జీవిత కథ
ఇతరుల మీద శ్రద్ధ చూపిస్తే చిరకాలం ఉండే దీవెనలు వస్తాయి
“ఆంగ్లికన్ చర్చి సత్యం నేర్పించడం లేదు, సత్యం కోసం వెతుకు” అని మా అమ్మమ్మ మా అమ్మతో చెప్పింది. అప్పటి నుండి మా అమ్మ నిజమైన మతం కోసం అన్వేషించడం మొదలుపెట్టింది. కానీ తను యెహోవాసాక్షులతో మాట్లాడాలని అనుకోలేదు. అందుకే వాళ్లు కెనడాలోని టొరంటోలో ఉన్న మా ఇంటికి వచ్చినప్పుడల్లా నన్ను దాక్కోమని చెప్పేది. కానీ మా పిన్ని 1950లో యెహోవాసాక్షులతో బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు మా అమ్మ కూడా స్టడీ తీసుకోవడం మొదలుపెట్టింది. ఇద్దరు కలిసి మా పిన్నివాళ్ల ఇంట్లోనే స్టడీ తీసుకునేవాళ్లు. ఆ తర్వాత వాళ్లు బాప్తిస్మం తీసుకున్నారు.
యునైటెడ్ చర్చ్ ఆఫ్ కెనడాలో మా డాడీ పెద్దగా పని చేసేవాడు. అందుకే ప్రతీవారం నన్ను, మా చెల్లిని సండే స్కూల్‌కు పంపించేవాడు. ఆ తర్వాత ఆయనతో కలిసి 11 గంటల ఆరాధనకు వెళ్లేవాళ్లం. మధ్యాహ్నమేమో మా అమ్మతో కలిసి రాజ్య మందిరానికి వెళ్లేవాళ్లం. కాబట్టి మాకు రెండు మతాల్లో ఉన్న తేడా కొట్టొచ్చినట్టు కనిపించేది.
మా అమ్మ తను నేర్చుకుంటున్న విషయాల్ని తన చిన్నప్పటి స్నేహితులైన బాబ్, మెరియన్ హచిన్‌సన్‌లకు చెప్పింది, వాళ్లు కూడా యెహోవాసాక్షులయ్యారు. బాబ్ అలాగే మెరియన్ 1958లో న్యూయార్క్‌లో జరిగిన ఎనిమిది రోజుల దైవిక చిత్తం అంతర్జాతీయ సమావేశానికి వాళ్ల ముగ్గురి పిల్లలతో పాటు నన్ను కూడా తీసుకెళ్లారు. ఇప్పుడు ఆలోచిస్తే, అలా నన్ను కూడా తీసుకెళ్లడం వాళ్లకు సవాలే అనిపిస్తుంది. కానీ ఆ సమావేశం నా జీవితంలో ఒక అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది.
వాళ్లు చూపించిన శ్రద్ధ నా భవిష్యత్తును తిరగరాసింది
నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర పందుల్ని, గొర్రెల్ని, కోళ్లని అలాగే రకరకాల జంతువుల్ని పెంచేవాళ్లం. వాటిని చూసుకోవడం నాకు చాలా ఇష్టం అందుకే నేను పశువుల డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. ఇదే విషయాన్ని మా అమ్మ ఒక సంఘ పెద్దకు చెప్పింది. అప్పుడు ఆయన, మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామని, అన్ని సంవత్సరాలు యూనివర్సిటీకి వెళ్లి చదువుకుంటే యెహోవాతో ఉన్న నా బంధం పాడౌతుందేమో ఆలోచించమని చెప్పాడు. (2 తిమో. 3:1) దాంతో నేను యూనివర్సిటీకి వెళ్లి చదువుకోవాలనే ఆలోచనను మార్చుకున్నాను.
స్కూల్ చదువు తర్వాత నేను ఇంకా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ప్రతీవారం ప్రీచింగ్‌కి వెళ్లేవాణ్ణి కానీ, ప్రీచింగ్ అంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఇంకా పయినీరు అవ్వాలనే ఆలోచనైతే అస్సలు లేదు. ఈలోపు, యెహోవాసాక్షికాని మా నాన్న, బాబాయి టొరంటోలోని ఒక పెద్ద ఇన్సూరెన్సు కంపెనీలో నన్ను ఫుల్ టైమ్ పని చేయమని అడిగారు. మా బాబాయి అందులో పెద్ద పోస్టులో ఉన్నాడు కాబట్టి నేను ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాను.
