కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

అనుభవం

అనుభవం

అన్నిరకాల ప్రజల మీద కరుణ చూపించండి

యెహోవా మనుషుల మీద తన కరుణను ఎలా చూపిస్తాడో వివరించే ఒక వీడియోను, న్యూజిలాండ్‌లో ఉంటున్న ఒక సిస్టర్‌ jw.orgలో చూసింది. (యెష. 63:7-9) ప్రజలకు సహాయం చేయడం ద్వారా ఆమె నేర్చుకున్నది పాటించాలని అనుకుంది. ఆమె ఆ వీడియో చూసిన కాసేపటికి, సరుకులు కొనుక్కోవడానికి వెళ్లింది. అక్కడ ఆమె రోడ్ల మీద బ్రతికే ఒకావిడను కలిసింది. ఆమెకు భోజనం తేవచ్చా అని అడిగింది. దానికి ఆవిడ ఒప్పుకుంది. మన సిస్టర్‌ భోజనంతో పాటు, బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? కరపత్రాన్ని కూడా ఇచ్చి, మంచివార్త చెప్పింది.

ఆ కరపత్రం చూసిన వెంటనే ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. ఆమె ఒక యెహోవాసాక్షిగా పెరిగిందని, చాలా సంవత్సరాల క్రితం సత్యం వదిలేసిందని చెప్పింది. కానీ ఈమధ్యే, యెహోవా దగ్గరకు తిరిగి రావాలని ప్రార్థన చేస్తుంది. మన సిస్టర్‌ ఆమెకు ఒక బైబిలు ఇచ్చి, స్టడీ కోసం ఏర్పాట్లు చేసింది. a

యెహోవాలాగే మనం కూడా ప్రజల మీద, అంటే మన బంధువుల మీద, సంఘంలో ఉన్న బ్రదర్స్‌-సిస్టర్స్‌ మీద కరుణ చూపించాలి. ఇతరులకు యెహోవా గురించి చెప్పే అవకాశాల కోసం చూడడం ద్వారా వాళ్ల మీద కరుణ చూపించవచ్చు.

a నిష్క్రియులకు ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి 2020, జూన్‌ కావలికోటలోని “నా దగ్గరికి తిరిగిరండి” అనే ఆర్టికల్‌ చూడండి.