కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్నలు

పాఠకుల ప్రశ్నలు

ఒక విషయాన్ని నిర్ధారించాలంటే కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలని బైబిలు చెప్తుంది. (సంఖ్యా. 35:30; ద్వితీ. 17:6; 19:15; మత్త. 18:16; 1 తిమో. 5:19) అయితే ధర్మశాస్త్రం ప్రకారం, ఒకవ్యక్తి పెళ్లి నిశ్చయమైన అమ్మాయి మీద “పొలములో” అత్యాచారం చేసినప్పుడు ఆమె గట్టిగా అరిస్తే, ఆమె నిర్దోషి అవుతుంది గానీ అతడు వ్యభిచారం చేసినవాడు అవుతాడు. దానికి సాక్షులు ఎవరూ లేకపోయినా అతను ఎందుకు దోషి అవుతాడు, ఆమె ఎందుకు నిర్దోషి అవుతుంది?

ద్వితీయోపదేశకాండము 22:25-27 లో ఉన్న వృత్తాంతం, ఆ పురుషుడు దోషి అని నిరూపించడం గురించి మాట్లాడట్లేదు. ఎందుకంటే అతను దోషి అని తేలిపోయింది. ఈ లేఖన నియమం, ఆ స్త్రీని నిర్దోషిగా నిర్ధారించడం గురించి మాట్లాడుతుంది. దీన్ని అర్థంచేసుకోవడానికి, ఆ లేఖన సందర్భాన్ని పరిశీలిద్దాం.

దాని ముందున్న వచనాలు, పెళ్లి నిశ్చయమైన అమ్మాయిపై “ఊరిలో” అత్యాచారం చేసిన వ్యక్తి గురించి చెప్తున్నాయి. ఆ అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది గనుక ఆమె పెళ్లయిన స్త్రీతో సమానం. కాబట్టి అతను, ఆమెతో వ్యభిచారం చేసినట్లే. మరి ఆ అమ్మాయి సంగతేంటి? ఆమె “ఊరిలో కేకలు” వేయలేదు. ఒకవేళ ఆమె అరిచివుంటే, చుట్టుపక్కల వాళ్లు అది విని, ఆమెను రక్షించేవాళ్లు. కానీ ఆమె అరవలేదు. కాబట్టి ఆమె కూడా ఆ వ్యభిచారంలో పాలు పంచుకున్నట్టే, అందుకే వాళ్లిద్దరూ దోషులుగా తీర్పుతీర్చబడ్డారు.—ద్వితీ. 22:23, 24.

అయితే, ఆ తర్వాతి వచనాలు మరో పరిస్థితి గురించి చెప్తున్నాయి: “ఒకడు ప్రధానముచేయబడిన చిన్నదానిని పొలములో కలిసికొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించినయెడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదాని నేమియు చేయకూడదు, ఆ చిన్నదానియందు మరణపాత్రమైన పాపములేదు. ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే యిది జరిగినది. అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.”—ద్వితీ. 22:25-27.

ఆ సందర్భంలో, ఆమె చెప్పేది న్యాయాధిపతులు నమ్మారు. దేని ఆధారంగా? ఆ అమ్మాయి “కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను.” కాబట్టి ఆమె వ్యభిచారం చేసినట్లు అవ్వదు. కానీ అతను, పెళ్లి నిశ్చయమైన అమ్మాయితో బలవంతంగా పడుకున్నాడు కాబట్టి అతను అత్యాచారం, వ్యభిచారం చేసినట్లే.

కాబట్టి, లేఖనాలు అమ్మాయి నిర్దోషి అనే విషయం మీద దృష్టి పెట్టినా, ఆ వృత్తాంతం అతను అత్యాచారం, వ్యభిచారం చేసి దోషి అయ్యాడని సరిగ్గానే చెప్తుంది. న్యాయాధిపతులు జరిగిన విషయాన్ని “పరీక్షించి బాగుగా విచారిస్తారని” లేదా పూర్తి దర్యాప్తు చేస్తారని, దేవుడు పదేపదే స్పష్టంగా తెలియజేసిన తన ప్రమాణాల ప్రకారం తీర్పుతీరుస్తారని నమ్మవచ్చు.—ద్వితీ. 13:13; 17:4; నిర్గ. 20:14.