పికొట్టండి!

మన నేపథ్యం, సంస్కృతి, చదువు మన ఆలోచనా విధానం పై ప్రభావం చూపిస్తాయి. మన మనసుల్లో ‘బలమైన కోటల్లా’ పాతుకుపోయిన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవచ్చు?

ఒత్తిడిలో ఉన్నప్పుడు యెహోవా మీద ఆధారపడండి

తీవ్రమైన లేదా దీర్ఘకాలం ఉండే ఒత్తిడి శారీరకంగా, మానసికంగా హాని చేయగలదు. ఒత్తిడి తట్టుకునేలా ప్రాచీనకాల సేవకులకు యెహోవా ఎలా సహాయం చేశాడో పరిశీలించడం ద్వారా మనం ప్రయోజనం పొందుతాం.

ఒత్తిడిని తట్టుకునేలా ఇతరులకు సహాయం చేయండి

లోతు, యోబు, నయోమి యెహోవాను నమ్మకంగా సేవించారు, అయినప్పటికీ వాళ్లు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. వాళ్ల ముగ్గురి నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

సాతాను ఉపయోగించే ఒక ఉరి నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవచ్చు?

చాలామంది దేవుని సేవకులు అశ్లీల చిత్రాల ఉరిలో చిక్కుకున్నారు. ఈ చెడ్డ అలవాటు నుండి ఎలా బయటపడవచ్చు?

ఒక ప్రాచీన గ్రంథపు చుట్టలో ఏముందో తెలిసింది

1970లో,ఇజ్రాయిల్‌లోని ఏన్గెదీలో పురావస్తు శాస్త్రజ్ఞులకు కాలిపోయిన గ్రంథపు చుట్ట ఒకటి కనిపించింది. అందులో ఏముందో 3-D స్కానింగ్‌ సహాయంతో తెలుసుకోగలిగారు. ఇంతకీ దాంట్లో ఏముంది?