కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

కావలికోట 2019 ఆధారంగా మీరు ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగలరా?

“నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు” అని యెహోవా ఇచ్చిన మాటకు అర్థం ఏంటి? (యెష. 54:17)

పెద్ద గాలివాన నుండి ఒక గోడ మనల్ని కాపాడినట్లే, “భీకరుల ఊపిరి” లేదా నిరంకుశ పాలకుల కోపం నుండి యెహోవా మనల్ని కాపాడతాడు. (యెష. 25:4, 5) శత్రువులు ఎన్నడూ మనకు శాశ్వత హాని చేయలేరు.—w19.01, 6-7 పేజీలు.

కనానీయులతో, అవిధేయులైన ఇశ్రాయేలీయులతో యెహోవా వ్యవహరించిన విధానంలో ఆయన న్యాయం ఎలా కనిపిస్తుంది?

అసహ్యమైన లైంగిక పనులు చేసేవాళ్లను లేదా ఏ దిక్కులేని స్త్రీలతో, పిల్లలతో కఠినంగా వ్యవహరించేవాళ్లను యెహోవా శిక్షించాడు. తనకు విధేయత చూపించేవాళ్లను, ఇతరులతో న్యాయంగా వ్యవహరించేవాళ్లను ఆయన దీవించాడు.—w19.02, 22-23 పేజీలు.

యెహోవాసాక్షికాని వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అక్కడ ఉంటే ఏం చేయాలి?

మనం మౌనంగా, గౌరవపూర్వకంగా ఉండవచ్చు. మనం “ఆమేన్‌” అని చెప్పి ఆ ప్రార్థనలో పాల్గొనం; లేదా ఆ సమయంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకోం. అయితే ఆ సమయంలో మన మనసులో సొంతగా ప్రార్థన చేసుకోవచ్చు.—w19.03, 31వ పేజీ.

పిల్లలపై లైంగిక దాడి ఎంత గంభీరమైనది?

పిల్లలపై లైంగిక దాడి బాధితులకు, సంఘానికి, ప్రభుత్వానికి, దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం. పిల్లలపై లైంగిక దాడి జరిగినప్పుడు, దాన్ని అధికారులకు తెలియజేయాలనే ప్రభుత్వ చట్టాలకు పెద్దలు లోబడతారు.—w19.05, 9-10 పేజీలు.

మీ ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవచ్చు?

దానికోసం ముఖ్యంగా ఏం చేయాలంటే: ప్రార్థనలో యెహోవాతో మాట్లాడండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకునే లక్ష్యంతో ధ్యానించండి. స్నేహితుల్ని జ్ఞానయుక్తంగా ఎంపిక చేసుకోండి.—w19.06, 11వ పేజీ.

హింసల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడే ఏం చేయాలి?

మనం యెహోవాతో ఉన్న సంబంధాన్ని బలపర్చుకోవాలి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని, ఎన్నడూ విడిచిపెట్టడని నమ్మాలి. బైబిల్ని రోజూ చదవాలి. క్రమంగా ప్రార్థించాలి. దేవుని రాజ్యాశీర్వాదాలు నిజమౌతాయని నమ్మాలి. మీకు ఇష్టమైన లేఖనాల్ని, రాజ్యగీతాల్ని కంఠస్థం చేయాలి.—w19.07, 2-4 పేజీలు.

మన బంధువులకు మనమెలా సహాయం చేయవచ్చు?

వాళ్ల భావాల్ని అర్థంచేసుకోవడం ప్రాముఖ్యం, మన ప్రవర్తన ద్వారా సాక్ష్యమివ్వాలి, ఓపిక చూపించాలి, దయగా ఉండాలి కానీ ఒత్తిడికి లొంగిపోకూడదు.—w19.08, 15-17 పేజీలు.

మత్తయి 11:28లో యేసు మాటిచ్చినట్లు, మనమెలా సేదదీర్పును పొందుతున్నాం?

మనకు చాలా మంచి పర్యవేక్షకులు, మంచి స్నేహితులు ఉన్నారు. చేయడానికి మంచి పని ఉంది.—w19.09, 20-23 పేజీలు.

తన ఇష్టాన్ని చేయాలనే కోరికను, శక్తిని యెహోవా ఎలా ఇస్తాడు? (ఫిలి. 2:13)

మనం బైబిల్ని చదివి, ధ్యానించినప్పుడు దేవుని ఇష్టాన్ని చేయాలనే కోరికను, శక్తిని ఇస్తాడు. మనకున్న సామర్థ్యాల్ని పవిత్రశక్తి పెంచగలదు.—w19.10, 21వ పేజీ.

ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు ఏ తెలివైన పనులు చేయాలి?

ఐదు పనులు చేయాలి: లోతుగా పరిశోధన చేయాలి. తెలివి కోసం ప్రార్థించాలి. మీ ఉద్దేశాల్ని పరిశీలించుకోవాలి. నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకోవాలి. మీరు చేయగలిగినవి చేయాలి.—w19.11, 27-29 పేజీలు.

సాతాను హవ్వకు, అమర్త్యమైన ఆత్మ అనే సిద్ధాంతాన్ని పరిచయం చేశాడా?

కాకపోవచ్చు. హవ్వ చావనే చావదని సాతాను చెప్పాడు, అంతేగానీ హవ్వ శరీరం చనిపోయినా ఆమె ఆత్మ వేరే చోట జీవిస్తూనే ఉంటుందని సాతాను చెప్పలేదు. అబద్ధమతానికి సంబంధించినవన్నీ జలప్రళయంతో నాశనం అయ్యాయి. ప్రజలు బాబెలు గోపురాన్ని కడుతున్నప్పుడు, దేవుడు భాషలను తారుమారు చేసి వాళ్లు చెదిరిపోయేలా చేశాడు. బహుశా అప్పుడు, ప్రజలు తమతోపాటు అమర్త్యమైన ఆత్మ అనే సిద్ధాంతాన్ని తమ వెంట తీసుకెళ్లి ఉండవచ్చు.—w19.12, 15వ పేజీ.