కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఇటీవలి కావలికోట సంచికలను జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలరేమో చూడండి:

దేవునికి తదనుభూతి ఉందని ఏ లేఖనాల్ని బట్టి చెప్పవచ్చు?

ప్రాచీన ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, దేవునికి వాళ్ల కష్టాల గురించి తెలియడం మాత్రమే కాదు, వాళ్ల వేదనను కూడా ఆయన తెలుసుకోగలిగాడు. (నిర్గ. 3:7; యెష. 63:9) మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం కాబట్టి తదనుభూతి చూపించగలం. దేవుని ప్రేమ పొందడానికి అర్హులం కాదని మనకు అనిపించినా, ఆయన మాత్రం మనపట్ల తదనుభూతి చూపిస్తాడు.—wp18.3, 8-9 పేజీలు.

వివక్ష చూపించకుండా ఉండడానికి ప్రజలకు యేసు బోధలు ఎలా సహాయపడ్డాయి?

యేసు కాలంలో ఉన్న చాలామంది యూదులు వివక్ష చూపించేవాళ్లు. కానీ తన అనుచరులు వినయంగా ఉండాలనీ, జాతిని బట్టి గర్వించకూడదనీ, ఒకరినొకరు సహోదరుల్లా చూసుకోవాలనీ యేసు నొక్కి చెప్పాడు.—w18.06, 9-10 పేజీలు.

దేవుడు మోషేను వాగ్దాన దేశంలోకి ప్రవేశించనివ్వకుండా ఆపడం నుండి ఏం నేర్చుకోవచ్చు?

మోషేకు యెహోవాతో దగ్గరి సంబంధం ఉండేది. (ద్వితీ. 34:10) ఇశ్రాయేలీయులు దాదాపు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించిన తర్వాత అంటే ఆ ప్రయాణం చివర్లో, నీళ్లు లేవని రెండవసారి ఫిర్యాదు చేశారు. అప్పుడు యెహోవా మోషేకు బండతో మాట్లాడమని చెప్పాడు. కానీ మోషే అలా చేయకుండా బండను కొట్టాడు. మోషే దేవుని నిర్దేశాల్ని పాటించకపోవడం వల్ల లేదా ఆ అద్భుతానికి మూలమైన దేవుణ్ణి మహిమపర్చకపోవడం వల్ల యెహోవాకు కోపం వచ్చివుండవచ్చు. (సంఖ్యా. 20:6-12) మోషే ఉదాహరణ నుండి మనం యెహోవాకు లోబడాలని, ఆయనకు చెందాల్సిన మహిమను ఆయనకు ఇవ్వాలని నేర్చుకోవచ్చు.—w18.07, 13-14 పేజీలు.

మనం పైకి కనిపించే వాటిని బట్టి తీర్పుతీరిస్తే సులభంగా తప్పు చేసే అవకాశం ఉందని ఎలా చెప్పవచ్చు?

మనం పైకి కనిపించే ఈ మూడు విషయాల్ని బట్టి ఇతరులకు తీర్పుతీర్చే అవకాశం ఉంది. అవేంటంటే: తెగ లేదా జాతి, ఆస్తి-అంతస్తులు, వయసు. మనం దేవునిలా ఇతరులతో నిష్పక్షపాతంగా ఉండడానికి ప్రయత్నించాలి. (అపొ. 10:34, 35)—w18.08, 8-12 పేజీలు.

వృద్ధ సహోదరులు ఇతరులకు ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు?

ఒక వృద్ధ క్రైస్తవుని నియామకం మారినప్పటికీ, ఆయన యెహోవా దృష్టిలో విలువైనవాడే. ఆయన ఇతరులకు ఎంతో సహాయం చేయవచ్చు. ఆయన, అవిశ్వాస భర్తల్ని కలవవచ్చు; నిష్క్రియులకు సహాయం చేయవచ్చు, బైబిలు స్టడీలు చేయవచ్చు; పరిచర్యను విస్తృతం చేసుకోవచ్చు.—w18.09, 8-11 పేజీలు.

మన బోధనా పనిముట్లలో ఏమేమి ఉన్నాయి?

బోధనా పనిముట్లలో కాంటాక్ట్‌ కార్డులు, ఆహ్వానపత్రాలు, చక్కగా తయారుచేయబడిన ఎనిమిది కరపత్రాలు ఉన్నాయి. అంతేకాదు కావలికోట, తేజరిల్లు! పత్రికలు, కొన్ని బ్రోషుర్లు, బైబిలు స్టడీ కోసం రెండు పుస్తకాలు; బైబిలు ఎందుకు చదవాలి? అనే వీడియోతోపాటు మరో మూడు వీడియోలు ఉన్నాయి.—w18.10, 16వ పేజీ.

సామెతలు 23:23 చెప్తున్నట్లు ఒక క్రైస్తవుడు సత్యాన్ని ఎలా కొనుక్కోవచ్చు?

మనం సత్యాన్ని కొనుక్కోవడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ దానికోసం సమయం, కృషి అవసరం.—w18.11, 4వ పేజీ.

హోషేయ తన భార్య గోమెరుతో వ్యవహరించిన విధానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

గోమెరు ఒకటికన్నా ఎక్కువసార్లు వ్యభిచారం చేసింది, కానీ హోషేయ ఆమెను క్షమించి, ఆమెతో కలిసివున్నాడు. ఒకవేళ యెహోవాసాక్షికాని భర్త లేదా భార్య లైంగిక పాపం చేస్తే, తప్పుచేయని వివాహజత అతన్ని లేదా ఆమెను క్షమించవచ్చు. తప్పుచేసిన భర్త లేదా భార్యతో మళ్లీ లైంగిక సంబంధం కొనసాగిస్తే, లేఖనాధారంగా విడాకులు తీసుకోవడానికి ఇక ఏ కారణం ఉండదు.—w18.12, 13వ పేజీ.