అధ్యయన ఆర్టికల్ 25
ఒత్తిడిలో ఉన్నప్పుడు యెహోవా మీద ఆధారపడండి
‘హృదయంలో ఉన్న ఆందోళన దాన్ని కృంగదీస్తుంది.’ —సామె. 12:25, NW.
పాట 30 నా తండ్రి, నా దేవుడు, నా స్నేహితుడు
ఈ ఆర్టికల్‌లో . . . *
1. యేసు ఇచ్చిన హెచ్చరికను మనం ఎందుకు లక్ష్యపెట్టాలి?
చివరి రోజుల గురించిన ప్రవచనాన్ని చెప్తూ యేసు ఇలా అన్నాడు, “మీ విషయంలో శ్రద్ధ తీసుకోండి. . . . జీవిత చింతల వల్ల మీ హృదయాలు ఎన్నడూ ఉక్కిరిబిక్కిరి కాకుండా చూసుకోండి.” (లూకా 21:34) మనం ఆ హెచ్చరికను లక్ష్యపెట్టాలి. ఎందుకు? ఎందుకంటే, ఒత్తిడి కలిగించే ఎన్నో సమస్యల్ని అందరిలాగే మనం కూడా ఎదుర్కొంటున్నాం.
2. మన సహోదరసహోదరీలు ఒత్తిడి కలిగించే ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు?
2 కొన్నిసార్లు, సమస్యలన్నీ ఒకేసారి వచ్చి, ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ అనుభవాలు పరిశీలించండి: జాన్ * అనే ఒక సహోదరుడు, నాడీ వ్యవస్థను దెబ్బతీసే వ్యాధితో (మల్టిపుల్ స్ల్కీరోసిస్తో) బాధపడుతున్నాడు. దానికితోడు 19 ఏళ్లు కలిసి జీవించిన భార్య ఆయన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది, ఆ బాధతో ఆయన కృంగిపోయాడు. ఆ తర్వాత, ఆయన ఇద్దరు కూతుళ్లు కూడా యెహోవాను సేవించడం ఆపేశారు. బాబ్, లిండా దంపతులు వేరే రకమైన సమస్యలు ఎదుర్కొన్నారు. వాళ్లిద్దరి ఉద్యోగాలు పోయాయి, ఇంటి కోసం తీసుకున్న అప్పు తీర్చలేక దాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. వాటికితోడు లిండాకు ప్రాణాంతకమైన గుండె జబ్బు, అలాగే తీవ్రమైన ఆర్థరైటిస్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు.
3. ఫిలిప్పీయులు 4:6, 7 ప్రకారం మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
3 ఒత్తిడిలో ఉన్నప్పుడు మనకెలా అనిపిస్తుందో మన సృష్టికర్త, ప్రేమగల తండ్రి అయిన యెహోవా అర్థంచేసుకుంటాడనే నమ్మకంతో ఉండవచ్చు. అంతేకాదు, వాటిని తట్టుకోవడానికి సహాయం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. (ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.) దేవుని సేవకులు ఎదుర్కొన్న ఎన్నో ఒత్తిళ్ల గురించి బైబిల్లో ఉంది. వాటిని తట్టుకోవడానికి యెహోవా వాళ్లకెలా సహాయం చేశాడో కూడా అందులో ఉంది. వాటిలో కొన్ని ఉదాహరణల్ని పరిశీలిద్దాం.
ఏలీయా “మనలాంటి మనిషే”
4. ఏలీయా ఏ సవాళ్లను ఎదుర్కొన్నాడు? ఆయన ఏ విషయాన్ని గుర్తించాడు?