టొరంటోలో నేను ఎక్కువశాతం ఓవర్‌టైమ్ చేసేవాణ్ణి. ఇంకా యెహోవాసాక్షికాని వాళ్లతో ఎక్కువ సమయాన్ని గడిపేవాణ్ణి కాబట్టి మీటింగ్స్‌కి, ప్రీచింగ్‌కి వెళ్లడం కుదిరేదే కాదు. నేను ముందు యెహోవాసాక్షికాని మా తాతతో ఉండేవాణ్ణి, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇంకో ఇల్లు వెతుక్కోవాల్సి వచ్చింది.
1958 సమావేశానికి నన్ను తీసుకెళ్లిన బాబ్, మెరియన్ నన్ను వాళ్ల ఇంట్లో పెట్టుకున్నారు. వాళ్లు నాకు అమ్మానాన్నలతో సమానం. ఆధ్యాత్మికంగా ఎదగడానికి వాళ్లే నాకు సహాయం చేశారు. 1960లో వాళ్ల అబ్బాయి జాన్‌తో పాటు నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను. జాన్ ఆ తర్వాత పయినీరింగ్ మొదలుపెట్టాడు, కాబట్టి నేను కూడా ఇంకా ఎక్కువ ప్రీచింగ్ చేయడం మొదలుపెట్టాను. సంఘంలో ఉన్న బ్రదర్స్ నేను ఆధ్యాత్మికంగా ఎదగడం చూసి నన్ను దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ఓవర్‌సీర్‌గా నియమించారు. a
నాకు ఒక మంచి తోడు దొరికింది, నేనూ పయినీరు అయ్యాను
1966లో, రాండి బెర్గ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆమె ఉత్సాహంగా పయినీరు సేవ చేసేది, అలాగే అవసరం ఎక్కడుంటే అక్కడ సేవ చేయాలనే తపనతో ఉండేది. మా ప్రాంతీయ పర్యవేక్షకుడు మా మీద శ్రద్ధతో ఒంటారియోలోని, ఒరిల్యాలో ఉన్న సంఘానికి సహాయం చేయమని మమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టి మేము వెంటనే అక్కడికి వెళ్లాం.
అక్కడికి వెళ్లిన వెంటనే నేను కూడా రాండితో పాటు పయినీరు సేవ మొదలుపెట్టాను. పయినీరుగా ఆమెకున్న ఉత్సాహం నాకు కూడా అంటుకుంది. ఆ పనిని నేను మనసుపెట్టి చేస్తున్నప్పుడు, బైబిల్ని ఉపయోగించి ప్రజలు సత్యాన్ని అర్థం చేసుకునేలా సహాయం చేయడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూశాను. ఒరిల్యాలోని ఒక జంట తమ జీవితంలో మార్పులు చేసుకుని యెహోవా సేవకులు
అయ్యేలా సహాయం చేసినప్పుడు మా సంతోషానికి అవధుల్లేవు.భాషలో, ఆలోచనలో మార్పు
టొరంటోకి వెళ్లినప్పుడు బేతేలులో పనిచేస్తున్న అర్నాల్డ్ మాక్‌నామారా అనే బ్రదర్‌ని కలిశాం. అప్పుడు ఆయన మేము ప్రత్యేక పయినీర్లుగా వెళ్లగలమా అని అడిగారు: నేను వెంటనే “ఖచ్చితంగా! క్యూబెక్ కాకుండా ఇంకెక్కడికైనా వెళ్తాం!” అని చెప్పాను. ఎందుకంటే కెనడాలో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు, క్యూబెక్‌లో ఫ్రెంచ్ మాట్లాడేవాళ్లను చిన్నచూపు చూసేవాళ్లు. దాంతో నాకూ అలా అనిపించింది. ఆ సమయంలో కెనడా నుండి క్యూబెక్ స్వాతంత్రాన్ని కోరుతూ, ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు.
