కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అధ్యయన ఆర్టికల్‌ 48

“మీరు పవిత్రులుగా ఉండాలి”

“మీరు పవిత్రులుగా ఉండాలి”

“మీ ప్రవర్తనంతటిలో పవిత్రులుగా ఉండండి.”—1 పేతు. 1:15.

పాట 34 యథార్థంగా జీవించండి

ఈ ఆర్టికల్‌లో . . . *

1. తోటి క్రైస్తవులను ఏం చేయమని అపొస్తలుడైన పేతురు చెప్పాడు? దాన్ని పాటించడం ఎందుకు అసాధ్యంగా అనిపించవచ్చు?

 మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా అపొస్తలుడైన పేతురు మొదటి శతాబ్దంలోని అభిషిక్త క్రైస్తవులకు చెప్పిన విషయం నుండి ప్రయోజనం పొందవచ్చు. పేతురు ఇలా చెప్పాడు: “మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు, ఆయనలాగే మీరు కూడా మీ ప్రవర్తనంతటిలో పవిత్రులుగా ఉండండి. ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: ‘మీరు పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.’” (1 పేతు. 1:15, 16) ఈ మాటల్ని బట్టి, పవిత్రంగా ఉండే విషయంలో అత్యుత్తమ ఆదర్శమైన యెహోవాను మనం అనుకరించగలమని, పవిత్రులుగా ఉండగలమని తెలుసుకుంటాం. అలా ఉండాలి కూడా. అయితే అపరిపూర్ణులైన మనకు అది అసాధ్యం అనిపించొచ్చు. అపొస్తలుడైన పేతురు గురించి ఆలోచించండి, ఆయన ఎన్నో పొరపాట్లు చేసినా చివరికి పవిత్రంగా ఉండగలిగాడు. మనం కూడా అలా ఉండగలం.

2. ఈ ఆర్టికల్‌లో మనం ఏ ప్రశ్నల్ని చర్చిస్తాం?

2 ఈ ఆర్టికల్‌లో మనం ఈ ప్రశ్నల్ని చర్చిస్తాం: పవిత్రంగా ఉండడం అంటే ఏంటి? యెహోవా పవిత్రత గురించి బైబిలు ఏం చెప్తుంది? మన ప్రవర్తన విషయంలో పవిత్రులుగా ఎలా ఉండవచ్చు? పవిత్రులుగా ఉండడానికి, యెహోవాతో మనకున్న స్నేహానికి మధ్య సంబంధం ఏంటి?

పవిత్రంగా ఉండడం అంటే ఏంటి?

3. పవిత్రంగా ఉండే వ్యక్తి ఎలా ఉంటాడని చాలామంది అనుకుంటారు? కానీ పవిత్రంగా ఉండడమంటే ఏంటో ఎక్కడ తెలుసుకోవచ్చు?

3 పవిత్రంగా ఉండే ఒక వ్యక్తిని ఊహించుకున్నప్పుడు చాలామందికి ఎవరు గుర్తొస్తారు? ముఖంలో అస్సలు నవ్వులేకుండా, సాధువులు వేసుకునేలాంటి బట్టలు వేసుకుని, గంభీరంగా కనిపించే వ్యక్తి గుర్తొస్తాడు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే పవిత్రుడైన యెహోవా “సంతోషంగల దేవుడు” అని బైబిలు వర్ణించింది. (1 తిమో. 1:11) ఆయన్ని ఆరాధించేవాళ్లు “సంతోషంగా ఉంటారు” అని కూడా బైబిలు చెప్తుంది. (కీర్త. 144:15, అధస్సూచి) ప్రత్యేకమైన బట్టలు వేసుకున్న వాళ్లను, ఇతరులు చూడాలనే ఉద్దేశంతో మంచిపనులు చేసినవాళ్లను యేసు ఖండించాడు. (మత్త. 6:1; మార్కు 12:38) బైబిలు నుండి నేర్చుకున్న దాన్నిబట్టి, పవిత్రంగా ఉండడమంటే ఏంటో నిజక్రైస్తవులుగా మనకు తెలుసు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, మనం చేయలేనిది చేయమని ఎప్పుడూ అడగడని మనకు తెలుసు. కాబట్టి “మీరు పవిత్రులుగా ఉండాలి” అని యెహోవా చెప్పినప్పుడు, అది సాధ్యమేనని మనకు ఖచ్చితంగా తెలుసు. అయితే మన ప్రవర్తన విషయంలో పవిత్రంగా ఉండాలంటే ముందు పవిత్రంగా ఉండడమంటే ఏంటో అర్థంచేసుకోవాలి.