4 యెహోవా సేవకుడైన ఏలీయా కష్టాల మధ్య జీవించాడు, పెద్దపెద్ద సవాళ్లను ఎదుర్కొన్నాడు. అహాబు, ఇశ్రాయేలును పరిపాలించిన చెడ్డ రాజుల్లో ఒకడు. అతను, బయలును ఆరాధించే యెజెబెలు అనే చెడ్డ స్త్రీని పెళ్లిచేసుకున్నాడు. వాళ్లిద్దరు కలిసి దేశాన్ని బయలు ఆరాధనతో నింపేశారు, ఎంతోమంది యెహోవా ప్రవక్తల్ని చంపించారు. ఏలీయా మాత్రం ఎలాగోలా తప్పించుకున్నాడు. ఆయన యెహోవా సహాయంతో తీవ్రమైన కరువు నుండి కూడా బయటపడ్డాడు. (1 రాజు. 17:2-4, 14-16) అంతేకాదు ఆయన అబద్ధ ప్రవక్తల్ని, బయలు ఆరాధకుల్ని సవాలు చేసినప్పుడు యెహోవాపై ఆధారపడ్డాడు. యెహోవావైపు తిరగమని ఇశ్రాయేలీయుల్ని ప్రోత్సహించాడు. (1 రాజు. 18:21-24, 36-38) ఇలాంటి ఒత్తిళ్లన్నిటిలో యెహోవా తనకు ఎన్నోసార్లు సహాయం చేయడం ఏలీయా గుర్తించాడు.
5-6. మొదటి రాజులు 19:1-4 ప్రకారం, ఏలీయా ఏం అనుకున్నాడు? యెహోవా ఆయన్ని ప్రేమిస్తున్నాడని ఎలా చూపించాడు?
5 మొదటి రాజులు 19:1-4 చదవండి. కానీ యెజెబెలు రాణి చంపుతానని బెదిరించినప్పుడు ఏలీయా భయపడిపోయి, బెయేర్షెబాకు పారిపోయాడు. ఆయన చనిపోవాలని కోరుకునేంతగా నిరుత్సాహపడ్డాడు. ఆయనకు ఎందుకలా అనిపించింది? ఎందుకంటే, ఏలీయా కూడా మనలాంటి భావాలు ఉన్న అపరిపూర్ణ మనిషే. (యాకో. 5:17) బహుశా తీవ్రమైన ఒత్తిడి, అలసట వల్ల ఆయనకు అలా అనిపించివుంటుంది. సత్యారాధనను ప్రోత్సహించడానికి పడిన శ్రమంతా వృథా అయిపోయిందనీ, ప్రజల్లో ఎలాంటి మార్పు రాలేదనీ, యెహోవా ఆరాధకుల్లో తానొక్కడే మిగిలాడనీ ఏలీయా అనుకొనివుంటాడు. (1 రాజు. 18:3, 4, 13; 19:10, 14) ఆ నమ్మకమైన ప్రవక్త భావాలు మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కానీ యెహోవా ఆయన్ని అర్థంచేసుకున్నాడు.
6 ఏలీయా తన భావాల్ని చెప్పినందుకు యెహోవా తిట్టలేదుగానీ, తిరిగి బలం పుంజుకునేలా ఆయనకు సహాయం చేశాడు. (1 రాజు. 19:5-7) తర్వాత, తన అసాధారణ శక్తిని చూపించి ఏలీయా ఆలోచనను సరిచేశాడు. అంతేకాదు ఇశ్రాయేలు దేశంలో బయలును ఆరాధించనివాళ్లు ఇంకా 7,000 మంది మిగిలి ఉన్నారని చెప్పాడు. (1 రాజు. 19:11-18) ఈ విధంగా యెహోవా ఏలీయాను ప్రేమిస్తున్నాడని చూపించాడు.
యెహోవా మనకెలా సహాయం చేస్తాడు?
7. యెహోవా ఏలీయాకు సహాయం చేశాడని తెలుసుకోవడం ఏ అభయాన్నిస్తుంది?
7 మీరు ఒత్తిడి కలిగించే ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నారా? యెహోవా ఏలీయా భావాల్ని అర్థంచేసుకున్నాడని తెలుసుకోవడం ఎంతో ఊరటనిస్తుంది. అంతేకాదు, ఆయన మన హృదయంలో ఉన్న బాధను అర్థంచేసుకుంటాడనే అభయాన్నిస్తుంది. ఆయనకు మన పరిమితులు, ఆలోచనలు, భావాలు కూడా తెలుసు. (కీర్త. 103:14; 139:3, 4) కాబట్టి మనం ఏలీయాలాగే యెహోవాపై ఆధారపడితే, ఒత్తిడి కలిగించే సమస్యల్ని తట్టుకోవడానికి ఆయన సహాయం చేస్తాడు.—కీర్త. 55:22.
8. ఒత్తిడిని తట్టుకోవడానికి యెహోవా మీకెలా సహాయం చేస్తాడు?
