కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకు జ్ఞాపకమున్నాయా?

మీకు జ్ఞాపకమున్నాయా?

మీరు ఈ సంవత్సరం కావలికోట పత్రికల్ని జాగ్రత్తగా చదివారా? అయితే, ఈ కింది ప్రశ్నలకు జవాబు ఇవ్వగలరేమో చూడండి:

సమయం తీసుకుని యెహోవాతో మాట్లాడినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన లక్షణాల గురించి ఆలోచించినప్పుడు ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?

మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం, మంచి బోధకులమౌతాం, మన విశ్వాసం మరింత బలపడుతుంది, యెహోవా మీద మనకున్న ప్రేమ ఇంకా పెరుగుతుంది.—w22.01, 30-31 పేజీలు.

యెహోవా మీద, ఆయన నియమించిన వ్యక్తుల మీద నమ్మకాన్ని ఎందుకు పెంచుకోవాలి?

పెద్దలు ఇచ్చే నిర్దేశాల్ని, వాళ్ల నిర్ణయాల్ని సందేహించకుండా యెహోవా సరైనదే చేస్తాడనే నమ్మకాన్ని ఇప్పుడే పెంచుకోవాలి. అలాచేస్తేనే, మహాశ్రమ కాలంలో వచ్చే నిర్దేశాలు అర్థంచేసుకోవడానికి, పాటించడానికి కష్టంగా అనిపించినా వాటిని వెంటనే పాటిస్తాం.—w22.02, 4-6 పేజీలు.

“[అధిపతైన] జెరుబ్బాబెలు చేతిలో లంబసూత్రం చూస్తారు” అని దేవదూత చెప్పిన మాట ఏ భరోసా ఇచ్చింది? (జెక. 4:8-10)

కొత్త ఆలయం పాత ఆలయమంత గొప్పగా లేకపోయినా అది పూర్తౌతుంది, యెహోవా కోరుకున్న విధంగా ఉంటుంది అనే భరోసా ఇచ్చింది.—w22.03, 16-17 పేజీలు.

మనం ‘మాట్లాడే విషయంలో ఆదర్శంగా’ ఎలా ఉండవచ్చు? (1 తిమో. 4:12)

పరిచర్యలో దయగా, గౌరవంగా మాట్లాడడం ద్వారా; మీటింగ్స్‌లో మనస్ఫూర్తిగా పాటలు పాడడం, కామెంట్స్‌ చెప్పడం ద్వారా; ఇతరుల్ని అవమానించడం, తిట్టడం, బాధపెట్టేలా మాట్లాడడం వంటివి చేయకుండా నిజాలే చెప్తూ, బలపర్చేలా మాట్లాడడం ద్వారా ఆదర్శంగా ఉండవచ్చు.—w22.04, 6-9 పేజీలు.

దానియేలు 7వ అధ్యాయంలోని నాలుగు మృగాలకు (ప్రభుత్వాలకు) ఉన్న పోలికలన్నీ, ఒకే మృగానికి ఉన్నట్టు ప్రకటన 13:1, 2 వచనాలు ఎందుకు చెప్తున్నాయి?

ప్రకటన 13వ అధ్యాయంలోని మృగం రోము లాంటి ఒక్క ప్రభుత్వాన్ని మాత్రమే సూచించడం లేదు. బదులుగా, ఇప్పటివరకు మనుషుల్ని పరిపాలించిన ప్రభుత్వాలన్నిటినీ సూచిస్తుంది.—w22.05, 9వ పేజీ.

యెహోవా తీర్చే న్యాయం మీద నమ్మకం ఉందని మనం ఎలా చూపిస్తాం?

ఎవరైనా మనల్ని అవమానిస్తే, బాధపెడితే, మనకు వ్యతిరేకంగా పాపం చేస్తే విషయాల్ని యెహోవాకు వదిలేస్తూ కోపం పెంచుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తాం. పాపం వల్ల వచ్చిన నష్టాన్నంతటినీ ఆయన సరిచేస్తాడు.—w22.06, 10-11 పేజీలు.

మీటింగ్‌లో ప్రార్థన చేసే సహోదరుడు ఏ విషయాల్ని మనసులో పెట్టుకోవాలి?

ఇతరులను సరిదిద్దడానికి లేదా ప్రకటనలు చేయడానికి ప్రార్థనను ఉపయోగించకూడదు. ముఖ్యంగా ప్రారంభ ప్రార్థన చేస్తున్నప్పుడు, “ఎక్కువ మాటలు” ఉపయోగించాల్సిన అవసరం లేదు. (మత్త. 6:7)—w22.07, 24-25 పేజీలు.

“నీచమైన పనులు చేసినవాళ్లు తీర్పు పొందడానికి బ్రతికించబడతారు” అంటే ఏంటి? (యోహా. 5:29)

వాళ్లు తాము చనిపోకముందు చేసిన పనుల్ని బట్టి శిక్ష పొందరు. పునరుత్థానం అయిన తర్వాత వాళ్లు చేసే పనుల్ని యేసు జాగ్రత్తగా గమనిస్తాడు అని అర్థం.—w22.09, 18వ పేజీ.

1922, సెప్టెంబరులో జరిగిన సమావేశంలో బ్రదర్‌ రూథర్‌ఫర్డ్‌ ఏమని ప్రోత్సహించాడు?

అమెరికా ఒహాయోలోని సీడార్‌ పాయింట్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఇలా ప్రోత్సహించాడు: ‘రాజు ఏలుతున్నాడు! మీరు ఆయన బహిరంగ ప్రతినిధులు. కాబట్టి రాజునూ, ఆయన రాజ్యాన్నీ ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి.’—w22.10, 3-5 పేజీలు.

కష్టాల్ని సహించడానికి యెహోవా మనకు ఏ మూడు విధాలుగా సహాయం చేస్తాడని యెషయా 30వ అధ్యాయం చెప్తుంది?

యెహోవా (1) మన ప్రార్థనల్ని వింటూ వాటికి జవాబిస్తాడని, (2) నిర్దేశాలు ఇస్తూ మనల్ని నడిపిస్తాడని, (3) ఇప్పుడు, అలాగే భవిష్యత్తులో మనల్ని దీవిస్తుంటాడని యెషయా 30వ అధ్యాయం చెప్తుంది.—w22.11, 9వ పేజీ.

కీర్తన 37:10, 11, 29లో ఉన్న మాటలు గతంలో నెరవేరాయని, భవిష్యత్తులో కూడా నెరవేరతాయని ఎందుకు చెప్పవచ్చు?

దావీదు మాటలు, సొలొమోను పరిపాలన కాలంలోని మంచి పరిస్థితుల్ని చక్కగా వర్ణిస్తాయి. యేసు భవిష్యత్తులో భూమ్మీద ఉండే పరిస్థితుల గురించి చెప్పడానికి 11వ వచనాన్ని ఉపయోగించాడు. (మత్త. 5:5; లూకా 23:43)—w22.12, 8-10, 14 పేజీలు.