4. “పవిత్రమైన,” “పవిత్రత” అనే పదాలకు అర్థమేంటి?

4 పవిత్రంగా ఉండడమంటే ఏంటి? బైబిల్లో “పవిత్రమైన,” “పవిత్రత” అనే పదాలు నైతికంగా అలాగే మతపరంగా పరిశుభ్రంగా లేదా పరిశుద్ధంగా ఉండడాన్ని సూచిస్తున్నాయి. ఆ పదాలు, దేవుణ్ణి సేవించడానికి ప్రత్యేకించబడ్డారనే అర్థాన్ని కూడా ఇస్తాయి. మరోలా చెప్పాలంటే మనం నైతికంగా పరిశుభ్రంగా ఉన్నప్పుడు, యెహోవాకు నచ్చినట్టు ఆరాధించినప్పుడు, ఆయనతో దగ్గరి స్నేహాన్ని కలిగివున్నప్పుడు పవిత్రులుగా ఎంచబడతాం. యెహోవా పవిత్రుడైనా, అపరిపూర్ణులైన మనం తనకు దగ్గరి స్నేహితులుగా ఉండాలని ఆయన కోరుకోవడం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

“యెహోవా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు”

5. నమ్మకమైన దేవదూతల నుండి యెహోవా గురించి మనమేం నేర్చుకోవచ్చు?

5 యెహోవా అన్నివిధాల పవిత్రమైనవాడు. ఆయన సింహాసనానికి దగ్గరలో ఉండే ఆత్మప్రాణులైన సెరాపులు చెప్పిన మాటల్నిబట్టి ఆ విషయం అర్థమౌతుంది. వాళ్లల్లో కొంతమంది ఇలా అన్నారు: “సైన్యాలకు అధిపతైన యెహోవా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు.” (యెష. 6:3) ఈ దేవదూతలకు తమ దేవునితో దగ్గరి సంబంధం ఉండాలంటే వాళ్లు పవిత్రులుగా ఉండాలి; అలా ఉన్నారు కూడా. అందుకే వాళ్లు భూమ్మీద సందేశం చెప్పిన ప్రాంతాలు పవిత్రంగా ఎంచబడ్డాయి. మండుతున్న ముళ్లపొద దగ్గర మోషే ఉన్నప్పుడు అదే జరిగింది.—నిర్గ. 3:2-5; యెహో. 5:15.

ప్రధాన యాజకుడి తలపాగాపై ఉన్న బంగారు రేకు మీద, “పవిత్రత యెహోవాకు చెందుతుంది” అనే మాటలు చెక్కబడి ఉన్నాయి (6-7 పేరాలు చూడండి)

6-7. (ఎ) నిర్గమకాండం 15:1, 11 ప్రకారం, దేవుడు పవిత్రుడని మోషే ఎలా స్పష్టం చేశాడు? (బి) దేవుడు పవిత్రుడని ఇశ్రాయేలీయులకు ఏది గుర్తుచేసేది? (ముఖచిత్రం చూడండి.)