8 ఒత్తిడిలో ఉన్నప్పుడు, మన పరిస్థితి ఎప్పటికీ మారదు అనుకుని నిరుత్సాహపడే అవకాశం ఉంది. ఒకవేళ మీకు అలా అనిపిస్తే, ఒత్తిడిని తట్టుకోవడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడని గుర్తుంచుకోండి. ఇంతకీ ఆయన ఎలా సహాయం చేస్తాడు? మీ సమస్యల్ని, భావాల్ని తనకు చెప్పుకోమని యెహోవా ఆహ్వానిస్తున్నాడు. సహాయం కోసం మీరు చేసే విన్నపాలకు ఆయన జవాబిస్తాడు. (కీర్త. 5:3; 1 పేతు. 5:7) కాబట్టి, మీ సమస్యల గురించి యెహోవాకు తరచూ ప్రార్థించండి. ఆయన ఏలీయాతో మాట్లాడినట్లు మీతో నేరుగా మాట్లాడడు కానీ తన వాక్యమైన బైబిలు ద్వారా, తన సంస్థ ద్వారా మీతో మాట్లాడతాడు. అలాగే బైబిలు వృత్తాంతాలు చదివినప్పుడు అవి మీకు ఊరటను, నిరీక్షణను ఇవ్వగలవు. తోటి సహోదరసహోదరీలు కూడా మీకు ప్రోత్సాహాన్ని ఇవ్వగలరు.—రోమా. 15:4; హెబ్రీ. 10:24, 25.
9. మంచి స్నేహితులు మీకెలా సహాయం చేయగలరు?
9 ఏలీయాకున్న బాధ్యతల్లో కొన్నింటిని ఎలీషాతో పంచుకోమని యెహోవా చెప్పాడు. ఆ విధంగా, నిరుత్సాహం నుండి బయటపడడానికి సహాయం చేసే ఒక మంచి స్నేహితుణ్ణి ఆయన ఏలీయాకు ఇచ్చాడు. కాబట్టి మన భావాల్ని ఒక మంచి స్నేహితునితో పంచుకున్నప్పుడు, నిరుత్సాహం నుండి బయటపడడానికి అతను లేదా ఆమె మనకు సహాయం చేయగలరు. (2 రాజు. 2:2; సామె. 17:17) ఒకవేళ అలా చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరనిపిస్తే, మీకు ప్రోత్సాహాన్నిచ్చే ఒక పరిణతిగల స్నేహితుడు దొరికేలా సహాయం చేయమని యెహోవాకు ప్రార్థించండి.
10. ఏలీయా అనుభవం మనకు ఏ నిరీక్షణను ఇస్తుంది? యెషయా 40:28, 29లో ఉన్న అభయం మనకెలా సహాయం చేస్తుంది?
10 ఏలీయా ఒత్తిడిని తట్టుకోవడానికి, ఎన్నో ఏళ్లు నమ్మకంగా సేవచేయడానికి యెహోవా సహాయం చేశాడు. ఏలీయా అనుభవం మనకొక నిరీక్షణను ఇస్తుంది. కొన్నిసార్లు మనం తీవ్రమైన ఒత్తిడి వల్ల శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోతాం. కానీ యెహోవా మీద ఆధారపడితే, తనను సేవిస్తూ ఉండడానికి కావాల్సిన శక్తిని ఆయనిస్తాడు.—యెషయా 40:28, 29 చదవండి.
హన్నా, దావీదు, ఒక కీర్తనకర్త యెహోవా మీద ఆధారపడ్డారు
11-13. ప్రాచీనకాల దేవుని సేవకుల్లో ముగ్గురు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారు?
11 తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్న ఇంకొంతమంది గురించి కూడా బైబిల్లో ఉంది. ఉదాహరణకు, 1 సమూ. 1:2, 6) ఆమె ఎంత ఒత్తిడికి గురయ్యేదంటే బాగా ఏడ్చేది, భోజనం కూడా మానేసేది.—1 సమూ. 1:7, 10.