అర్నాల్డ్ ఇలా అన్నాడు, “ప్రస్తుతానికి బ్రాంచి క్యూబెక్‌కి మాత్రమే పయినీర్లను పంపిస్తుంది.” అప్పుడు నేను వెంటనే ఒప్పుకున్నాను. రాండికి కూడా అక్కడకి వెళ్లి సేవ చేయడం ఇష్టమే అని నాకు తెలుసు. మా జీవితంలో మేము తీసుకున్న మంచి నిర్ణయాల్లో ఇది ఒకటని ఆ తర్వాత అర్థమైంది.
ఐదు వారాలు ఫ్రెంచ్ భాష క్లాస్‌లకు హాజరైన తర్వాత రాండి, నేను కలిసి ఇంకో జంటతో మాంట్రియల్‌కి ఈశాన్యంలో దాదాపు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైమోస్కీకి వెళ్లాం. ఒకసారి అక్కడ మీటింగ్‌లో కొన్ని ప్రకటనలు చదువుతున్నప్పుడు, మేము ఫ్రెంచ్ భాషను ఇంకా బాగా నేర్చుకోవాలని స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే నేను ప్రకటనలు చదువుతూ రాబోయే సమావేశానికి “ఆస్ట్రియా నుండి చాలామంది అతిథులు వస్తారు” అని చెప్పే బదులు “ఆస్ట్రిచ్ (నిప్పుకోడి) అతిథులు వస్తారని చదివాను.”
రైమోస్కీలో నలుగురు ఉత్సాహంగల ఒంటరి సిస్టర్స్ అలాగే బ్రదర్ ఉబేర్డో, సిస్టర్ ఉబేర్డో, వాళ్ల ఇద్దరు అమ్మాయిలు మా నలుగురితో కలిసి ప్రీచింగ్ చేసేవాళ్లు. బ్రదర్ ఉబేర్డో మేమందరం ఉండడానికి ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మేమందరం ఉంటాం కాబట్టి అద్దెని తలా కొంచెం పంచుకున్నాం. అది తెల్ల రంగు బిల్డింగ్ అలాగే దానికి తెల్ల పిల్లర్‌లు ఉండేవి కాబట్టి సరదాగా దాన్ని వైట్ హౌస్ అని పిలిచేవాళ్ళం. మామూలుగా అక్కడ ఎప్పుడూ 12 నుండి 14 మంది ఉండేవాళ్లం. అయితే నేను, రాండి ప్రత్యేక పయినీర్లం కాబట్టి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ప్రీచింగ్‌కి వెళ్లేవాళ్లం. అయితే ఎంత చలి ఉన్నా, మాతోపాటు ఎవరో ఒకరు కలిసి ప్రీచింగ్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చేది.
మేము ఆ నమ్మకమైన పయినీర్లకు చాలా దగ్గర అయిపోయాం, అందరం ఒక కుటుంబంలా ఉండేవాళ్లం. కొన్నిసార్లు మేమంతా కలిసి చలిమంట చుట్టూ కూర్చునేవాళ్లం, కలిసి వంటలు వండుకునేవాళ్లం. మాలో ఒక బ్రదర్‌కు మ్యూజిక్ వాయించడం వచ్చు కాబట్టి, శనివారం రాత్రులు అప్పుడప్పుడు పాటలు పాడేవాళ్లం, డాన్స్ చేసేవాళ్లం.
రైమోస్కీలోని ప్రజలు సత్యానికి బాగా స్పందించారు. ఐదు సంవత్సరాల్లోనే చాలామంది బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకున్నారు. దాంతో సంఘంలో ప్రచారకుల సంఖ్య దాదాపు 35 మందికి పెరిగింది.