6 మోషే ఇశ్రాయేలీయుల్ని ఎర్రసముద్రం దాటించిన తర్వాత, తమ దేవుడైన యెహోవా పవిత్రుడని వాళ్లకు నొక్కిచెప్పాడు. (నిర్గమకాండం 15:1, 11 చదవండి.) అబద్ధ దేవుళ్లను ఆరాధించిన ఐగుప్తీయులు, కనానీయులు పవిత్రంగా లేరు. కనానీయులు తమ ఆరాధనలో భాగంగా పిల్లల్ని బలిచ్చేవాళ్లు, అసహ్యమైన లైంగిక పనులు చేసేవాళ్లు. (లేవీ. 18:3, 4, 21-24; ద్వితీ. 18:9, 10) కానీ యెహోవాకు, అబద్ధ దేవుళ్లకు చాలా తేడా ఉంది. ఆయన తన ఆరాధకుల్ని అలాంటి చెడ్డ పనులు చేయమని ఎప్పుడూ చెప్పడు. యెహోవాలో రవ్వంతైనా అపవిత్రత లేదు. ఆ విషయం, ప్రధాన యాజకుడి తలపాగాపై బంగారు రేకు మీద చెక్కబడిన మాటల్నిబట్టి స్పష్టమౌతుంది. ఆ రేకు మీద “పవిత్రత యెహోవాకు చెందుతుంది” అని ఉండేది.—నిర్గ. 28:36-38.

7 ఆ రేకు మీదున్న మాటల్ని చూసినవాళ్లకు యెహోవా పవిత్రుడని అర్థమయ్యేది. ఒక ఇశ్రాయేలీయుడు ప్రధానయాజకుని దగ్గరికి వెళ్లలేకపోవడం వల్ల, ఆ రేకును చూడకపోతే అప్పుడేంటి? అయినా అతనికి యెహోవా పవిత్రుడని తెలిసేది. ఎలాగంటే, ధర్మశాస్త్రాన్ని పురుషులు, స్త్రీలు, పిల్లల ముందు చదివినప్పుడు ప్రతీ ఇశ్రాయేలీయుడు దాన్ని విని ఆ విషయాన్ని తెలుసుకునేవాడు. (ద్వితీ. 31:9-12) మీరూ అక్కడ ఉండుంటే ఈ మాటల్ని వినేవాళ్లు: “నేను మీ దేవుడైన యెహోవాను, . . . మీరు పవిత్రులుగా ఉండాలి. ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.” “మీరు నాకు పవిత్రమైన ప్రజలుగా ఉండాలి, ఎందుకంటే యెహోవానైన నేను పవిత్రుణ్ణి.”—లేవీ. 11:44, 45; 20:7, 26.

8. లేవీయకాండం 19:2 అలాగే 1 పేతురు 1:14-16 నుండి ఏం నేర్చుకుంటాం?

8 యెహోవా ఇశ్రాయేలీయులందరికీ చదివి వినిపించమని చెప్పిన లేవీయకాండం 19:2 లో ఉన్న ఒక విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఆయన మోషేకు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల సమాజమంతటితో ఇలా చెప్పు: ‘మీరు పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవానైన నేను పవిత్రుణ్ణి.’” పేతురు ఈ లేఖనాన్ని ప్రస్తావించే తోటి క్రైస్తవులకు “పవిత్రులుగా ఉండండి” అని చెప్పుంటాడు. (1 పేతురు 1:14-16 చదవండి.) నేడు మనం మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ లేవీయకాండం 19:2 లో యెహోవా పవిత్రుడని, ఆయన్ని ప్రేమించేవాళ్లు పవిత్రంగా ఉండడానికి కృషిచేయాలనే విషయాలు నిజమని పేతురు మాటలు రుజువు చేస్తున్నాయి. మనకు పరలోక నిరీక్షణ ఉన్నా, భూనిరీక్షణ ఉన్నా ఇది నిజం.—1 పేతు. 1:4; 2 పేతు. 3:13.