హన్నా పిల్లలు లేరనే అవమానంతోపాటు, తన సవతి చేతుల్లో ఘోరమైన ఎగతాళిని కూడా ఎదుర్కొంది. (12 ఒత్తిడి వల్ల రాజైన దావీదు కొన్నిసార్లు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఆయనకు ఎదురైన కష్టాల గురించి ఆలోచించండి. ఆయన చేసిన ఎన్నో తప్పుల వల్ల అపరాధ భావంతో కృంగిపోయాడు. (కీర్త. 40:12) కన్న కొడుకైన అబ్షాలోము ఆయనకు ఎదురుతిరిగాడు, కొంతకాలానికి చంపబడ్డాడు. (2 సమూ. 15:13, 14; 18:33) అంతేకాదు, ఒక సన్నిహిత స్నేహితుడు దావీదుకు నమ్మకద్రోహం చేశాడు. (2 సమూ. 16:23–17:2; కీర్త. 55:12-14) దావీదు రాసిన చాలా కీర్తనల్లో, ఆయనకు ఎదురైన నిరుత్సాహం అలాగే యెహోవా మీద ఆయనకున్న అచంచలమైన నమ్మకం కనిపిస్తాయి.—కీర్త. 38:5-10; 94:17-19.
13 మరో కీర్తనకర్త, దుష్టులు వర్ధిల్లడం చూసి అసూయపడ్డాడు. బహుశా ఆయన లేవీయుడైన ఆసాపు వంశస్థుల్లో ఒకడై ఉంటాడు, “దేవుని పరిశుద్ధ స్థలములో” సేవచేశాడు. ఈ కీర్తనకర్త ఎంత మానసిక ఒత్తిడి అనుభవించాడంటే, దానివల్ల సంతోషాన్ని, సంతృప్తిని కోల్పోయాడు. ఆఖరికి, యెహోవాను సేవించడం వల్ల ఏ ఉపయోగమూ లేదని అనుకోవడం మొదలుపెట్టాడు.—కీర్త. 73:2-5, 7, 12-14, 16, 17, 21.
14-15. యెహోవాపై ఆధారపడే విషయంలో ముగ్గురు దేవుని సేవకుల నుండి ఏం నేర్చుకోవచ్చు?
14 పైన ప్రస్తావించబడిన ముగ్గురు దేవుని సేవకులు సహాయం కోసం యెహోవాపై ఆధారపడ్డారు. వాళ్లు యెహోవాకు పట్టుదలగా ప్రార్థన చేస్తూ తమ ఆందోళనల్ని చెప్పుకున్నారు. వాటికిగల కారణాలను ఆయనకు దాపరికం లేకుండా చెప్పారు. అంతేకాదు, మానకుండా యెహోవా ఆరాధనా స్థలానికి వెళ్లారు.—1 సమూ. 1:9, 10; కీర్త. 55:22; 73:17; 122:1.
1 సమూ. 1:18) దావీదు ఇలా రాశాడు, “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును.” (కీర్త. 34:19) అలాగే కీర్తనకర్త కూడా, యెహోవా తన “కుడిచెయ్యి . . . పట్టుకొని” ప్రేమతో సలహాలిస్తూ నడిపిస్తున్నాడని రాశాడు. ఆయనిలా పాడాడు, “నాకైతే దేవుని పొందు ధన్యకరము. . . . నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.” (కీర్త. 73:23, 24, 28) ఈ ఉదాహరణల నుండి మనమేం నేర్చుకోవచ్చు? కొన్నిసార్లు మనకు ఒత్తిడి కలిగించే పెద్దపెద్ద సమస్యలు వస్తాయి. ఆ ఒత్తిడిని తట్టుకోవాలంటే యెహోవా ఇతరులకు ఎలా సహాయం చేశాడో ధ్యానించాలి, ప్రార్థన చేస్తూ ఆయనపై ఆధారపడాలి, ఆయన చెప్పింది చేయాలి.—కీర్త. 143:1, 4-8.
15 యెహోవా ఆ ముగ్గురి పట్ల కనికరం చూపించాడు. దానివల్ల హన్నా మనశ్శాంతిని పొందింది. (యెహోవాపై ఆధారపడండి, ఒత్తిడిని తట్టుకోండి
16-17. (ఎ) మనం యెహోవాకు, ఆయన సేవకులకు ఎందుకు దూరంగా ఉండకూడదు? (బి) మనం తిరిగి బలాన్ని ఎలా పుంజుకోవచ్చు?