క్యూబెక్‌లో మాకు మంచివార్త ప్రచారకులుగా చక్కని శిక్షణ దొరికింది. యెహోవా మా పరిచర్య అంతటిలో ఎలా సహాయం చేశాడో, మా అవసరాల్ని ఎలా తీర్చాడో మేము చూశాం. దానికితోడు, మేము ఫ్రెంచ్ మాట్లాడే ప్రజల్ని, వాళ్ల భాషను, సంస్కృతిని ప్రేమించడం మొదలుపెట్టాం. దానివల్ల వేరే సంస్కృతుల వాళ్లను ఇష్టపడడం తేలికైంది.—2 కొరిం. 6:13
ఊహించని విధంగా బ్రాంచి మమ్మల్ని న్యూ బ్రూన్‌స్విక్ తూర్పు తీరాన ఉన్న ట్రకాడీ అనే పట్టణానికి వెళ్లమని చెప్పింది. కానీ మేము అప్పుడే ఒక కొత్త అపార్ట్‌మెంట్‌ని లీజ్‌కు తీసుకున్నాం. అలాగే పార్ట్‌టైమ్ స్కూల్ టీచర్‌గా నా కాంట్రాక్ట్ ఇంకా అయిపోలేదు. దానికితోడు, మా బైబిలు విద్యార్థులు అప్పుడే ప్రచారకులయ్యారు అలాగే మా రాజ్యమందిర నిర్మాణం కూడా మధ్యలో ఉంది.
ట్రకాడీకి వెళ్ళాలా లేదా అని వారాంతంలో మేము బాగా ప్రార్థించాం. ఆ తర్వాత ఆ పట్టణాన్ని ఒకసారి చూసి మలా. 3:10) ఎప్పటిలాగే రాండికి ఉన్న ఆధ్యాత్మికత, స్వయంత్యాగ స్ఫూర్తి, సరదాగా ఉండే గుణం వల్ల అక్కడకు వెళ్లడం తేలికైంది.
వచ్చాం. రైమోస్కీకీ, ఈ పట్టణానికీ చాలా తేడా ఉంది. కానీ అక్కడకి వెళ్లాలని యెహోవా కోరుకుంటున్నాడు కాబట్టి మేము వెళ్లాలనుకున్నాం. మేము యెహోవాను పరీక్షించాం. ఆ తర్వాత మాకున్న అడ్డంకులన్నిటినీ ఒక్కొక్కటిగా యెహోవా తీసేయడం చూశాం. (మేము వెళ్లే కొత్త సంఘంలో ఒకేఒక్క సంఘపెద్ద ఉన్నాడు, ఆయనే రాబర్ట్ రోజ్. ఆయనా, ఆయన భార్య పయినీర్లుగా చేసేవాళ్లు. వాళ్లకు అబ్బాయి పుట్టిన తర్వాత కూడా అక్కడే ఉండి పయినీర్లుగా కొనసాగారు. వాళ్ల అబ్బాయిని చూసుకుంటూ కూడా వాళ్లు మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చేరదీశారు, పరిచర్యలో ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దానివల్ల మేము ఎంతో ప్రోత్సాహాన్ని పొందాం.
అవసరం ఉన్న చోట సేవ తెచ్చిపెట్టిన దీవెనలు
ట్రకాడీలో రెండు సంవత్సరాలు పయినీరింగ్ చేసిన తర్వాత మాకు ఊహించని ఆహ్వానం వచ్చింది. మమ్మల్ని ప్రాంతీయ సేవకు ఆహ్వానించారు. ఏడు సంవత్సరాలు ఇంగ్లీషు సర్క్యూట్‌లో పనిచేశాం. ఆ తర్వాత క్యూబెక్‌లోని ఫ్రెంచ్ సర్క్యూట్‌కి మార్చారు. క్యూబెక్‌లోని మా జిల్లా పర్యవేక్షకుడు లేయాన్స్ క్రేపో నా ప్రసంగాల్ని చాలా మెచ్చుకునేవాడు. కానీ ఆ తర్వాత “వాటిని ప్రేక్షకులకు ఉపయోగపడేలా ఇంకా బాగా ఎలా ఇవ్వవచ్చు?” అని అడిగేవాడు. b అలా నా మీద శ్రద్ధ చూపించడం వల్ల నేను ప్రేక్షకులకు తేలిగ్గా అర్థమయ్యేలా బోధించడం మీద దృష్టిపెట్టాను.