“మీ ప్రవర్తనంతటిలో పవిత్రులుగా ఉండండి”

9. లేవీయకాండం 19 వ అధ్యాయాన్ని పరిశీలించడం వల్ల మనమెలా ప్రయోజనం పొందుతాం?

9 పవిత్రుడైన దేవుణ్ణి మనం సంతోషపెట్టాలని కోరుకుంటాం, కాబట్టి పవిత్రంగా ఎలా ఉండాలో నేర్చుకోవాలని అనుకుంటాం. అలా ఉండడానికి యెహోవా మనకొక సలహా ఇస్తున్నాడు. ఆ సలహా లేవీయకాండం 19 వ అధ్యాయంలో ఉంది. మార్కస్‌ కాలిష్‌ అనే ఒక హెబ్రీ విద్వాంసుడు ఇలా అన్నాడు: ‘ఈ అధ్యాయం లేవీయకాండంలో అలాగే బైబిల్లోని మొదటి 5 పుస్తకాల్లో అతిప్రాముఖ్యమైన అధ్యాయం కావచ్చు.’ ఈ అధ్యాయం “మీరు పవిత్రులుగా ఉండాలి” అనే మాటలతో మొదలౌతుంది. ఆ అధ్యాయంలోని కొన్ని వచనాల్ని చర్చిస్తూ, మన రోజువారీ జీవితంలో పవిత్రంగా ఎలా ఉండవచ్చో తెలుసుకుంటాం.

లేవీయకాండం 19:3 లో తల్లిదండ్రుల గురించిన నియమం, క్రైస్తవుల్ని ఏం చేసేలా కదిలించాలి? (10-12 పేరాలు చూడండి) *

10-11. లేవీయకాండం 19:3 మనల్ని ఏం చేయమని చెప్తుంది? అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?

10 ఇశ్రాయేలీయులు పవిత్రంగా ఉండాలని చెప్పాక, యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “మీలో ప్రతీ ఒక్కరు మీ అమ్మానాన్నల్ని గౌరవించాలి . . . నేను మీ దేవుడైన యెహోవాను.”—లేవీ. 19:2, 3.

11 తల్లిదండ్రుల్ని గౌరవించాలని దేవుడు ఇచ్చిన నియమాన్ని మనం పాటించడం ప్రాముఖ్యం. ఒక వ్యక్తి యేసును, “శాశ్వత జీవితం పొందాలంటే నేను ఏ మంచిపనులు చేయాలి?” అని అడిగినప్పుడు యేసు ఇచ్చిన జవాబును గుర్తుచేసుకోండి. అతను తన తల్లిని, తండ్రిని గౌరవించాలని కూడా యేసు చెప్పాడు. (మత్త. 19:16-19) పరిసయ్యులు, శాస్త్రులు తమ తల్లిదండ్రుల్ని చూసుకునే బాధ్యతను తప్పించుకోవడానికి చూశారు కాబట్టి యేసు వాళ్లను ఖండించాడు. వాళ్లు అలా చేయడంవల్ల, “దేవుని వాక్యాన్ని నీరుగార్చారు.” (మత్త. 15:3-6) పది ఆజ్ఞల్లో ఐదవ ఆజ్ఞ అలాగే లేవీయకాండం 19:3 లోని నియమం ‘దేవుని వాక్యంలో’ ఉన్నాయి. (నిర్గ. 20:12) తల్లిదండ్రుల్ని గౌరవించమని లేవీయకాండం 19:3 లోని నియమం, దీని ముందు లేఖనంలో ఉన్న, “మీరు పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవానైన నేను పవిత్రుణ్ణి” అనే మాటల తర్వాతే రాయబడిందని గుర్తుంచుకోండి.

12. లేవీయకాండం 19:3 లో ఉన్న నిర్దేశాన్ని మనమెలా పాటించవచ్చు?