16 ఆ ముగ్గురి ఉదాహరణలు మనకు మరో ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పిస్తాయి. అదేంటంటే యెహోవాకు, ఆయన ప్రజలకు ఎన్నడూ దూరంగా ఉండకూడదు. (సామె. 18:1) నాన్సీ అనే సహోదరిని, ఆమె భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడిని వివరిస్తూ ఇలా చెప్పింది, “నేను చాలా రోజులు ఎవ్వరితో మాట్లాడకుండా ఒంటరిగా గడిపాను. కానీ రోజురోజుకీ నా బాధ ఎక్కువైంది.” అయితే ఆమె, సమస్యలు ఎదుర్కొంటున్న వేరేవాళ్లకు సహాయం చేసే మార్గాల కోసం వెదికింది, దానివల్ల ఆమె పరిస్థితి మెరుగైంది. ఆమె ఇలా చెప్తుంది, “ఇతరులు వాళ్ల సమస్యల గురించి చెప్తున్నప్పుడు వినేదాన్ని. వాళ్లమీద, వాళ్ల సమస్యల మీద మనసు పెట్టినప్పుడు నా గురించి, నా సమస్యల గురించి ఆలోచించడం తగ్గించాను.”
17 మనం సంఘ కూటాలకు వెళ్లినప్పుడు తిరిగి బలం పుంజుకుంటాం. మీటింగ్స్‌కు వెళ్లడం ద్వారా మనకు సహాయం చేయడానికి, ఓదార్పును ఇవ్వడానికి యెహోవాకు మరిన్ని అవకాశాలు ఇస్తాం. (కీర్త. 86:17) మీటింగ్స్‌లో యెహోవా తన పవిత్రశక్తి ద్వారా, బైబిలు ద్వారా, తన ప్రజల ద్వారా మనల్ని బలపరుస్తాడు. అక్కడ ఒకరినొకరం ప్రోత్సహించుకునే అవకాశాలు దొరుకుతాయి. (రోమా. 1:11, 12) సోఫీయా అనే సహోదరి ఇలా చెప్పింది, “యెహోవా అలాగే సహోదరసహోదరీల సహాయం వల్లే నేను సహించగలుగుతున్నాను. నాకు మీటింగ్స్యే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనవి. నేను పరిచర్యలో, సంఘ పనుల్లో పాల్గొనే కొద్దీ నా ఒత్తిడిని, ఆందోళనల్ని తట్టుకోగలుగుతున్నానని తెలుసుకున్నాను.”
18. మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు యెహోవా ఏం ఇస్తాడు?
18 మనం నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. యెహోవా మన ఒత్తిడిని భవిష్యత్తులో శాశ్వతంగా తీసేస్తానని మాటివ్వడమే కాదు, ప్రస్తుతం దాన్ని తట్టుకోవడానికి సహాయం చేస్తానని చెప్తున్నాడు. నిరుత్సాహం, నిరాశ నుండి బయటపడాలనే “కోరికను” దానికి కావాల్సిన “శక్తిని” ఆయనిస్తాడు.—ఫిలి. 2:13.
19. రోమీయులు 8:37-39 వచనాలు ఏ అభయాన్నిస్తున్నాయి?
19 రోమీయులు 8:37-39 చదవండి. దేవుని ప్రేమ నుండి మనల్ని ఏదీ వేరుచేయలేదని అపొస్తలుడైన పౌలు అభయాన్నిస్తున్నాడు. అయితే, ఒత్తిడిలో ఉన్న సహోదరసహోదరీలకు మనమెలా సహాయం చేయవచ్చు? యెహోవాను అనుకరిస్తూ మనం వాళ్లపట్ల ఎలా కనికరాన్ని చూపించవచ్చో, వాళ్లకు ఎలా మద్దతు ఇవ్వవచ్చో తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం.
పాట 44 ఒక దీనుడి ప్రార్థన
^ పేరా 5 తీవ్రమైన లేదా దీర్ఘకాలం ఉండే ఒత్తిడి శారీరకంగా, మానసికంగా హాని చేస్తుంది. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు యెహోవా ఎలా సహాయం చేయగలడు? ఆయన ఏలీయాకు ఎలా సహాయం చేశాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. దాంతోపాటు మరికొన్ని బైబిలు ఉదాహరణలు పరిశీలించి, మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు యెహోవాపై ఎలా ఆధారపడవచ్చో నేర్చుకుంటాం.
^ పేరా 2 అసలు పేర్లు కావు.