కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఉదారంగా ఇచ్చేవాళ్లు దీవించబడతారు

ఉదారంగా ఇచ్చేవాళ్లు దీవించబడతారు

ఎంతోకాలంగా సత్యారాధనలో బలులకు ప్రాముఖ్యమైన స్థానం ఉంది. ఇశ్రాయేలీయులైతే జంతు బలుల్ని అర్పించేవాళ్లు. క్రైస్తవులు దేవునికి “స్తుతి బలిని” అర్పించే విషయంలో ప్రసిద్ధి చెందారు. అయితే దేవున్ని సంతోషపెట్టే ఇతర రకాల బలులు కూడా ఉన్నాయి. (హెబ్రీ. 13:15, 16) ఈ కింది ఉదాహరణల్ని పరిశీలిస్తే, ఆ బలులు ఆనందంతోపాటు దేవుని దీవెనల్ని కూడా తెస్తాయని మీరు అర్థంచేసుకుంటారు.

ప్రాచీన కాలంలో జీవించిన హన్నా, నమ్మకమైన దేవుని సేవకురాలు. ఆమె మగబిడ్డ కోసం ఎంతో తపించింది కానీ ఆమెకు పిల్లలు కలగలేదు. దాంతో ఆమె యెహోవాకు ప్రార్థించి ఒక మగబిడ్డను ఇవ్వమని అడిగింది. ఒకవేళ దేవుడు తన ప్రార్థనకు జవాబిస్తే, ఆ అబ్బాయి ‘బ్రతికినన్ని రోజులు నిన్ను సేవించేలా అతన్ని నీకు ఇస్తాను’ అని యెహోవాకు మాటిచ్చింది. (1 సమూ. 1:10-11, NW) కొంతకాలానికి హన్నా గర్భవతి అయ్యి కొడుకును కనింది, ఆ అబ్బాయికి సమూయేలు అని పేరు పెట్టింది. అయితే హన్నా మాటిచ్చినట్లుగానే, తల్లిపాలు తాగడం మానేశాక సమూయేలును ప్రత్యక్ష గుడారంలో విడిచిపెట్టింది. స్వయంత్యాగ స్ఫూర్తి చూపించిన హన్నాను యెహోవా దీవించాడు. ఆమెకు మరో ఐదుగురు పిల్లల్ని ఇచ్చాడు. సమూయేలు దేవుని ప్రవక్తగా సేవచేశాడు, బైబిల్లోని కొన్ని పుస్తకాలను రాశాడు.—1 సమూ. 2:21.

హన్నా, సమూయేలులాగే సృష్టికర్తకు సేవచేయడానికి తమ జీవితాల్ని అంకితం చేసే గొప్ప అవకాశం క్రైస్తవులందరికీ ఉంది. యెహోవాను ఆరాధించడానికి మనం చేసే ఎలాంటి త్యాగానికైనా గొప్ప ప్రతిఫలం ఉంటుందని యేసు మాటిచ్చాడు.—మార్కు 10:28-30.

మొదటి శతాబ్దంలో జీవించిన దొర్కా అనే క్రైస్తవురాలు “ఎన్నో మంచి పనులు చేసేది, పేదవాళ్లకు ఎంతో సహాయం చేసేది.” కొన్ని రోజులకు ‘ఆమె జబ్బుపడి చనిపోవడంతో’ సంఘంలోని వాళ్లంతా శోకసముద్రంలో మునిగిపోయారు. అయితే పేతురు ఆ సమయానికి తమ ప్రాంతంలోనే ఉన్నాడని విన్న శిష్యులు ఆయన్ని తమ దగ్గరకు ఒకసారి రమ్మని వేడుకున్నారు. పేతురు వచ్చి దొర్కాను తిరిగి బ్రతికించినప్పుడు వాళ్లెంత సంతోషించి ఉంటారో ఒకసారి ఊహించుకోండి. అపొస్తలులు చేసిన మొదటి పునరుత్థానం కూడా అదే. (అపొ. 9:36-41) దొర్కా అర్పించిన బలుల్ని లేదా ఆమె చేసిన త్యాగాల్ని దేవుడు మర్చిపోలేదు. (హెబ్రీ. 6:10) ఆమె చూపించిన ఉదారత మనందరికీ ఆదర్శంగా ఉండేలా దానిగురించి బైబిల్లో భద్రపర్చబడింది.

అపొస్తలుడైన పౌలు కూడా సమయాన్ని వెచ్చించడంలో, శ్రద్ధను చూపించడంలో ఉదారతను చూపించి చక్కని ఆదర్శంగా నిలిచాడు. కొరింథులోని సహోదరులకు రాస్తూ పౌలు ఇలా అన్నాడు, “నా వంతుగా నేను నాకున్నవన్నీ సంతోషంగా మీకోసం ఖర్చుపెడతాను, నా సర్వస్వం ధారపోస్తాను.” (2 కొరిం. 12:15) ఇతరుల కోసం తనను తాను బలిగా అర్పించుకున్నప్పుడు లేదా త్యాగాలు చేసినప్పుడు తృప్తిగా ఉంటుందని పౌలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని ఆశీర్వాదం, అనుగ్రహం దొరుకుతాయని కూడా గ్రహించాడు.—అపొ. 20:24, 35.

వీటన్నిటిని బట్టి, రాజ్యానికి సంబంధించిన పనుల కోసం, తోటి విశ్వాసులకు సహాయం చేయడం కోసం మన సమయాన్ని, శక్తిని ధారపోసినప్పుడు యెహోవా సంతోషిస్తాడని తెలుస్తోంది. రాజ్య ప్రకటనా పనికి మద్దతివ్వడానికి ఇంకా ఇతర పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి! ఆ పనిలో కష్టపడి పనిచేయడం ద్వారానే కాకుండా, స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వడం ద్వారా కూడా మనం దేవున్ని ఘనపర్చవచ్చు. ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిని ముందుకు నడిపించడానికి, అలాగే మిషనరీలకు, ప్రత్యేక పూర్తికాల సేవలో ఉన్నవాళ్లకు మద్దతివ్వడానికి ఆ విరాళాల్ని ఉపయోగిస్తారు. అంతేకాదు మన ప్రచురణల్ని-వీడియోలను సిద్ధంచేయడానికి, అనువదించడానికి; ప్రకృతి విపత్తు సహాయక పనులకు; కొత్త రాజ్యమందిరాల్ని కట్టడానికి కూడా మనం స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాల్నే ఉపయోగిస్తారు. ‘ఉదారంగా ఇచ్చేవాడు దీవించబడతాడనే’ పూర్తి నమ్మకంతో మనం ఉండవచ్చు. అంతేకాదు, మన దగ్గరున్న విలువైన వాటిని యెహోవాకు ఇచ్చినప్పుడు మనం ఆయన్ను ఘనపరుస్తాం.—సామె. 3:9; 22:9, NW.

a భారతదేశంలోనైతే వాటిని “Jehovah’s Witnesses of India” పేరున పంపించాలి.

b భారతదేశ ప్రభుత్వం జారీచేసిన పాస్‌పోర్టు ఉన్నవాళ్లు jwindiagift.org వెబ్‌సైట్‌ను ఉపయోగించుకోవచ్చు.

c తుది నిర్ణయం తీసుకునే ముందు దయచేసి స్థానిక బ్రాంచి కార్యాలయాన్ని సంప్రదించండి.

d ‘మీ విలువైన వాటితో యెహోవాను ఘనపర్చండి’ అనే పేరుతో ఓ డాక్యుమెంట్‌ భారతదేశంలో ఇంగ్లీషు, కన్నడ, గుజరాతీ, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.