12 యెహోవా ఇచ్చిన నియమం గురించి మనమిలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను నా తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నానా?’ మీరిప్పటివరకు మీ తల్లిదండ్రుల్ని అంతెక్కువగా పట్టించుకోలేదని అనిపిస్తే, ఇప్పుడేం చేయవచ్చో ఆలోచించండి. జరిగిపోయినదాన్ని మీరు మార్చలేరు కాబట్టి, ఇప్పుడు మీ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపడానికి, వాళ్లకు ఎక్కువ సహాయం చేయడానికి మీ శాయశక్తులా ప్రయత్నించవచ్చు. వాళ్లకు అవసరమయ్యే వస్తువులు కొనుక్కోవడానికి మీరు వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు; లేదా వాళ్లు యెహోవాతో తమ సంబంధాన్ని కాపాడుకుంటూ, ఆయన సేవ చేస్తూ ఉండడానికి సహాయం చేయవచ్చు; లేదా వాళ్లకు మానసికంగా కావాల్సిన మరింత ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ఇవ్వవచ్చు. మీరలా చేస్తే లేవీయకాండం 19:3 లో ఉన్న నిర్దేశాన్ని పాటించినట్లే.

13. (ఎ) లేవీయకాండం 19:3 నుండి మనం ఇంకా ఏ విషయాన్ని నేర్చుకోవచ్చు? (బి) లూకా 4:16-18 లో ఉన్న యేసు ఆదర్శాన్ని ఈ రోజుల్లో మనమెలా అనుకరించవచ్చు?

13 మనం పవిత్రంగా ఎలా ఉండొచ్చు అనే దానిగురించి లేవీయకాండం 19:3 మరో విషయాన్ని నేర్పిస్తుంది. అది విశ్రాంతి రోజును పాటించడం గురించి మాట్లాడుతుంది. క్రైస్తవులుగా మనం ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి ప్రతీవారం విశ్రాంతి రోజును పాటించాల్సిన అవసరం లేదు. అయినా ఇశ్రాయేలీయులు విశ్రాంతి రోజును ఎలా పాటించారో, దాన్నుండి ఎలా ప్రయోజనం పొందారో తెలుసుకోవడం వల్ల మనం ఎంతో నేర్చుకోవచ్చు. విశ్రాంతి రోజున ఇశ్రాయేలీయులు ఎలాంటి పనులు చేయకుండా దేవుణ్ణి ఆరాధించడంలో గడిపేవాళ్లు. * అందుకే యేసు విశ్రాంతి రోజున నజరేతులోని సమాజమందిరానికి వెళ్లి దేవుని వాక్యాన్ని చదివేవాడు. (నిర్గ. 31:12-15; లూకా 4:16-18 చదవండి.) లేవీయకాండం 19:3 లో “నా విశ్రాంతి రోజుల్ని పాటించాలి” అని దేవుడిచ్చిన ఆజ్ఞ, మన రోజువారీ పనులకు పెట్టే సమయంలో కొంత సమయాన్ని ఆధ్యాత్మిక విషయాలకు ఉపయోగించేలా మనల్ని పురికొల్పాలి. ఆ ఆజ్ఞని పాటించడానికి మీరింకా ఎక్కువ కృషి చేయగలరని అనిపిస్తుందా? మీరు ప్రతీరోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక విషయాలకు కేటాయిస్తే యెహోవాతో దగ్గరి సంబంధాన్ని వృద్ధి చేసుకుంటారు. అది మీరు పవిత్రంగా ఉండడానికి సహాయం చేస్తుంది.

యెహోవాతో మీ సంబంధాన్ని బలపర్చుకోండి

14. లేవీయకాండం 19 వ అధ్యాయంలో ఏ ప్రాథమిక సత్యం పదేపదే చెప్పబడింది?

