అధ్యయనం చేయడానికి ఐడియాలు
యెహోవాకు నమ్మకంగా ఉండేవాళ్లు మాట మీద నిలబడతారు
న్యాయాధిపతులు 11:30-40 చదవండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విషయంలో యెఫ్తా నుండి, అతని కూతురు నుండి ఎంతో నేర్చుకోవచ్చు.
సందర్భాన్ని లోతుగా తవ్వండి. నమ్మకమైన ఇశ్రాయేలీయులు యెహోవాకు మొక్కుబడి చేసుకోవడాన్ని ఎలా చూసేవాళ్లు? (సంఖ్యా. 30:2) యెహోవా మీద నమ్మకం ఉందని యెఫ్తా, అతని కూతురు ఎలా చూపించారు?—న్యాయా. 11:9-11, 19-24, 36.
ఇంకాస్త లోతుగా వెళ్లండి. మొక్కుబడి చేసుకున్నప్పుడు యెఫ్తా ఏం ఆలోచించి ఉంటాడు? (w16.04 7వ పేజీ, 12వ పేరా) ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి యెఫ్తా, అతని కూతురు ఎలాంటి త్యాగాలు చేశారు? (w16.04 8వ పేజీ, 14-16 పేరాలు) నేడు క్రైస్తవులు ఎలాంటి మొక్కుబడులు చేస్తుంటారు?—w17.04 5-8 పేజీలు, 10-19 పేరాలు.
ఏం నేర్చుకోవచ్చు? ఇలా ప్రశ్నించుకోండి:
-
‘సమర్పించుకున్నప్పుడు యెహోవాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి నాకు ఏం సహాయం చేస్తుంది?’ (w20.03 13వ పేజీ, 20వ పేరా)
-
‘యెహోవా కోసం ఇంకా ఎక్కువ చేయడానికి నేను ఎలాంటి త్యాగాలు చేయవచ్చు?’
-
‘పెళ్లి ప్రమాణాలకు కట్టుబడి ఉండడానికి నేను ఏం చేయవచ్చు?’ (మత్త. 19:5, 6; ఎఫె. 5:28-33)