కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

వలసవచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధ్యాత్మికంగా సహాయం చేసేటప్పుడు భాష గురించి ఎందుకు ఆలోచించాలి?

మీ పిల్లలు స్కూల్‌లో అలాగే తోటివాళ్ల నుండి స్థానిక భాష నేర్చుకుంటారు. పిల్లలు ఒకటికన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. అయితే, పిల్లలు సత్యాన్ని అర్థంచేసుకుని, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించేందుకు స్థానిక భాషా సంఘంతో సహవసించాలా లేదా మాతృ భాషా సంఘంతో సహవసించాలా అనేది తల్లిదండ్రులు నిర్ధారించుకోవాలి. క్రైస్తవ తల్లిదండ్రులు తమ ఇష్టాలకన్నా పిల్లల అవసరాలకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు.—w17.05, 9-11 పేజీలు.

“నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా” అని యేసు పేతురును అడిగాడు. అయితే, “వీటికన్నా” అనే మాట వేటిని సూచిస్తుంది? (యోహా. 21:15)

బహుశా అక్కడున్న చేపల్ని లేదా చేపల వ్యాపారాన్ని యేసు సూచిస్తుండవచ్చు. యేసు చనిపోయిన తర్వాత, పేతురు మళ్లీ చేపల వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. కాబట్టి క్రైస్తవులు ఉద్యోగానికి ఏ స్థానం ఇస్తున్నారో ఆలోచించుకోవాలి.—w17.05, 22-23 పేజీలు.

హీబ్రూ నేర్చుకోవాలనుకునే వాళ్లకోసం ఏలీయాస్‌ హట అనే వ్యక్తి ఏ పద్ధతిని కనుక్కున్నాడు?

హీబ్రూ భాష నేర్చుకోవాలనుకునే విద్యార్థులు, బైబిల్లోని హీబ్రూ మూల పదాల్ని అలాగే ఆ మూల పదాలకు ముందు వెనుక కలిపే ఉపసర్గ, ప్రత్యయ పదాల తేడాను అర్థంచేసుకోవాలని ఏలీయాస్‌ హట కోరుకున్నాడు. దానికోసం అతను, మూలపదాన్ని లేదా ధాతువుని సాలిడ్‌ అక్షరాల్లో, ముందు వెనుక కలిపే అక్షరాలను ఔట్‌లైన్‌ అక్షరాల్లో (బోలుగా) ముద్రించాడు. నూతనలోక అనువాదం రెఫరెన్సు బైబిలు ఫుట్‌నోట్లలో ఇలాంటి పద్ధతినే వాడారు.wp17.4, 11-12 పేజీలు.

తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి తుపాకీని లేదా గన్‌ను ఉంచుకునే విషయంలో క్రైస్తవులు ఏ విషయాల్ని పరిగణలోకి తీసుకోవాలి?

కొన్ని విషయాలు ఏమిటంటే: దేవుడు జీవాన్ని పవిత్రంగా ఎంచుతాడు. తమ ప్రాణాన్ని కాపాడుకోవడానికి తమతోపాటు కత్తులు తెచ్చుకోమని యేసు తన శిష్యులకు చెప్పలేదు. (లూకా 22:36, 38) మనం మన కత్తులను “నాగటి నక్కులుగా” చేసుకుంటాం. వస్తుసంపదల కన్నా జీవం విలువైనది. మనం ఇతరుల మనస్సాక్షిని గౌరవిస్తాం, వాళ్లకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం. (2 కొరిం. 4:2)—w17.07, 31-32 పేజీలు.

యేసు పుట్టుక, చిన్నతనం గురించి మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో ఉన్న విషయాలు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి?

మత్తయి ముఖ్యంగా యోసేపు జీవితంలో జరిగిన సంఘటనల గురించి రాశాడు. అంటే, మరియ గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు స్పందించిన తీరు గురించి, దేవదూత ఇచ్చిన నిర్దేశాలను ఆయన పాటించిన విధానం గురించి మత్తయి రాశాడు. లూకా ముఖ్యంగా మరియ గురించి రాశాడు. ఉదాహరణకు, ఆమె ఎలీసబెతును కలవడానికి వెళ్లడం గురించి, 12 ఏళ్ల యేసు ఆలయంలో తప్పిపోయినప్పుడు ఆమె స్పందించిన తీరు గురించి లూకా రాశాడు.—w17.08, 32వ పేజీ.

బైబిలు వేటిని తట్టుకుని నిలబడింది?

కాలం గడిచేకొద్దీ బైబిల్లో వాడిన పదాలకు, పదబంధాలకు అర్థాలు మారిపోయాయి. రాజకీయాల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రజలు మాట్లాడే భాష మారింది. బైబిల్ని సామాన్య భాషల్లోకి అనువదించే పనికి వ్యతిరేకత వచ్చింది.—w17.09, 19-21 పేజీలు.

అత్యున్నతమైన ప్రేమ ఏమిటి?

అత్యున్నతమైన ప్రేమ సరైన సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. దాన్నే బైబిలు అగాపే అనే గ్రీకు పదంతో వర్ణిస్తోంది. ఒకరిపై చూపించే అనురాగం, ఆప్యాయత కూడా ఆ ప్రేమలో భాగమే. కానీ ఆ ప్రేమ ఉన్నతమైన ప్రమాణాలతో ఉంటుంది, అంటే ఇతరుల ప్రయోజనం కోసం నిస్వార్థంగా పనిచేసేలా నడిపిస్తుంది.—w17.10, 7వ పేజీ.