14 లేవీయకాండం 19వ అధ్యాయంలో మనం పవిత్రంగా ఉండడానికి సహాయం చేసే ఒక ప్రాథమిక సత్యం పదేపదే చెప్పబడింది. 4వ వచనం, “నేను మీ దేవుడైన యెహోవాను” అనే మాటలతో ముగుస్తుంది. ఆ మాట లేదా అలాంటి అర్థాన్ని ఇచ్చే మాటలు ఈ అధ్యాయంలో 16 సార్లు కనిపిస్తాయి. అవి మనకు మొదటి ఆజ్ఞను గుర్తుచేస్తాయి: “నీ దేవుడైన యెహోవాను నేనే. నేను కాకుండా నీకు వేరే ఏ దేవుళ్లూ ఉండకూడదు.” (నిర్గ. 20:2, 3) పవిత్రంగా ఉండాలనుకునే ప్రతీ క్రైస్తవుడు యెహోవాతో తనకున్న సంబంధం కన్నా, వేరే దేనికీ లేదా వేరే ఎవ్వరికీ ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా చూసుకోవాలి. మనం యెహోవాసాక్షులుగా ఆయన పవిత్రమైన పేరును పాడుచేసే ఏ పనీ చేయకుండా ఉండాలని నిర్ణయించుకుంటాం.—లేవీ. 19:12; యెష. 57:15.

15. లేవీయకాండం 19 వ అధ్యాయంలో, బలుల గురించి ఉన్న వచనాలు మనల్ని ఏం చేయడానికి పురికొల్పాలి?

15 యెహోవా ఇచ్చిన నియమాల్ని పాటించడం ద్వారా ఇశ్రాయేలీయులు ఆయన్ని తమ దేవునిగా అంగీకరించారని చూపించారు. లేవీయకాండం 18:4 లో ఇలా ఉంది: “మీరు నా న్యాయనిర్ణయాల్ని, నా శాసనాల్ని పాటించాలి, వాటి ప్రకారం జీవించాలి. నేను మీ దేవుడైన యెహోవాను.” 19వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు పాటించాల్సిన కొన్ని “శాసనాలు” ఉన్నాయి. ఉదాహరణకు 5-8, 21, 22 వచనాల్లో జంతుబలుల గురించి ఉంది. ఇశ్రాయేలీయులు ‘యెహోవాకు చెందిన పవిత్రమైన దాన్ని అపవిత్రపర్చకుండా’ ఆ బలులు అర్పించాలి. ఆ వచనాల్ని చదివినప్పుడు, యెహోవాను సంతోషపెట్టడానికి అలాగే హెబ్రీయులు 13:15 చెప్తున్నట్లు ఆయన అంగీకరించే స్తుతి బలుల్ని అర్పించడానికి మనం పురికొల్పబడాలి.

16. లోక ప్రజలకు వేరుగా ఉండాలని లేవీయకాండం 19 వ అధ్యాయంలో ఉన్న ఏ సూత్రం మనకు గుర్తుచేస్తుంది?

16 మనం పవిత్రంగా ఉండాలంటే లోక ప్రజలకు వేరుగా ఉండడానికి ప్రయత్నించాలి. అది కష్టం కావొచ్చు. కొన్నిసార్లు తోటి విద్యార్థులు, ఉద్యోగులు, సత్యంలో లేని బంధువులు అలాగే ఇతరులు యెహోవాకు ఇష్టంలేని ఆరాధనను చేయమని మనల్ని ఒత్తిడి చేయొచ్చు. అప్పుడు మనం ఒక ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి. సరైన నిర్ణయం తీసుకునేలా మనకేది సహాయం చేస్తుంది? లేవీయకాండం 19:19 లో ఉన్న ఈ ఆసక్తికరమైన సూత్రాన్ని గమనించండి: “రెండు రకాల దారాలతో నేసిన వస్త్రాన్ని నువ్వు వేసుకోకూడదు.” ఇశ్రాయేలు ప్రజలు తమ చుట్టుపక్కలున్న జనాంగాలకు వేరుగా ఉండేలా ఆ నియమం సహాయం చేసింది. ఇప్పుడు మనం ధర్మశాస్త్రం కింద లేము కాబట్టి కాటన్‌, పాలిస్టర్‌ వంటి దారాలను కలిపి నేసిన బట్టల్ని వేసుకోవడం తప్పుకాదు. కానీ బైబిలు బోధలకు అనుగుణంగా లేని నమ్మకాల్ని, ఆచారాల్ని పాటించే ప్రజల్లా ఉండడానికి మనం నిరాకరిస్తాం. ఒకవేళ వాళ్లు మన తోటి విద్యార్థులు, ఉద్యోగస్థులు లేదా బంధువులే అయినా వాళ్లకు వేరుగా ఉంటాం. నిజమే మనం మన బంధువుల్ని, పొరుగువాళ్లను ప్రేమిస్తాం. కానీ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, చుట్టూవున్న ప్రజలకు ఆ నిర్ణయాల వల్ల మనం వేరుగా కనిపించినా యెహోవాకే లోబడతాం. కాబట్టి, మనం పవిత్రంగా ఉండాలనుకుంటే దేవుని కోసం ప్రత్యేకించబడడం చాలా ప్రాముఖ్యం.—2 కొరిం. 6:14-16; 1 పేతు. 4:3, 4.

