అధ్యయనం కోసం చిట్కా
మీ అధ్యయనాన్ని దేనితో మొదలుపెట్టవచ్చు?
వ్యక్తిగత అధ్యయనం చేయడానికి మనకు తక్కువ టైం మిగులుతుంది. మరి ఏదోకటి నేర్చుకోవడానికి మనకున్న టైంని ఎలా ఉపయోగించవచ్చు? ముందు, సరిపడా సమయం పెట్టుకోండి. ఎక్కువ సమాచారాన్ని గబగబా లేదా పైపైన చదివే బదులు తక్కువ సమాచారాన్ని జాగ్రత్తగా చదివితే చాలా నేర్చుకోవచ్చు.
తర్వాత, ముఖ్యంగా ఏం అధ్యయనం చేయాలని అనుకుంటున్నారో ఆలోచించండి. (ఎఫె. 5:15, 16) ఈ సలహాలు మీకు ఉపయోగపడవచ్చు:
ప్రతిరోజు బైబిలు చదవండి. (కీర్త. 1:2) వారం మధ్యలో జరిగే మీటింగ్‌లో మనం ఏ అధ్యాయాలైతే చర్చిస్తామో వాటితోనే మొదలుపెట్టవచ్చు.
కావలికోటకు, వారం మధ్యలో జరిగే మీటింగ్‌కి సిద్ధపడండి. మీరు మీటింగ్‌లో చెప్పాలనుకుంటున్న కామెంట్స్‌ని కూడా రెడీ చేసుకోండి.—కీర్త. 22:22.
మీకు ఇంకాస్త టైం ఉంటే, ప్రీచింగ్‌లో ఇచ్చే పత్రికల్ని, వీడియోల్ని అలాగే jw.orgలో ఉన్న వాటిని ఎప్పటికప్పుడు చూడండి.
ఏదైనా ఒక విషయం గురించి పరిశోధన చేయండి. బహుశా మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్య గురించి, మీకున్న ఏదైనా ప్రశ్న గురించి లేదా బైబిల్లో మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలనుకుంటున్న ఒక విషయం గురించి పరిశోధన చేయవచ్చు. పరిశోధన చేయడానికి కొత్త ఐడియాల కోసం jw.orgలో “బైబిల్ని స్టడీ చేద్దాం” అనే సెక్షన్ చూడండి.