1978లో మాంట్రియల్‌లో జరిగిన “విజయవంతమైన విశ్వాసం” అనే అంతర్జాతీయ సమావేశంలో చేసిన నియామకం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఫుడ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. ఆ సమావేశానికి దాదాపు 80,000 మంది వస్తారు కాబట్టి ఆహార ఏర్పాట్లన్నీ గతంలో కన్నా కాస్త వేరుగా చేశాం. అన్నీ కొత్తవే, కొత్త పనిముట్లు, కొత్త మెనూ, వంట చేసే విధానం కూడా కొత్తదే. అక్కడ 20 పెద్ద ఫ్రిడ్జ్‌లు ఉన్నాయి. కానీ అవి అప్పుడప్పుడు పనిచేసేవి కావు. అక్కడ ఏదో క్రీడా కార్యక్రమం జరగడం వల్ల మేము సమావేశం జరగడానికి ముందు రోజు మధ్యరాత్రి వరకు స్టేడియంలోకి వెళ్లలేకపోయాం. తర్వాత రోజు తెల్లవారకముందే అందరికోసం మేము టిఫిన్లు చేయాల్సి వచ్చింది. మేము బాగా అలసిపోయాం. కానీ అక్కడ పనిచేయడానికి వచ్చిన వాలంటీర్లు కష్టపడి పని చేయడం, వాళ్ల పరిణతి, సరదాగా ఉండేవాళ్ల గుణం నుండి నేను ఎంతో నేర్చుకున్నాను. మేమంతా మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. వాళ్లల్లో చాలామంది ఇప్పటికీ టచ్‌లో ఉన్నారు. 1940, 1950లలో క్యూబెక్‌లో భయంకరమైన హింస ఉండేది. కానీ ఇప్పుడు అక్కడే జరుగుతున్న ఈ సమావేశాన్ని చూడడానికి నా రెండు కళ్లు సరిపోలేదు!
మాంట్రియల్‌లో జరిగిన పెద్ద సమావేశాల్లో నాతోపాటు
పనిచేసిన ఓవర్సీయర్ల నుండి నేను ఎంతో నేర్చుకున్నాను. ఇప్పుడు పరిపాలక సభలో పనిచేస్తున్న డేవిడ్ స్ప్లేయిన్ ఒక సంవత్సరం సమావేశ ఓవర్‌సీర్‌గా పనిచేశాడు. ఆ తర్వాతి సంవత్సరం ఆ నియామకం నన్ను చేయమన్నారు. అప్పుడు డేవిడ్ నాకు పూర్తి మద్దతు ఇచ్చాడు.36 సంవత్సరాలు మేము ప్రాంతీయ సేవలో ఆనందించిన తర్వాత 2011లో నన్ను సంఘపెద్దల కోసం పాఠశాలకు ఉపదేశకునిగా నియమించారు. ఆ రెండు సంవత్సరాల్లో రాండి, నేను దాదాపు 75 వేర్వేరు ఇళ్లల్లో ఉన్నాం. మేము పొందిన దీవెనలు మేము చేసిన త్యాగాలకు అసలు సాటిరావు. ఎందుకంటే ప్రతీవారం చివర్లో, పరిపాలక సభ తమ ఆధ్యాత్మికత గురించి ఎంతగా పట్టించుకుంటుందో గమనించి పెద్దలు కృతజ్ఞతతో నిండిపోయేవాళ్లు.
ఆ తర్వాత నన్ను రాజ్య సువార్తికుల కోసం పాఠశాలకు ఉపదేశకునిగా నియమించారు. అక్కడ ఉన్న షెడ్యూల్స్‌ని చూసి ఆ విద్యార్థులందరూ ఉక్కిరిబిక్కిరి అయిపోయేవాళ్లు. ఎందుకంటే రోజులో 7 గంటలు క్లాసులో కూర్చోవాలి, సాయంత్రాలు 3 గంటలు హోమ్‌వర్క్ చేయాలి, ప్రతీవారం 4 లేదా 5 నియామకాలు చేయాలి. నేనూ, నాతోపాటు ఉన్న ఉపదేశకుడు, మీరు యెహోవా సహాయం లేకుండా దీన్ని అస్సలు చేయలేరని విద్యార్థులకు చెప్పేవాళ్లం. యెహోవా మీద ఆధారపడడం వల్ల, విద్యార్థులు వాళ్లు అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించడం చూసినప్పుడు వాళ్లు ఆశ్చర్యపోవడం ఇంకా నా కళ్ల ముందే ఉంది.