లేవీయకాండం 19:23-25 లోని నియమం ప్రకారం ఇశ్రాయేలీయులు ఏ పాఠం నేర్చుకున్నారు? దాన్నుండి మీరేమి నేర్చుకోవచ్చు? (17-18 పేరాలు చూడండి) *

17-18. లేవీయకాండం 19:23-25 నుండి మనం ఏ ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చు?

17 “నేను మీ దేవుడైన యెహోవాను” అనే మాట, ఇశ్రాయేలీయులు తమ జీవితంలో యెహోవాతో ఉన్న సంబంధానికి అత్యంత ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలని వాళ్లకు గుర్తుచేసింది. వాళ్లు దాన్నెలా చేయవచ్చు? ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి వెళ్లాక ఏం చేయాలని లేవీయకాండం 19:23-25 వచనాలు చెప్తున్నాయో గమనించండి. (చదవండి.) ఒక వ్యక్తి ఆహారం కోసం ఏదైనా చెట్టును నాటితే మూడు సంవత్సరాల వరకు అతను దాని ఫలాల్ని తినకూడదు. నాలుగో సంవత్సరం దేవుని పవిత్రస్థలంలో అర్పించడానికి అతను ఆ ఫలాల్ని పక్కన పెట్టాలి. అతను ఐదవ సంవత్సరం మాత్రమే ఆ ఫలాల్ని తినొచ్చు. తమ అవసరాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వకూడదని అర్థంచేసుకునేలా ఇశ్రాయేలీయులకు ఈ నియమం సహాయం చేసింది. యెహోవా తమ అవసరాల్ని తీరుస్తాడని నమ్ముతూ, వాళ్లు తన ఆరాధనకు మొదటిస్థానం ఇవ్వాలని ఆయన కోరుకున్నాడు. వాళ్లు తృప్తిగా తినేంత ఆహారం ఉండేలా ఆయనే చూసుకున్నాడు. అలాగే తనను ఆరాధించే స్థలంలో ఉదారంగా కానుకలు ఇచ్చేలా వాళ్లను ప్రోత్సహించాడు.

18 లేవీయకాండం 19:23-25 లో ఉన్న నియమం, కొండమీది ప్రసంగంలో యేసు చెప్పిన మాటల్ని గుర్తుచేస్తుంది. ఆయనిలా చెప్పాడు: “ఏమి తినాలా, ఏమి తాగాలా అని . . . ఆందోళన పడడం మానేయండి.” ఆయనింకా ఇలా అన్నాడు: “మీకు ఇవన్నీ అవసరమని మీ పరలోక తండ్రికి తెలుసు.” ఆకాశపక్షుల్ని పోషించినట్టే దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. (మత్త. 6:25, 26, 32) యెహోవా మనల్ని చూసుకుంటాడని మనం నమ్ముతాం. అలాగే అవసరంలో ఉన్నవాళ్లకు ఎవ్వరికీ తెలీకుండా మనం సహాయం చేస్తాం. సంఘ ఖర్చుల కోసం కూడా ఇవ్వగలిగిన విరాళం సంతోషంగా ఇస్తాం. తన ఆరాధన కోసం మనం ఉదారంగా ఇచ్చే మద్దతును చూసి యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. (మత్త. 6:2-4) మనం ఉదారంగా ఇస్తే, లేవీయకాండం 19:23-25 లో ఉన్న పాఠాల్ని అర్థం చేసుకున్నామని చూపిస్తాం.

19. లేవీయకాండంలోని విషయాల్ని పరిశీలించడం ద్వారా మీరెలా ప్రయోజనం పొందారు?

19 లేవీయకాండం 19 వ అధ్యాయంలో కొన్ని వచనాల్ని పరిశీలించడం ద్వారా, దేవునిలా పవిత్రంగా ఎలా ఉండగలమో అర్థంచేసుకున్నాం. ఆయన ఆదర్శాన్ని అనుకరించడం వల్ల మన “ప్రవర్తనంతటిలో పవిత్రులుగా” ఉండడానికి చేయగలిగినదంతా చేస్తాం. (1 పేతు. 1:15) యెహోవాను సేవించని చాలామంది, దేవుని ప్రజల మంచి ప్రవర్తనను కళ్లారా చూశారు. దానివల్ల వాళ్లలో కొంతమంది యెహోవాను మహిమపర్చేలా కదిలించబడ్డారు. (1 పేతు. 2:12) అయితే, లేవీయకాండం 19 వ అధ్యాయం నుండి మనం ఇంకా చాలా నేర్చుకోవచ్చు. తర్వాతి ఆర్టికల్‌లో, ఆ అధ్యాయంలోని ఇంకొన్ని వచనాల్ని పరిశీలిస్తాం. అంతేకాదు పేతురు ప్రోత్సహించినట్లు మన జీవితంలో ఇంకా ఏయే విషయాల్లో పవిత్రంగా ఉండవచ్చో తెలుసుకుంటాం.

పాట 80 యెహోవా మంచివాడని రుచిచూసి తెలుసుకోండి

^ మనం యెహోవాను ఎంతో ప్రేమిస్తాం, ఆయన్ని సంతోష పెట్టాలని కోరుకుంటాం. యెహోవా పవిత్రుడు కాబట్టి తన ఆరాధకులు కూడా పవిత్రంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. అపరిపూర్ణ మనుష్యులకు అలా ఉండడం సాధ్యమేనా? అవును సాధ్యమే. అపొస్తలుడైన పేతురు తోటి క్రైస్తవులకు చెప్పిన విషయాల్ని అలాగే యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన నిర్దేశాల్ని అధ్యయనం చేయడం ద్వారా, మనం చేసే ప్రతీ పనిలో పవిత్రులుగా ఎలా ఉండవచ్చో నేర్చుకుంటాం.

^ విశ్రాంతి రోజు గురించి, దాన్నుండి నేర్చుకోగల పాఠాల గురించి తెలుసుకోవడానికి డిసెంబరు 2019 కావలికోట పత్రికలోని “పని చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ‘సమయం ఉంది’” అనే ఆర్టికల్‌ చూడండి.

^ చిత్రాల వివరణ: ఒక సహోదరుడు తన తల్లిదండ్రులతో సమయం గడుపుతున్నాడు. వాళ్లను కలవడానికి తన భార్యతో, కూతురితో వచ్చాడు. వాళ్లతో తరచూ మాట్లాడుతున్నాడు.

^ చిత్రాల వివరణ: ఒక ఇశ్రాయేలు రైతు తాను నాటిన చెట్ల ఫలాల్ని గమనిస్తున్నాడు.