ఇతరుల మీద శ్రద్ధ చూపిస్తే చిరకాలం ఉండే దీవెనలు వస్తాయి
మా అమ్మ ఇతరుల మీద శ్రద్ధ చూపించడం వల్ల తన బైబిలు విద్యార్థులు ప్రగతి సాధించేలా సహాయం చేయగలిగింది. అలాగే మా నాన్న సత్యం వైపు ఆకర్షించబడేలా చేసింది. ఆమె చనిపోయిన మూడు రోజులకు, మా నాన్న బహిరంగ ప్రసంగం వినడానికి రాజ్య మందిరానికి వచ్చినప్పుడు మా కళ్లను మేము నమ్మలేకపోయాం. ఆ రోజు నుండి 26 సంవత్సరాల వరకు ఆయన ప్రతీ మీటింగ్‌కి వచ్చాడు. మా నాన్న బాప్తిస్మం తీసుకోకపోయినా, ప్రతీవారం జరిగే మీటింగ్స్‌కి ఆయనే ముందు వస్తాడని అక్కడున్న పెద్దలు నాకు చెప్తూ ఉంటారు.
మా అమ్మ ఉంచిన ఆదర్శం నా మీద, నా చెల్లెళ్ల మీద చెరగని ముద్ర వేసింది. మా ముగ్గురు చెల్లెళ్లు, వాళ్ల భర్తలు యెహోవాకు నమ్మకంగా సేవచేస్తున్నారు. వాళ్లల్లో ఒకరు పోర్చుగల్ బ్రాంచిలో, ఇంకొకరు హయిటీ బ్రాంచిలో సేవచేస్తున్నారు.
నేను, రాండి ఇప్పుడు ఒంటారియోలోని హామిల్టన్‌లో ప్రత్యేక పయినీర్లుగా సేవచేస్తున్నాం. మేము ప్రాంతీయ సేవలో ఉన్నప్పుడు వేరే బ్రదర్స్, సిస్టర్స్ రిటన్ విజిట్స్‌కి, బైబిలు స్టడీలకు వెళ్లడాన్ని ఎంతో ఆనందించాం. అయితే మా సొంత బైబిలు విద్యార్థులు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడం చూడడం ఎంతో ముచ్చటేస్తుంది. కొత్త సంఘంలో ఉన్న బ్రదర్స్, సిస్టర్స్ కూడా మాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ల కష్ట-సుఖాల్లో యెహోవా వాళ్లకు మద్దతు ఇవ్వడం చూసినప్పుడు మాకు ఎంతో ప్రోత్సాహంగా అనిపించింది.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, మా మీద చాలామంది శ్రద్ధ చూపించినందుకు మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాం. దాంతో ఇతరులు కూడా యెహోవా సేవను ఇంకా బాగా చేసేలా ప్రోత్సహించాలని మేము ఎంతో కోరుకున్నాం. (2 కొరిం. 7:6, 7) ఉదాహరణకు, ఒక కుటుంబంలో భార్య, కొడుకు, కూతురు అందరూ పూర్తికాల సేవలో ఉన్నారు. అయితే, నేను ఆ భర్తను మీరెందుకు పయినీరింగ్ చేయట్లేదని అడిగాను. అప్పుడు ఆయన ఆ ముగ్గురు పయినీర్లకు మద్దతు ఇస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, “మీరు యెహోవా కన్నా వాళ్లకు బాగా మద్దతు ఇవ్వగలరా?” ఆ తర్వాత, వాళ్ల ఆనందాన్ని మీరెందుకు రుచి చూడకూడదు అని చెప్పి, ప్రోత్సహించాను. దాంతో ఆయన ఆరు నెలల్లోనే పయినీరు సేవ మొదలుపెట్టాడు.
నేను, రాండి యెహోవా చేసిన అద్భుతమైన పనుల గురించి తర్వాతి తరానికి చెప్తూనే ఉంటాం. యెహోవా సేవలో మేము రుచి చూసిన ఆనందాన్నే వాళ్లూ రుచి చూడాలన్నదే మా కోరిక!—కీర్త. 71:17, 18
a ఇప్పుడు దాన్ని క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ ఓవర్‌సీర్ అని పిలుస్తున్నారు.
b 2020, ఫిబ్రవరి కావలికోట 26-30 పేజీల్లో ఉన్న లేయాన్స్ క్రేపో జీవిత కథ చూడండి.